newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

బెట్టింగ్ దందాలు... కోట్లలో పందేలు

08-12-201808-12-2018 13:20:55 IST
Updated On 08-12-2018 17:51:09 ISTUpdated On 08-12-20182018-12-08T07:50:55.566Z08-12-2018 2018-12-08T07:50:52.792Z - 2018-12-08T12:21:09.702Z - 08-12-2018

బెట్టింగ్ దందాలు... కోట్లలో పందేలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణాలో ఎన్నికల ఫీవర్ నడుస్తోంది . బెట్టింగ్స్ దందా ఏపీలోనూ కాకరేపుతోంది.అసెంబ్లీ రద్దైనప్పుడే ఈ వ్యవహారం మొదలైంది. ఆ సమయంలో టిఆర్ఎస్‌కే ఎక్కువ ఆదరణ ఉండడంతో... తిరిగి అదే పార్టీ అధికారంలోకి వస్తుందని కోట్లలో పందేలు వేశారు. ప్రజాకూటమి ఎంట్రీతో దీని జోరు మరింత పెరిగింది. పోటీ తీవ్రం కావడంతో ఏ పార్టీ అధికారంలోకి రావొచ్చు, దేనికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎగ్జిట్ పోల్స్‌లో ఏది ముందంజలో ఉంటుందనే అంశాలపై బెట్టింగ్స్ జరిగాయి. బెట్టింగ్ దందాలు మన దేశంలో కొత్తేమీ కాదు. ఇది చట్టవిరుద్ధం అయినప్పటికీ... తెరవెనుక వ్యవహారం మొత్తం తాపీగా జరుగుతుంటుంది. రూపాయికి పది రూపాయలు వస్తాయని బుకీలు వేసే ఎరకు టెంప్ట్ అయ్యి... ఆసక్తి లేనివారు సైతం ఇందులో పాల్గొంటారు. క్రీడలు, సినిమాలు, ఎన్నికలు... ఇలా ప్రతి ఒక్కదానిపై బెట్టింగ్స్ నిర్వహిస్తుంటారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఏపీలో ముఖ్యంగా భీమవరంలో భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి. 

తెలంగాణ ఎన్నికలు ముగిసిన అనంతరం బెట్టింగ్స్ జోరుకి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఎగ్జిట్ పోల్స్‌లో జాతీయ మీడియా మొత్తం టిఆర్ఎస్‌కే అనుకూలంగా ఫలితాలు సర్వేలు ఇవ్వడంతో... ఆ పార్టీయే తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కోట్లలో బెట్టింగ్స్ జోరందుకున్నాయి. ఇంతలో లగడపాటి రాజగోపాల్ నేషనల్ ఛానెల్స్‌కి వ్యతిరేకంగా ప్రజాకూటమికి పట్టం కట్టడంతో సీన్ మళ్ళీ రివర్స్ అయ్యింది. లగడపాటి సర్వేలకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి... ఆయన చెప్పేది దాదాపు నిజమవుతుందనే నమ్మకంతో ప్రజాకూటమిపై బెట్టింగ్స్ వేయడం స్టార్ట్ చేశారు. ఏయే నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థి గెలుస్తారు? ఎవరికెంత మెజారిటీ వస్తుంది? కచ్ఛితమైన అంచనా ఎంత? అనే అంశాలపై కూడా రూ.50 వేల నుంచి మొదలు కోట్లలో పందేలు కాస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, రామగుండం, ఖమ్మం జిల్లాలతో పాటు విజయవాడ, వైజాగ్, తిరుపతి, ఏలూరుల్లో  ఈ ట్రెండ్ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా మెజారిటీ అభ్యర్థులు, కీలక స్థానాల్లో ఈ పందేల జోరు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

హైదరాబాద్ పరిధిలోని దాదాపు 15 స్థానాలపై బుకీలు దృష్టి సారించినట్లు తెలిసింది. ఈ ఫలితాలపై ఏపీలో బెట్టింగ్‌లు కోట్లలో జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి సీట్లలో గెలుపు ఎవరిది అనేదానిపై భారీగా బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. టీఆర్ఎస్ కంటే ప్రజాకూటమి విజయం పైనే వీరు కోట్ల రూపాయలు పందాలు కాస్తున్నారు. టీడీపీ, కూటమి-టీఆర్ఎస్ పార్టీల మధ్య పోటీ ఎక్కువగా ఉండడంతో... ఆ సీట్లపై బుకీలు ఆసక్తి చూపుతున్నారు. ఈ పందేల కోసం ప్రత్యేకమైన వెబ్‌సైట్‌లు ప్రారంభించడమే కాదు... ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలోనూ ఈ తంతు నడుస్తోందంటే... ఏ మేరకు బెట్టింగ్స్ జరుగుతున్నాయో అంచనా వేయొచ్చు. ఓవైపు పోలీసులు హెచ్చరిస్తున్నా... బెట్టింగ్ దందా మాత్రం మూడు పూలు ఆరు కాయలులాగా సాగిపోతోంది. లగడపాటి సర్వేకు అనుగుణంగా కూడా బెట్టింగ్‌లు మారిపోతున్నాయి. కొంతమంది బెట్టింగ్ రాయుళ్ళు ఏ పార్టీపై పందెం వేయాలో తెలీక అయోమయానికి గురవుతున్నారు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle