newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

బోటు ప్రమాద బాధితుల్ని ఓదార్చిన జగన్

16-09-201916-09-2019 14:24:54 IST
Updated On 16-09-2019 14:48:54 ISTUpdated On 16-09-20192019-09-16T08:54:54.516Z16-09-2019 2019-09-16T08:54:52.977Z - 2019-09-16T09:18:54.775Z - 16-09-2019

బోటు ప్రమాద బాధితుల్ని ఓదార్చిన జగన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేవీపట్నంలో ఆదివారం జరిగిన బోటు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ తీవ్ర ఆవేదన చెందారు. బోటు ప్రమాద బాధితులందరికీ.. మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైద్యులను ఆదేశించారు. పూర్తిగా కోలుకున్న తర్వాతే వాళ్లందరినీ వారి వారి ఇళ్ళకు పంపించాలని సూచించారు. బోటు ప్రమాదంలో గాయపడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి సోమవారం పరామర్శించారు. 


Image

ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి పలకరించి... బాధితుల క్షేమసమాచారాలను, అందుతున్న వైద్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. తిరుపతికి చెందిన మధులత సీఎం ఎదుట కన్నీరుమున్నీరుగా విలపించడం కలచి వేసింది. తన భర్త సుబ్రహ్మణ్యంతో పాటు, కుమార్తె హాసిని మరణించారని..తాను మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Image

‘క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నన్ను డాక్టర్లు బతికించారు. నా భర్త ఎప్పుడూ మీ గురించే చెప్పేవారు. కష్టాల్లో గుండె ధైర్యం తెచ్చుకుని ఎలా బతకాలో.. చెప్తూ మీ గురించి తరచుగా ప్రస్తావించేవారు. ఇప్పుడు మీరొచ్చి నాలో ధైర్యాన్ని నింపారు’ అని సీఎం జగన్‌ ఎదుట భావోద్వేగానికి లోనయ్యారు. 

తెలంగాణలోని చిట్యాల మండలం వన్నిపాకంకు చెందిన బాధితులను కూడా సీఎం జగన్‌ పరామర్శించారు. ప్రమాదంలో కుటుంబాన్ని కోల్పోయిన జానకి రామారావుకు ధైర్యం చెప్పారు. వరంగల్‌ జిల్లా కరిపికొండెం బాధితులను పరామర్శించారు. అందరికీ మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను, మంత్రులను ఆదేశించారు.

ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలతో జగన్ మాట్లాడారు. మృతదేహాలు గ్రామాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లూ చేయాలని, బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. సీఎం జగన్‌తో పాటు మంత్రులు కన్నబాబు, ఆళ్లనాని, పినిపె విశ్వరూప్, అవంతి శ్రీనివాస్, మేకతోటి సుచరిత, తానేటి వనిత, తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్, ఎంపీ మార్గాని భరత్, పలువురు ఎమ్మెల్యేలు బాధితులను పరామర్శించిన వారిలో ఉన్నారు. అంతకుముందు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి ఏరియల్ సర్వేద్వారా పరిశీలించారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle