newssting
BITING NEWS :
* గోదావరిలో పర్యాటక బోటు మునక పలువురు గల్లంతు. *వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకెన్నో ఇబ్బందులు.. ఇక పోరాటమే:పవన్ కళ్యాణ్ *.హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ ...తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు *బద్వేలులో భారీ అగ్నిప్రమాదం *హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ ...కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి *మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు ..కేసీఆర్ పై భట్టి విమర్శలు *నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

భక్తుల కల నెరవేరినట్టేనా? తిరుపతిలో మద్యం బంద్

23-08-201923-08-2019 09:01:02 IST
2019-08-23T03:31:02.647Z23-08-2019 2019-08-23T03:30:46.603Z - - 15-09-2019

భక్తుల కల నెరవేరినట్టేనా? తిరుపతిలో మద్యం బంద్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి నగరంలో ఇక మద్యం అమ్మకాలు సాగించడం కుదరదు. నగరాన్ని పరమపవిత్రంగా, మద్యమాంసాలకు దూరంగా ఉంచాలన్న నాలుగు దశాబ్ధాల హిదూ భక్తుల ఆశలు నెరవేరే అవకాశం కలుగుతోంది.

గతంలో ఎన్‌టిఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలోనే తిరుపతికి వాటికన్‌ తరహా ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని ఆశించారు. కానీ అది కార్య రూపం దాల్చలేదు. తిరుమలలో మద్య, మాంసాల నిషేధం, రాజకీయ సభలు, సమావేశాలపై ఆంక్షలు విధించాలని నిర్ణయించారు.

తిరుపతి నగరాన్ని పూర్తిస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు కోరుకుంటున్నారు. ఎన్‌టిఆర్‌ చొరవతోనే తిరుమలలో మద్యమాంసాల నిషేధం అమలులోకి వచ్చింది.

ఆ తర్వాతొచ్చిన ఏ ముఖ్యమంత్రి తిరుపతికి సంబంధించి భక్తుల మనోభావాల్ని పరిగణనలోకి తీసుకోలేదు.  జగన్‌ ఎన్నికల ప్రచారంలోనే అంచెల వారీగా మద్య నియంత్రణపై హామీనిచ్చారు. ఇటీవల ప్రకటించిన కొత్త ఎక్సైజ్‌ పాలసీలో దీని అమలుకు శ్రీకారం చుట్టారు. 

మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించడంతో పాటు దుకాణాల నిర్వహణను ప్రభుత్వమే చేపట్టనుంది, ఇక ఎప్పుడు బడితే అప్పుడు మద్యం విక్రయాలు కుదరవు.  తిరుపతి పట్టణంలో కూడా పాక్షిక నియంత్రణ ప్రకటించడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి అలిపిరి వరకు మద్యం దుకాణాల్ని నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం తన కొత్త మద్యం పాలసీలో ప్రకటించింది.

5లక్షలకు పైగా జనాభా ఉన్న తిరుపతి నగరానికి రోజూ లక్షలమందికి పైగా భక్తులొస్తున్నారు. నగరం ఎంతగా విస్తరించినా భక్తులు ప్రధానంగా రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌ల నుంచి అలిపిరి మార్గంలోనే పర్యటిస్తారు. వారి మనోభావాల పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. 

భక్తులు పర్యటించే ప్రాంతాల్లో మద్యం దుకాణాల్ని అనుమతించేదిలేదని ప్రభుత్వం తేల్చేసింది. నాలుగు దశాబ్ధాల డిమాండ్‌కు ఇప్పటికైనా మోక్షం లభించడం పట్ల హిందూ భక్తులు ఆనందంతో ఉన్నారు.మద్యం నియంత్రణతో పాటు మాంసాహారం నిషేధించాలని భక్తులు కోరుతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle