newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

బెజవాడ టిక్కెట్ పొట్లూరికేనా?

13-03-201913-03-2019 17:43:34 IST
Updated On 13-03-2019 17:56:39 ISTUpdated On 13-03-20192019-03-13T12:13:34.261Z13-03-2019 2019-03-13T12:13:32.469Z - 2019-03-13T12:26:39.084Z - 13-03-2019

బెజవాడ టిక్కెట్ పొట్లూరికేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైసీపీలో చేరిన వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్, విజయవాడ లోక్ సభ సీటు నుంచి పోటీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మొన్నటి దాకా విజయవాడ లోక్‌సభ సీటు నుంచి టీడీపీ సీనియర్ నేత దాసరి జైరమేష్ బరిలో దిగుతారన్న వార్తలు వచ్చాయి. అయితే తాజాగా పీవీపీ చేరికతో వైసీపీలో విజయవాడ ఎంపీ సీటు ఆయనకే ఖాయమంటూ జగన్ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఈ విషయం మీద దాసరి జై రమేష్‌ను జగన్ ఒప్పించారనీ... ఆయన సోదరుడు దాసరి బాలవర్ధనరావుకు గన్నవరం అసెంబ్లీ టిక్కెట్ ఇస్తానని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

అంటే... ఇప్పుడు బెజవాడ ఎంపీ సీటు నుంచి పొట్లూరి వరప్రసాద్ పోటీ ఖాయమైనట్లు తెలుస్తోంది. ఒకవేళ బాపట్ల ఎంపీ సీటు నుంచి పోటీకి కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పనబాక లక్ష్మీ ఒప్పుకుంటే జగన్ ఆమెకే టిక్కెట్ ఇస్తారట. అయితే పనబాక లక్ష్మి,  తిరుపతి ఎంపీ సీటు కోరుతున్నట్లు తెలుస్తోంది.

పనబాక లక్ష్మీ అనుకున్నదే జరిగితే... అప్పుడు దాసరి జై రమేష్,  బాపట్ల ఎంపీ సీటు నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ బాపట్ల సీటు కూడా దాసరికి దక్కకపోతే... ఆయనకు జగన్ ఏ విధంగా న్యాయం చేస్తారన్న దానిపై వైసీపీ నేతల్లో ఆసక్తి పెంచుతోంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle