newssting
BITING NEWS :
*బాలీవుడ్ లో కరోనా కలకలం.. బిగ్ బి ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్ *దేశంలో భారీగా నమోదవుతున్న కేసులు.. 7,60,761, మరణాలు 21,018, రికవరీ అయినవారు 4,69,325 *బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ *ఇవాళ జైపూర్ లో రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం..సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం*తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం....అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం *కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి..తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం *మహబూబ్‌నగర్‌ లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌ *సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం..భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత * నేటి నుంచి మూతపడనున్న గుంటూరు మిర్చియార్డు.. ఈనెల 19వరకు మిర్చియార్డు మూసివేత *ఏపీలో మరో 1914 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,168

బ్రేకింగ్: నంద్యాలలో గ్యాస్ లీకేజ్.. ఒకరి మృతి

27-06-202027-06-2020 13:32:23 IST
Updated On 27-06-2020 14:35:00 ISTUpdated On 27-06-20202020-06-27T08:02:23.402Z27-06-2020 2020-06-27T08:02:19.505Z - 2020-06-27T09:05:00.040Z - 27-06-2020

బ్రేకింగ్: నంద్యాలలో గ్యాస్ లీకేజ్.. ఒకరి మృతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా నంద్యాలతో గ్యాస్ లీకేజీ సంచలనం కలిగించింది. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లో ఈ ఘటన జరిగింది. ఫ్యాక్టరీ నుంచి అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది. ఈ గ్యాస్ లీకేజీ ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో మృతి చెందిన వ్యక్తిని జనరల్ మేనేజర్  శ్రీనివాసరెడ్డిగా గుర్తించారు. ఆయన వయసు 50 ఏళ్ళు. 

కంపెనీలో రెండు టన్నులకు పైగా సామర్థ్యమున్న అమ్మోనియం ట్యాంకర్‌ లీకవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఫైర్‌ సిబ్బంది రంగంలోకి దిగి గ్యాస్‌ను అదుపు చేస్తోంది. ఆగ్రోప్లాంట్‌ చుట్టూ గ్యాస్‌ వ్యాపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గ్యాస్‌ లీక్‌ ఘటనపై జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ స్పందించారు. కంపెనీ లోపల మాత్రమే గ్యాస్‌ లీకైందని, బయట గ్యాస్‌ లీక్‌ ప్రమాదం లేదని స్పష్టం చేశారు.

శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో కంపెనీ జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ రెడ్డి మృతి చెందినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. గాయాలపాలైన మరో ముగ్గురి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే కలెక్టర్‌ వీరపాండియన్‌ సంఘటనా స్థలానికి చేరుకుసి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. అగ్నిమాపక, రెవెన్యూ, పోలీసు, పరిశ్రమలు, వైద్యశాఖ అధికారుల ద్వారా యుద్దప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టామని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈమధ్యే విశాఖలో ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకేజీ జరిగిన సంగతి తెలిసిందే. 15మంది మరణించారు. వందలాదిమంది గ్యాస్ లీకేజీ కారణంగా అస్వస్థతకు గురై చికిత్స అందుకుంటున్నారు. 

మండలిపై జగన్ గురి.. . నామినేటెడ్ అభ్యర్ధులు వీరేనా?

మండలిపై జగన్ గురి.. . నామినేటెడ్ అభ్యర్ధులు వీరేనా?

   22 minutes ago


పరిమళించిన మానవత్వం.. డాక్టర్ సాహసం

పరిమళించిన మానవత్వం.. డాక్టర్ సాహసం

   37 minutes ago


పాకిస్తాన్ కాదు.. దేశానికి అసలు ముప్పు చైనాతోనే.. శరద్ పవార్

పాకిస్తాన్ కాదు.. దేశానికి అసలు ముప్పు చైనాతోనే.. శరద్ పవార్

   an hour ago


ఏపీలో కరోనా వేగం.... రెడ్ జోన్ మండలాలివే

ఏపీలో కరోనా వేగం.... రెడ్ జోన్ మండలాలివే

   an hour ago


రాజ్‌భవన్‌ని తాకిన కరోనా.. 48మందికి పాజిటివ్

రాజ్‌భవన్‌ని తాకిన కరోనా.. 48మందికి పాజిటివ్

   an hour ago


అక్కడ తగ్గుతుంటే.. తెలంగాణలో ఆందోళనకరం

అక్కడ తగ్గుతుంటే.. తెలంగాణలో ఆందోళనకరం

   an hour ago


బెంగళూరులో లాక్ డౌన్.. సీఎం కార్యాచరణ

బెంగళూరులో లాక్ డౌన్.. సీఎం కార్యాచరణ

   2 hours ago


విజయసాయి వివాదాస్పద వ్యాఖ్యలు.. తెలుగు తమ్ముళ్ళ విసుర్లు

విజయసాయి వివాదాస్పద వ్యాఖ్యలు.. తెలుగు తమ్ముళ్ళ విసుర్లు

   14 hours ago


టీఎస్ఆర్జేసీ గడువు పెంపు.. ఓపెన్ స్కూల్ పరీక్షలు రద్దు

టీఎస్ఆర్జేసీ గడువు పెంపు.. ఓపెన్ స్కూల్ పరీక్షలు రద్దు

   21 hours ago


కరోనా వ్యాప్తి నిరోధంలో ధారావి విజయ పాఠం.. డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసలు

కరోనా వ్యాప్తి నిరోధంలో ధారావి విజయ పాఠం.. డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసలు

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle