newssting
BITING NEWS :
*దిశ కేసులో నలుగురు నిందితులను షాద్ నగర్ లో ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు*దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ *దిశ ఘటన హెచ్చరిస్తోంది - పవన్ కళ్యాణ్ * నర పీడితులకు సరైన శిక్ష పడింది - మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ *దేశంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది, మీరు నిందితులను చంపకూడదు- ఎంపీ మేనకాగాంధీ * దిశకు తగిన న్యాయం జరిగింది - అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, నాని, పూరీజగన్నాధ్ * రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు *దిశ ఘటన తర్వాత దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది - కేజ్రీవాల్*కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్*రేపిస్టులపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.. రేపిస్టులపై దయ అవసరంలేదు.. నిందితులు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశమే ఉండకూడదన్న రాష్ట్రపతి *నిందితుల హత్యకేసుపై దిశ తల్లిదండ్రుల స్పందన.. మా బిడ్డకు తగిన న్యాయం జరిగిందని వ్యాఖ్య

బోటు మునిగిన చోట దేవతలున్నారా?

04-10-201904-10-2019 16:54:33 IST
2019-10-04T11:24:33.151Z04-10-2019 2019-10-04T11:24:30.733Z - - 06-12-2019

బోటు మునిగిన చోట దేవతలున్నారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి బోటు మునిగి 36మంది మృతిచెందగా.. మరో 15మృతి ఆచూకీ ఇంకా లభించలేదు.. కాగా బోటును వెలికితీసే ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. అయితే ఈ బోటు మునిగిన ప్రాంతం దేవతలు తెరిగే ప్రదేశమా..? అమావాస్య, పౌర్ణమి నాడు దేవతలు అక్కడ సంచరిస్తారా? 15వ తేదీనే బోటు ప్రమాదాలు జరుగుతున్నాయా..? అనే ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇది దేవతలు తిరిగే ప్రాంతమని, అందుకే ఇక్కడ సుడిగుండాలు సైతం ఎక్కువగా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు.

రెండుగంటల్లో బోటును వెలికితీస్తానని చెప్పి సంచలనంగా మారిన శివయ్య అనే వ్యక్తి సైతం ఇదే వాదన వినిపిస్తున్నాడు. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే నిజమేనేమో ఇక్కడ దేవతులు తిరుగుతున్నారా? అనే అనుమానాలు రాకమానదు. ఇందుకు ఆయన ఆధారాలనుసైతం చెబుతున్నారు. 1964, 1977, 2018, 2019 ఇలా నాలుగు సంవత్సరాల్లో జరిగిన ప్రమాదాలు 15వ తేదీనే జరిగాయని చెబుతున్నాడు. 

ఇటీవల బోటు మునిగిన ప్రాంతంలో శివకొండ ఉంటుందని, అమావాస్యకు, పౌర్ణమినాడు ఒక పులి అక్కడికి వచ్చి అరుస్తుందని స్థానికుల కథనం. కచ్చులూరి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి తన కుమారుడిని చేపల వేటకు తీసుకొని వచ్చాడని, పులి అరుస్తూ కనిపించడం జరిగిందని కథనం ఉందట. 

బోటు మునిగిన ప్రాంతంలో శివాలయం, బంగారపు శివలింగం ఉందని, పరమేశ్వరుడు మానససరోవరం నుంచి ఇక్కడికి వస్తాడని స్థానికులు చెప్పుకుంటున్నారు. 20 సంవత్సరాల క్రితం వేసవి కాలంలో మే 12, 13 తేదీల ప్రాంతంలో కచ్చులూరు గ్రామానికి చెందిన వ్యక్తి చేపల వేటకు వెళ్తే వారం రోజుల పాటు నీటిలోనే ఉండిపోయినా అతని ప్రాణాప్రాయం కాలేదని, లోపల శివాలయం ఉందనే విషయాన్ని ఊరిలో చెప్పడంతో అతను బుర్ర పగిలి చనిపోయాడని స్థానికులు కథలు కథలు కథలుగా  చెప్పుకుంటున్నారు. 

వీటిని బట్టిచూస్తే అక్కడ నిజంగానే దేవతలు సంచరిస్తున్నారా అనే అనుమానాలు కలుగక మానవు. ఇదిలా ఉంటే కొందరు వీటిని కొట్టిపారేస్తున్నారు. ఇవన్నీ ఒట్టి కట్టుకథలేనని. ఇవి నిజమని నమ్మడానికి బలమైన ఆధారాలు ఏమీ లేవని అంటున్నారు. గతం నుంచే ఇలాంటి పుకార్లు ఉన్నాయని, కేవలం అవి పుకార్లేనని కొట్టిపారేస్తున్నారు. 

నిజంగానే అక్కడ దేవతలు తిరిగే ప్రాంతం అయితే మునిగిపోయిన వారు బతికే ఉండాలని, కానీ అక్కడి ప్రదేశంలో శవాలు కుళ్ళిన వాసన వస్తుందని వాదిస్తున్నారు. మొత్తానికి బోటు మునిగిన ప్రాంతంలో దేవతలు ఉన్నారన్న అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle