newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

బ్రేకింగ్ రాయుళ్ళ బేవకూఫ్ పనులు

05-12-201805-12-2018 12:21:54 IST
Updated On 05-12-2018 12:21:51 ISTUpdated On 05-12-20182018-12-05T06:51:54.391Z05-12-2018 2018-12-05T06:51:51.980Z - 2018-12-05T06:51:51.983Z - 05-12-2018

బ్రేకింగ్ రాయుళ్ళ బేవకూఫ్ పనులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అతనికి 52 సంవత్సరాలు. సమస్య పూర్తిగా తెలీదు కానీ అదేదో భూమి తగాదా అన్నారు. పరిష్కారం కోసం గత పది నెలలుగా కలెక్టరేట్ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు. కనిపించిన వాళ్లందరికీ దండాలు పెడుతున్నాడు. ఆ రోజు సోమవారం. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రకటించిన ‘మీ కోసం’ సమయమది. పెద్దాయన వచ్చాడు. చేతిలో పురుగులమందు డబ్బా! ఇదేదో సర్వసాధారణంగా ప్రభుత్వం పట్టించుకోని వేలాది కేసులాంటిదైతే వార్తేముంది? మన ఆసామీ మీడియా కంటబడ్డాడు. ఇంకేముంది సదరు పురుగులడబ్బాలోని మందంతా తాగేవరకు ఓపిగ్గా కెమెరాల్లో బంధించారు మీడియావాళ్లు. దీనికి తోడు స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని అక్కడ పోగై ఫోటోలు, వీడియోలు తీసేసుకుంటున్న మిగతా జనం తోడయ్యారు. సమయం మించిపోతున్నా ఒక్కడంటే ఒక్కడూ అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాలనే జ్ఞానం లేదు. ఎందుకో మరి అక్కడే ఉన్న ఒక కానిస్టేబుల్ గుండె కరిగింది. పరుగుపరుగున వచ్చి అతన్ని ఆటో ఎక్కించుకుని ఆసుపత్రికి తరలించాడు. కానీ సమయం మించిపోయింది. అతను మరణించాడు.

ప్రమాదాలబారిన పడే వాళ్ళను రక్షించాలన్న కనీసపు మానవతా విలువలు మంటకలిసిపోతున్నాయి. కొన్నేళ్ళక్రితం ప్రకాశం జిల్లాలో జరిగిన ఒక సంఘటన గుర్తొస్తోంది. సరిగ్గా ఇటువంటి సంఘటనే! సమస్య పరిష్కారంకాక విసిగెత్తిన ఒక రైతు కలెక్టరాఫీసు మెట్ల మీద చేతిసంచిలో తెచ్చుకున్న పురుగుల డబ్బా తీసి, పూర్తిగా ఖాళీ చేసేదాకా కెమెరాలకు మైకం కమ్మింది. అప్పుడూ ఇదే కదా. పైగా సర్కారీ ఆసుపత్రి మైళ్ళ దూరంలో లేదు. సరిగ్గా కలెక్టరేట్ కార్యాలయం గేటు ముందే ! రాష్ట్ర హై కోర్టు స్పందించి ఆనాడు బాధ్యులైన మీడియా అమానవీయ వైఖరిని విమర్శించింది.

ఏమిటయ్యా అంటూ ఇప్పుడు జరిగిన సంఘటన గురించి ఆ పక్కనే ఉన్న పెద్ద మనిషిని ప్రశ్నిస్తే.. ‘అదేదో ప్రైవేట్ వ్యవహారంలే’ అంటూ తాపీగా జవాబిచ్చి తప్పుకున్నాడు. ఇక్కడ ప్రభుత్వ అధికారులు, మీడియా వైఖరుల్ని మాత్రమే కాదు.. తోటి మనుషులు కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరించిన తీరే అత్యంత విషాదకరం, శోచనీయం. అతని సమస్య పరిష్కారానికి సాయపడకపోగా గత్యంతరంలేక నిస్సహాయుడై ఆత్మబలిదానానికి పూనుకుంటే గద్దల్లా వాలి కెమెరా కళ్ళతో కుళ్ళపొడిచిన అక్కడ హంగామా చేసిన ‘బ్రేకింగ్ వీరుళ్ళకు’ ఉరితాళ్లు బిగించాలన్నంత కోపం వస్తోంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle