newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

బెజవాడలో బాబుగారు ఉండే ఇల్లు ఇదే!

26-06-201926-06-2019 18:54:19 IST
Updated On 26-06-2019 20:13:41 ISTUpdated On 26-06-20192019-06-26T13:24:19.455Z26-06-2019 2019-06-26T13:24:17.579Z - 2019-06-26T14:43:41.980Z - 26-06-2019

బెజవాడలో బాబుగారు ఉండే ఇల్లు ఇదే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
2019 చివరి నాటికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు అందిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు ఇప్పుడు తనే ఒక ఇంటి కోసం వెతుక్కోవడం అనూహ్యం. విధి వైచిత్రి అంటే ఇదేనేమో! ఎక్కడో గిరిజన ప్రాంతంలో పోలవరం నిర్వాసితుల కోసం సెంటు స్థలంలో నిర్మించే ఇంటిని కూడా అందంగా, సౌకర్యవంతంగా ఉండాలని ముఖ్యమంత్రిగా తన చిట్టచివరి సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించిన చంద్రబాబు.. ఇప్పుడు ఎలా వున్నా ఫర్లేదు, అత్యవసరంగా తన నివాసాన్ని మార్చాలని చెప్పి ఆఘమేఘాల మీద అద్దె ఇంటి వేటలో పడటం ఇక్కడ ప్రస్తావనార్హం. 

Image may contain: sky, tree and outdoor

నవ్యాంధ్ర పాలనను సొంతనేలపై సాగించాలన్న పట్టుదలతో మరో ఆలోచన లేకుండా పదేళ్లు అవకాశం ఉన్న ఉమ్మడి రాజధానిని వదిలి విజయవాడ వచ్చేసినప్పుడు సగటు సాధారణ ఉద్యోగి పడిన వెతలే ఇప్పుడు చంద్రబాబుకు అనుభవం అవుతుండవచ్చు.

నెలకు ఆరువేలు అద్దె వచ్చే రెండు పడక గదుల ఇంట్లో ఆల్రెడీ నివాసం వుంటున్న వారిని ఖాళీచేయించి కొత్తగా పది, పదిహేను వేల అద్దెకు ఇచ్చిన విజయవాడ సొంత ఇళ్ల వాళ్లు.. తాజాగా చంద్రబాబు కోసం మళ్లీ టులెట్ బోర్డులు పెట్టిస్తున్నారు. 

Image may contain: outdoor

ఉండవల్లిలోని అక్రమ నిర్మాణం ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ ఒకపక్క కొనసాగుతుండగానే, ఆ పక్కనే ఉంటున్న చంద్రబాబు వెంటనే తన నివాసం మార్చేయాలని గట్టిగా నిర్ణయానికొచ్చారు.

జగన్ ప్రభుత్వం ఇదే దూకుడు ప్రదర్శించి వరుస క్రమంలో ఇప్పుడు తాను ఉంటున్న ఇంటిని కూడా ఏ క్షణమైనా నోటిసిచ్చి కూల్చివేస్తుందన్న ప్రచారం జరుగుతుండటమే దీనికి కారణం. చంద్రబాబు నివాసం సైతం అక్రమ నిర్మాణమేనని అధికార పక్ష నేతలు చెబుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి ఖాళీ చేసేయాలని బాబు స్థిర నిర్ణయానికి వచ్చారు. 

అనువైన నివాసం దొరికిన వెంటనే, అక్కడి నుంచి వెళ్లిపోవాలని మెజార్టీ టీడీపీ నేతలు ఆయనకు సూచించినట్టు ప్రచారం జరుగుతోంది. దరిమిలా చంద్రబాబు కొత్త ఇంటి వేటలో పడ్డారు. విజయవాడలో కొన్ని సంపన్న వర్గాల నివాస ప్రాంతాల్లో కొందరు పార్టీ సానుభూతిపరులకు చెందినవారు ఆయనకు ఇల్లు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు.

Image may contain: house, tree, sky and outdoor

అలాంటివారు ప్రతిపాదించిన అతిధి గృహాల జాబితాను చంద్రబాబు పరిశీలించారు. క్వాలిటీ ఐస్ క్రీమ్ గెస్ట్ హౌస్, గ్రావెల్ ఇండియా అతిథి గృహం, మరో గెస్ట్ హౌస్ చూశాక చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. 

Image may contain: sky, tree, house, motorcycle and outdoor

వీటిని ఇప్పటికే టీడీపీ నేతలు పరిశీలించినట్టు చెబుతున్నారు. పోరంకి-నిడమానూరు వంద అడుగుల రహదారి మార్గంలో గల కామినేని ఆసుపత్రి సమీపంలో గ్రావెల్ ఇండియా అతిధి గృహానికి బాబు కుటుంబసభ్యులు మొగ్గు చూపారని తెలుస్తోంది. ఈ ఇంటినే ఇప్పుడు చంద్రబాబు కూడా ఓకె చేసినట్టు తెలుస్తోంది. 

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   9 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   10 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   11 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   13 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   15 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   15 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   15 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   15 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   15 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   16 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle