newssting
BITING NEWS :
*దిశ కేసులో నలుగురు నిందితులను షాద్ నగర్ లో ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు*దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ *దిశ ఘటన హెచ్చరిస్తోంది - పవన్ కళ్యాణ్ * నర పీడితులకు సరైన శిక్ష పడింది - మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ *దేశంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది, మీరు నిందితులను చంపకూడదు- ఎంపీ మేనకాగాంధీ * దిశకు తగిన న్యాయం జరిగింది - అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, నాని, పూరీజగన్నాధ్ * రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు *దిశ ఘటన తర్వాత దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది - కేజ్రీవాల్*కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్*రేపిస్టులపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.. రేపిస్టులపై దయ అవసరంలేదు.. నిందితులు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశమే ఉండకూడదన్న రాష్ట్రపతి *నిందితుల హత్యకేసుపై దిశ తల్లిదండ్రుల స్పందన.. మా బిడ్డకు తగిన న్యాయం జరిగిందని వ్యాఖ్య

బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డిపై మైసూరారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

09-10-201909-10-2019 15:18:44 IST
Updated On 09-10-2019 15:22:24 ISTUpdated On 09-10-20192019-10-09T09:48:44.488Z09-10-2019 2019-10-09T09:47:31.195Z - 2019-10-09T09:52:24.947Z - 09-10-2019

బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డిపై మైసూరారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బైరెడ్డి సిద్దార్థ‌రెడ్డి, రాయ‌ల‌సీమ అన‌గానే మొట్ట మొద‌ట గుర్తుకొచ్చే వారి పేర్ల లిస్టులో చేరిన వ్య‌క్తి. ఈ ప్రాంతం నుంచి ఎంతో మంది పెద్ద పెద్ద రాజ‌కీయ సీనియ‌ర్ నేత‌లు ఉన్నా.. ఇటీవ‌ల కాలంలో మాత్రం ఈ పేరు అంద‌రి నోళ్ల‌లో ఎక్కువ‌గా నానుతూ వ‌స్తోంది. దీంతో అస‌లు బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డికి అంత ఫైర్ ఎందుకు వ‌చ్చింది..?  అంత క‌సి ఎందువ‌ల్ల‌..? అన్న ప్ర‌శ్న‌లు ఇప్పుడు రాజ‌కీయ విశ్లేష‌కుల్లో చ‌ర్చ‌కు దారి తీస్తున్న సంగ‌తి తెలిసిందే.

యూత్ పొలిటిక‌ల్ స్టార్‌గా మారిన బైరెడ్డి సిద్ధార్ధ‌రెడ్డికి నిండా 30 ఏళ్లు లేకున్నా కానీ క‌ర్నూలు రాజ‌కీయాల్లో మాత్రం ఆయ‌న పేరు మారుమోగుతోంది. సీమ యాసను అచ్చుగుద్దిన‌ట్టు ప‌ల‌క‌డంతోపాటు, ఫ్యాక్ష‌న్ స్టైల్ కోర‌ మీసంతో సిద్ధార్ధ‌రెడ్డి యూత్ పొలిటిక‌ల్ స్టార్‌గా మారారు. త‌న వాగ్ధాటితో యువ‌త‌ను ఆక‌ట్టుకోవ‌డం బైరెడ్డి సిద్ధార్ధ‌రెడ్డి ప్ర‌త్యేక‌త‌. ఆ వ్య‌క్తిత్వ‌మే నందికొట్కూరు రాజ‌కీయాల్లో బైరెడ్డి సిద్దార్ధ‌రెడ్డిదే పైచేయి సాధించేలా తీర్చిదిద్దింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇదిలా ఉండ‌గా, క్రియాశీల రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్న మైసూరారెడ్డి బైరెడ్డి సిద్ధార్ధ‌రెడ్డిని ఉద్దేశిస్తూ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఓ ప్ర‌ముఖ సోష‌ల్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ మాట‌లు అన్నారు. రాయ‌ల‌సీమ కోసం ఎవ‌రు కృషి చేసినా తాను సంతోషిస్తాన్నారు. అందుకు బైరెడ్డి సిద్ధారెడ్ఢి మిన‌హాయింపు కాద‌న్నారు. యువ‌కుడిగా రాజ‌కీయాల్లో రాణిస్తున్న సిద్ధార్థ‌రెడ్డిని ప్రోత్స‌హించేందుకు తానెప్పుడూ ముందుంటాన‌న్నారు.

రాయ‌ల‌సీమ ప్రాంతానికి మేలు జ‌రిగేందుకు ఎవ‌రు ఏం చేసినా అందులో తాను ప్ర‌థ‌మ‌పాత్ర పోషిస్తాన‌ని మూసూరారెడ్డి చెప్పుకొచ్చారు. ఇటీవ‌ల జ‌రిగిన నందికొట్కూరు గొడ‌వ‌ల్లో సిద్దార్థ‌రరెడ్డి పేరు విన‌ప‌డింద‌ని, రాయ‌ల‌సీమ‌లో వైసీపీ జెండాలు ఎగిరాయంటే అందుకు ప్ర‌ధాన కార‌ణం బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డేనంటూ రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం అభిప్రాయ‌ప‌డుతున్నార‌న్నారు.

ఇటీవ‌ల ఓ సర్వే విడుద‌ల చేసిన ఫ‌లితాల్లో దేశం మొత్తం మీద మంచి సీఎంలు ఎవ‌రు అన్న ప్ర‌శ్న‌కు సంబ‌బంధించి  తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు ఐదో స్థానంలో ఉంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి మూడో స్థానం ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌ర్వేపై స్పందించిన మైసూరారెడ్డి త‌న‌దైన శైలిలో ఎద్దేవ చేశారు.

ఐద‌డుగుల ఆరు అంగుళాలు ఎవ‌రు ఉంటారో వారికే ప్ర‌థ‌మ ర్యాంకు అనేలా సర్వే వారు వ్య‌వ‌హ‌రిస్తార‌న్నారు. డ‌బ్బులు ఎవ‌రు ఇస్తారో.. వారికే బెస్ట్‌ ర్యాంకులు కేటాయించేందుకు స‌ర్వే వారు ముందుకొస్తార‌న్నారు. ఎవ‌రు బెస్ట్‌..? ఎవ‌రు వ‌ర‌స్ట్..? అన్న‌ది ఐదేళ్ల త‌రువాత తేలుతుంద‌న్నారు. ఏదేమైనా సీఎం జ‌గ‌న్‌, బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డిల‌పై మైసూరారెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు హాట్ ఆఫ్ ద టాపిక్ అయ్యాయి.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle