newssting
BITING NEWS :
*ఢిల్లీలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్... పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం*ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్..రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చీఫ్ జస్టిస్ *జగన్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు-లోకేష్ * బస్సు రోకోకి ఆర్టీసీ జేఏసీ పిలుపు.. అనుమతిలేదన్న పోలీసులు..బస్ డిపోల దగ్గర 144 సెక్షన్ విధింపు* ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న తర్వాత సోనియా గాంధీ నేతృత్వంలో తొలిసారి కీలక భేటీ*టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిపై ప్రివిలేజ్ పిటిషన్ ఇచ్చిన వైసీపీ..స్పీకర్ తమ్మినేనిని పరుష పదజాలంతో దూషించారని ఫిర్యాదు *ఎన్నికలు నాకు కొత్తేమీ కాదు.. దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ పోటీచేయాలి-వంశీ సవాల్

బోటు ప్రమాద ఘటనపై సర్వత్రా ఆందోళన

15-09-201915-09-2019 19:30:57 IST
2019-09-15T14:00:57.487Z15-09-2019 2019-09-15T14:00:35.781Z - - 16-11-2019

బోటు ప్రమాద ఘటనపై సర్వత్రా ఆందోళన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గోదావరిలో విహారం విషాదం ముగిసింది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో బోటు ప‍్రమాద సంఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తామని ఆయన అన్నారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను వినియోగించాలని, నేవీ, ఓఎన్‌జీసీ హెలికాఫర్లను సహాయక చర్యల్లో వినియోగించాలన్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ముఖ్యమంత్రి ఆర్థిక సాయం ప్రకటించారు. 

బోటు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్‌ చేశారు. ‘ ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఈ రోజు జరిగిన బోటు ప్రమాదం ఒక అతి బాధాకరమైన ఘటన. మృతుల కుటుంబాలకు నా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి’  అని ప్రధాని మోదీ ట్విట్‌ చేశారు. గోదావరిలో బోటు ప్రమాదం జరగడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి తెలిపారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

ప్రమాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయక చర్యలు వేగవంతం చేసింది. 30 మందితో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని కచులూరు వద్దకు పంపారు. రాజమహేంద్రవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌ను ఘటనా స్థలానికి పంపారు. ఇప్పటి వరకు 12 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 24 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఇంకా 25 మంది ఆచూకి తెలియాల్సి ఉంది..

మరోవైపు రాజ్యసభ  ఎంపీ సుజనా చౌదరి ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు. దేవీపట్నం బోటు ప్రమాదం విషాదకరమని, వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని కోరానన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. 

ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారిలో యాదగిరి, ప్రభాకర్‌, సురేశ్‌, దశరథం, వెంకటసాయి (వరంగల్‌) ఎండీ మజ్గర్‌, రామారావు, అర్జున్‌, జానకి రామారావు, సురేశ్‌, కిరణ్ కుమార్‌, శివశంకర్‌, రాజేశ్‌ (హైదరాబాద్‌), లక్ష్మీ గోపాలపురం, మధులత(తిరుపతి), కె.గాంధీ (విజయనగరం) ఉన్నారు. గోదావరిలో ప్రమాదానికి గురైన బోటులో హైదరాబాద్‌కు చెందిన 22 మం1ది పర్యాటకులు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వరంగల్‌కు చెందిన 14 మంది కూడా ఉన్నారు. అలాగే, ప్రమాదం జరిగినప్పుడు లాంచీలో 60 మందికి పైనే ఉన్నారని ప్రత్యక్ష సాక్షి తెలిపారు.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle