newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

బొగ్గు ఎక్కువ ధరకు కొన్నారెందుకు.. నిలదీసిన చంద్రబాబు

08-10-201908-10-2019 16:11:24 IST
2019-10-08T10:41:24.738Z08-10-2019 2019-10-08T10:41:21.274Z - - 08-12-2019

బొగ్గు ఎక్కువ ధరకు కొన్నారెందుకు.. నిలదీసిన చంద్రబాబు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ విద్యుదుత్పత్తి సంస్థ (ఏపీ జెన్‌కో) తక్కువ ధరకు కొనే అవకాశం ఉన్నప్పటికీ సింగరేణి నుంచి అధిక ధరకు బొగ్గును కొనుగోలు చేయవలసిన అవసరం ఏమిటి అంటూ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. మహానంది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి తక్కువ ధరకు బొగ్గు లభిస్తుండగా, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి అధిక ధర పెట్టి ఎందుకు కొనాల్సి వచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో తరచుగా విద్యుత్ కోతల సమస్య ఏర్పడటంపై ఏపీ ప్రభుత్వంపై గురిపెట్టిన చంద్రబాబు బొగ్గు కొనుగోలు ధరపై విమర్శల వర్షం కురిపించారు.

అయితే ఏపీ జెన్‌కో మేనేజింగ్ డైరెక్టర్ బి. శ్రీధర్ ప్రతిపక్షనేత చంద్రబాబు విమర్శను ఖండించారు. 2014 నుంచి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి  అదనపు బొగ్గును కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. విజయవాడలోని డాక్టర్ నార్ల తాతారావు థెర్మల్ పవర్ స్టేషన్ (ఎన్‌టిటిపిఎస్) కోసం మహానంది కోల్ ఫీల్డ్స్ నుంచి కేటాయించిన బొగ్గు తగినంతగా అందుబాటులో లేకపోవడం వల్లే సింగరేణి బొగ్గును అదనంగా కొనాల్సి వస్తోందని చెప్పారు. 

మహానంది కోల్ ఫీల్డ్స్ నుంచి ఎన్‌టీటీపీఎస్ కి సంవత్సరానికి 8.312 మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే వస్తుండగా, ఎన్టీటీపీఎస్ స్టేషన్‌కు మొత్తం 10 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం  అవుతోందని శ్రీధర్ చెప్పారు. కానీ మహానంది కోల్ ఫీల్డ్స్ నుంచి ఎన్టీటీపీఎస్ అవసరాల్లో 60 నుంచి 70 శాతం మాత్రమే తీరుతోందని చెప్పారు

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగిన నాటి నుంచి మహానంది కోల్ ఫీల్డ్స్ నుంచి మాత్రమే ఎన్టీటీపీఎస్‌కి లింకేజి ఇవ్వడం జరిగిందని కానీ అక్కడినుంచి 70 శాతం అవసరాలు మాత్రమే తీరుతున్నందున వ్యత్యాసాన్ని పూడ్చడానికి తప్పనిసరిగా సింగరేణి నుంచి అదనపు బొగ్గు తీసుకుంటున్నామని ఏపీ జెన్‌కో థెర్మల్ పవర్ డైరెక్టర్ జి. చంద్రశేఖర రాజు వివరించారు.

2014-15, 2015-16 సంవత్సరాలకు గాను సింగరేణి నుంచి ఈ వేలం పాట ధరకు బొగ్గు కొన్నామని, ఆ తర్వాత ఏపీ జెన్ కో సింగరేణితో ఒప్పందం కుదుర్చుకుని 20 శాతం అదనపు ధరకు బొగ్గును కొంటున్నామని, ఇది ప్రకటిత ధరకంటే ఎక్కువని ఏపీ జెన్ కో అధికారులు వివరించారు. 2018-19 నుంచి నాన్ పవర్ సెక్టర్ కోసం ప్రాథమిక ధర కింద 20 శాతం అదనపు ధరను సింగరేణికి చెల్లిస్తున్నామని చెప్పారు. సింగరేణికి చెల్లించే ధర కూడా కేంద్ర బొగ్గుగనుల శాఖ రూపొందించిన నూతన బొగ్గు పంపిణీ విధానం పైనే ఆదారపడిందిని చంద్రశేఖర్ చెప్పారు. గతంలో టీడీపీ ప్రభుత్వం కూడా ఇదే ధరను అనుసరించిందని గుర్తు చేశారు.

2016-17లో సింగరేణితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మిలియన్ టన్నుల బొగ్గుకు 50 లక్షల రూపాయలకు ధర కుదిరిందని, 2019-20కి కూడా అదే ధరతోటే ఒప్పందం కుదుర్చుకున్నామని చంద్రశేఖర్ వివరించారు.అయితే గతవారం చివర్లో చంద్రబాబు చేసిన ట్వీట్ అసలు వాస్తవాన్ని మరుగున పర్చేదిగా ఉంది. సోలార్, విండ్ పవర్‌కు, బొగ్గుకు ముడిపెట్టి విషయాన్ని గందరగోళపర్చడంలో చంద్రబాబు ఉద్దేశం అర్థం కావడం లేదు. ఆయన చేసిన ట్వీట్ ఇది.

పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల (పిపిఏ)పై దుష్ప్రచారం చేసి సోలార్, విండ్ పవర్ యూనిట్ ధర రూ.3 నుంచి రూ.4.84కే వస్తుంటే, శ్రద్ధ పెట్టకుండా ఇప్పుడు రూ.11.68కు విద్యుత్ కొనడం దుర్మార్గపు చర్య కాదా? మహానది కోల్ మైన్స్ లో టన్ను ధర రూ.1600 ఉంటే, సింగరేణిలో రూ.3,700కు కొనడాన్ని ఏమనాలి? అని చంద్రబాబు ఎత్తి చూపారు.

సింగరేణి వద్దనుంచి అంత అధిక ధరకు బొగ్గు ఎందుకు కొంటున్నామన్నది కూడా ఏపీ జెన్‍‌కో డైరెక్టర్ స్పష్టంగా చెప్పారు. మహానంది కోల్ ఫీల్డ్స్ నుంచి ప్రాథమిక థరకే అంటే 1,600లకే టన్ను బొగ్గు ధర లభిస్తోంది కానీ కేంద్ర బొగ్గు సంస్థ విధించిన అదనపు ఖర్చులతోపాటు రవాణా ఖర్చుల వల్ల కూడా సింగరేణి బొగ్గును టన్నుకు రూ. 3,700లకు కొనాల్సివస్తోందని జెన్‌కో వివరించింది.

పైగా సోలార్, విండ్ పవర్ ద్వారా అధిక పన్నులతో విద్యుత్ కొనుగోలు జరుపుతున్నందుకే రాష్ట్రం ఆర్థిక సంక్షోభం బారిన పడిందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. పాత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను పున:సమీక్షించకూడదని కేంద్ర విద్యుత్, పునర్వినియోగ ఇంధన మంత్రి ఆర్ కే సింగ్ ఉత్తరం రాసినా జగన్ తన మాటకే కట్టుబడ్డారు.  దివాళా తీసిన గత ప్రభుత్వ విధానాల వల్లే ఏపీ 2.64 లక్షల కోట్ల భారీ లోటు భారాన్ని అనుభవిస్తోందని జగన్ చెప్పారు. దీనివల్లే డిస్కమ్స్ చెల్లించని జనరేటర్ బకాయిలు రూ. 20,000 కోట్లకు చేరుకోగా డిస్కమ్‌ల నష్టాలు రూ. 15,000 కోట్లకు చేరుకున్నాయని జగన్ వివరించారు.

విండ్ మరియు సోలార్ విద్యుత్‌ను కొనాలంటేనే భయవేస్తోందన్న వైఎస్ జగన్ ప్రభుత్వ వాదన కూడా అర్థం చేసుకోదగినదే. 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle