newssting
BITING NEWS :
*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

‘‘బొత్స మాట తీరు మారదా? అమరావతి శ్మశానమా?’’

27-11-201927-11-2019 15:38:48 IST
2019-11-27T10:08:48.740Z27-11-2019 2019-11-27T10:04:36.278Z - - 15-12-2019

‘‘బొత్స మాట తీరు మారదా? అమరావతి శ్మశానమా?’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహారాష్ట్ర పరిణామాలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా దేశంలో గవర్నర్ వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆయన మండిపడ్డారు.

రాజ్యాంగ దినోత్సం నాడు 'మహా' తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టుని అభినందించారు. రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన వ్యక్తులు అధికారం కోసం దిగజారి వ్యవహరించడం శోచనీయం అన్నారు. రాజ్యాంగం పై గౌరవం ఉంటే మహారాష్ట్ర గవర్నర్ ను బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్నప్పుడే రాజధానిని ప్రకటించి, ప్రధానితో శంకుస్థాపన చేశారని, ఇప్పుడు రాజధానిపై గందరగోళం సృష్టిస్తున్నారని రామకృష్ణ అన్నారు. మంత్రి బొత్స రాజధానిని శ్మశానంతో పోల్చడం దారుణం అన్నారు.

మీరు రాజధానిని శ్మశానంగా మార్చాలని చూస్తున్నారా ? అని తీవ్రంగా ప్రశ్నించారు. ఏపీలో మంత్రులు ఎం మాట్లాడుతున్నారో కూడా అర్ధం కావడం లేదన్నారు. స్పీకర్ కూడా మహిళలపట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆయన మండిపడ్డారు.

ముఖ్యమంత్రి తన జాతి రత్నాలైన మంత్రులను కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు. 25మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతామని చెప్పిన వైకాపా నాయకులు ఏం చేస్తున్నారో చెప్పాలన్నారు.

విభజన హామీలను అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన కోరారు. ఏపీ బీజేపీ నేతలు రాష్ట్రం కోసం కేంద్రంపై వత్తిడి తేవాలన్నారు. డిసెంబర్ 10 న బ్యాంక్ ఉద్యోగులు ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle