newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

బ్యాంకుల్లో ఏపీ పరపతిని నిండా ముంచేసిందెవరు?

09-10-201909-10-2019 12:50:18 IST
Updated On 09-10-2019 12:53:53 ISTUpdated On 09-10-20192019-10-09T07:20:18.815Z09-10-2019 2019-10-09T07:20:13.508Z - 2019-10-09T07:23:53.725Z - 09-10-2019

బ్యాంకుల్లో ఏపీ పరపతిని నిండా ముంచేసిందెవరు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తొలిరోజునుంచి వైఎస్సార్ సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం ఎదుర్కొంటున్న పేలవమైన ఆర్ధిక పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. పూర్వ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు ఎక్కడ పడితే అక్కడ అప్పులు ఎడా పెడా చేయడం ద్వారా  రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో ముంచేశారని, ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిపడేశారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వైఎస్ జగన్ శ్వేతపత్రం కూడా విడుదల చేశారు.

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దేశంలోనే అతి పెద్దదైన భారతీయ స్టేట్ బ్యాంకు కూడా ఈ విషయాన్నే తాజాగా ధృవీకరించింది. ఆంధ్రప్రదేస్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు గత వారం లేఖరాసిన ఎస్బీఐ.. కార్పొరేషన్ చెల్లింపు సామర్థ్యంపై అనేక అనుమానాలు లేవనెత్తుతూ, ప్రభుత్వం ప్రతిపాదించిన గ్యారంటీకి విశ్వసనీయత ఉందా అని ప్రశ్నించడం సంచలనం గొల్పుతోంది. 

ఒక ప్రభుత్వ రంగ సంస్థకు మరొక ప్రభుత్వ రంగ బ్యాంకు నీ పరపతి ఏమిటి, నీ చెల్లింపుల సామర్థ్యం ఏమిటి అని నేరుగా ఉత్తరం రాయడం చాలా అరుదైన విషయం. విషయానికి వస్తే రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులను చేపట్టడం కోసం రూ. 3,000 కోట్ల టర్మ్ రుణం కావాలంటూ రాష్ట్ర విద్యుత్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇటీవలే ఎస్బీఐకి ఒక దరఖాస్తు పంపింది.

కానీ రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యం మరియు పరపతి గురించి పలు సందేహాలు వ్యక్తపరుస్తూ భారతీయ స్టేట్ బ్యాంకు తిరుగు లేఖ రాయడంతో ఖంగుతినడం విద్యుత్ ఫైనాన్స్ సంస్థ వంతయింది. 2018-19కి గాను ఆంధ్రప్రదేశ్ మొత్తం రుణం  రూ. 2.52 కోట్లకు చేరుకుందని, 2020 కల్లా ఈ మొత్తం 3 లక్షల కోట్లకు పెరుగుతుందని బ్యాంకు తెలిపింది. 

పైగా రాష్ట్రప్రభుత్వం చెల్లించాల్సిన గ్యారంటీ మొత్తం కూడా 2017లో రూ. 9,665 కోట్లు ఉండగా అది 2018 నాటికి రూ. 35,964 కోట్లకు పెరిగిపోయిందని బ్యాంకు గుర్తు చేసింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు అసాధారణ స్థాయికి పెరిగిపోయిందని ఎస్పీఐ నొక్కి చెప్పింది.

రాష్ట్రంలో అసాధారణంగా పెరిగిపోయిన రుణాల మొత్తం, మరియు చెల్లించాల్సిన గ్యారంటీ మొత్తాల స్థాయిని చూశాక, మరొక అప్పు తీసుకుని పాత అప్పులను చెల్లించడం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తాను కట్టుబడిన రుణ చెల్లింపులను గౌరవిస్తుందా అనే విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని ఎస్బీఐ తన ఉత్తరంలో పేర్కొంది.

కరకట్టమీది అద్దె ఇల్లు దాటితే ప్రత్యేక విమానం తప్ప మరొకటి ఎక్కకుండా దుబారాలో రారాజుగా పేరుమోసిన చంద్రబాబు చివరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా తలకిందులు చేశారనే విషయం ఎస్బీఐ లేఖ ద్వారా తేటతెల్లమవుతోంది. ఒక రాష్ట్ర భవితవ్యాన్నే అప్పుల పాలు చేసిన ఆర్థిక నేరానికి ఎవరు బాధ్యులు, ఎవరు చర్యలు తీసుకుంటారు అనేది తేలని ప్రశ్నగానే ఉండిపోవడం విచారకరం.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle