newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

బైరెడ్డి సొంత కుంప‌టి - న‌ష్ట‌మా..? లాభ‌మా..?

04-10-201904-10-2019 11:16:52 IST
Updated On 04-10-2019 12:42:03 ISTUpdated On 04-10-20192019-10-04T05:46:52.872Z04-10-2019 2019-10-04T05:46:49.987Z - 2019-10-04T07:12:03.127Z - 04-10-2019

బైరెడ్డి సొంత కుంప‌టి - న‌ష్ట‌మా..? లాభ‌మా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బైరెడ్డి సిద్ధార్ధ‌రెడ్డి, క‌ర్నూలు వైసీపీ నేత‌ల్లో ఒక‌రు. నిండా 30 ఏళ్లు లేవు. కానీ క‌ర్నూలు రాజ‌కీయాల్లో ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్ధ‌రెడ్డి పేరు మారుమోగుతోంది. సీమ యాస‌, స‌మ‌ర‌సింహారెడ్డి స్టైల్ మీసంతో సిద్ధార్ధ‌రెడ్డి సోష‌ల్ మీడియా స్టార్‌గా మారారు.

యూత్‌ను అత్యంత వేగంగా ఆక‌ర్షించే నేత‌గా బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డికి గుర్తింపు ఉంది. నందికొట్కూరు రాజ‌కీయాల్లో మొన్న‌టి వ‌ర‌కు బైరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి గౌరు వెంక‌ట‌రెడ్డిల మాట చెల్లుబాటు అయ్యేది. కానీ ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు బైరెడ్డి సిద్దార్ధ‌రెడ్డి చూట్టూరా తిరుగుతున్నాయి.

మొన్న‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో క‌ర్నూలు ఒక‌టి. నందికొట్కూరులో 40వేల‌కు పైగా మెజార్టీ వ‌చ్చింది. వైఎస్ కుటుంబానికి స‌న్నిహితంగా ఉన్న ఆర్థ‌ర్ ఎమ్మెల్యే అయ్యారు. నియోజ‌క‌వ‌ర్గంలో పెత్తనం ఎవ‌రిది అన్న‌దానిపై ఇప్పుడు వార్ మొద‌లైంది.

మొద‌ట్లో ఇద్ద‌రి మ‌ధ్య కోల్డ్ వార్ న‌డిచింది. కానీ, ఇప్పుడు ఆ వార్ ఎపెన్ అయింది. గ్రామాల్లో రెండు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ‌ల‌కు దారి తీస్తోంది. పాఠ‌శాల పేరెంట్స్ క‌మిటీ ఎన్నిక‌లు ఈ గొడ‌వ‌ల‌కు మ‌రింత ఆజ్యం పోశాయి. పాత‌కోట‌, త‌ల‌ముడిపి గ్రామాల్లో త‌మ అనుచ‌రుల‌ను గెలిపించేందుకు రెండు వ‌ర్గాలు తీవ్రంగా ప్ర‌య‌త్నించాయి.

పాత‌కోట‌లో ఎమ్మెల్యే వ‌ర్గీయుడు వెంక‌ట్‌రెడ్డిపై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌తో సిద్దార్థ‌రెడ్డి స‌హా ఆయ‌న వ‌ర్గీయుల‌పై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదైంది. నియోజ‌క‌వర్గంలోని ప్ర‌తి ప‌ల్లెలో ఇదే ప‌రిస్థితి ఉంది. సిద్దార్థ‌రెడ్డికి స‌పోర్టు చెయ్యాలా..? ఎమ్మెల్యే వెంట న‌డ‌వాల్నా..? అన్న‌దానిపై కార్య‌క‌ర్త‌లు ఎటూ తేల్చుకోలేక‌పోతున్నారు. ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య న‌లిగిపోతున్నారు.

మ‌రోవైపు రాబోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో త‌న‌ను న‌మ్ముకున్న వారికి టికెట్లు ఇప్పించుకుని గెలిపించుకోవాల‌ని సిద్ధార్థ‌రెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే ఎమ్మెల్యేగా త‌న మాట‌కు విలువ‌లేక‌పోతే ఎలా అన్న‌ది ఆర్థ‌ర్ ప్ర‌శ్న‌. ఇద్ద‌రు నేత‌లు వైఎస్ కుటుంబానికి విధేయులే.

దీంతో ఈ వివాదం సీఎం జ‌గన్ వ‌ద్ద‌కు చేరిన‌ట్టు తెలుస్తుంది. ఈ వివాదానికి సీఎం జ‌గ‌నే ఫుల్‌స్టాప్ పెడ‌తార‌ని నందికొట్కూరు కార్య‌క‌ర్త‌లు వెయిట్ చేస్తున్నారు. ఒక‌వేళ ఈ ఆదిప‌త్య‌పోరు ఎటు తేల్చ‌క‌పోతే మాత్రం స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నాటికి పార్టీని దెబ్బ‌తీసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle