newssting
BITING NEWS :
*ఇవాళ గురుపూర్ణిమ.. చంద్రగ్రహణం **దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

బెజవాడలో ట్రాఫిక్ ఆంక్షలు... ఎక్కడెక్కడ అంటే?

01-07-202001-07-2020 09:12:54 IST
2020-07-01T03:42:54.024Z01-07-2020 2020-07-01T03:42:42.799Z - - 05-07-2020

బెజవాడలో ట్రాఫిక్ ఆంక్షలు... ఎక్కడెక్కడ అంటే?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విజయవాడలో  108, 104 నూతన వాహనాల ప్రారంభోత్సవం సందర్భంగా నగరంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. ట్రాఫిక్ ఆంక్షలు అమలుచేయనున్నారు. గుంటూరు మీదుగా విజయవాడలోకి లారీలు, భారీ వాహనాలను అనుమతించమని ఆయన అన్నారు.  108, 104 నూతన వాహనాల ప్రారంభోత్సవం సందర్భంగా నగరంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని ఆయన తెలిపారు.

చెన్నై నుంచి విశాఖపట్నంకు వెళ్లే వాహనాలు ఒంగోలు జిల్లా త్రోవగుంట ద్వారా.. విశాఖపట్టణం నుంచి చెన్నై వెళ్లే భారీ వాహనాలను హనుమాన్ జంక్షన్ ద్వారా మళ్లింపులు చేస్తామని ఆయన వెల్లడించారు. విజయవాడ నగరంలోనూ దారి మళ్లింపులు ఉంటాయని శ్రీనివాసులు అన్నారు. *రాత్రి 12 గంటల తరువాత బెంజ్ సర్కిల్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు రెండు వైపులా ఏ వాహనానికి అనుమతి లేదని ఆయన తెలిపారు.

 ఇక గుంటూరు నుంచి ఏలూరు వెళ్లే వాహనాలు వారధి మీదుగా పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి విజయవాడలోకి అనుమతి* ని ఇస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే ఏలూరు నుంచి గుంటూరు వెళ్లే వాహనాలు గురునానాక్ కాలనీ నుంచి మళ్లిస్తామన్నారు. వీటితో పాటు మచిలీపట్నం నుంచి గుంటూరు వెళ్లే వాహనాలు ఎన్టీఆర్ సర్కిల్.. మచిలీపట్నం నుంచి విజయవాడ వచ్చే వాహనాలు ఆటోనగర్ 100 అడుగుల రోడ్డు నుంచి మళ్లిస్తామని తెలిపారు. 

ఇక ఏలూరు నుంచి విజయవాడ వచ్చే బస్సులు రామవరప్పాడు రింగ్ నుంచి ఏలూరు రోడ్డు వైపు మళ్లిస్తారు. మచిలీపట్నం వైపు నుంచి విజయవాడ వచ్చే బస్సులు తాడిగడప నుంచి మళ్లిస్తారు. * ఉంటాయని అన్నారు. ఇదిలా ఉంటేప్రజాపతినిధులు, ముఖ్య అతిధులు..జాతీయ రహదారి , పిన్నమనేని పాలి క్లినిక్ రోడ్డు , రూట్ నెంబర్-5, ఏలూరు రోడ్డు, మచిలీపట్నం రోడ్డు మీదుగా బెంజ్ సర్కిల్‌కి బెంజ్ సర్కిల్‌కి చేరుకోవాలని* శ్రీనివాసులు సూచించారు. ట్రాఫిక్ వాహన మళ్లింపుకు ప్రజలు సహకరించాలని శ్రీనివాసులు కోరారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle