newssting
BITING NEWS :
*శాసన మండలిలో మళ్ళీ గందరగోళం...కొనసాగుతోన్న మూడు రాజధానుల రగడ..రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌..అభ్యంతరం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు *మండలి ఛైర్మన్ ఛైర్ వద్దకు వెళ్లిన పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలు..వాయిదా పడ్డాక మండలి ఛైర్మనుతో మంత్రుల భేటీ*ఐదోసారి శాసన మండలి వాయిదా..మండలి వద్ద భారీగా మార్షల్స్ మొహరింపు..మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన బుద్దా వెంకన్న*ఎంపీ గల్లా జయదేవ్ కి బెయిల్ మంజూరు..బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి సెషన్స్ కోర్టు..గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన ఎంపీ, పోలీసుల తీరు సరిగా లేదన్న గల్లా *ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోంది.. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను-పవన్ కల్యాణ్‌*నాకు రాజకీయాలను ఆపాదించవద్దు... నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను-మండలి ఛైర్మన్ షరీఫ్*నిర్ణయాన్ని మార్చుకున్న వైసీపీ సర్కార్... విజయవాడలోనే రిపబ్లిక్ డే*అమరావతి: ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం.. చర్చకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు... జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ *వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం

బుట్టా రేణుకకు రాజ్యసభ ఆఫర్ ?

09-08-201909-08-2019 13:13:24 IST
2019-08-09T07:43:24.082Z09-08-2019 2019-08-09T07:43:19.714Z - - 21-01-2020

 బుట్టా రేణుకకు రాజ్యసభ ఆఫర్ ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మాజీ ఎంపీ బుట్టా రేణుక‌, ఏపీ రాజ‌కీయాల్లో ఈ పేరు తెలియ‌ని వారు ఉండ‌రు. వైసీపీ, టీడీపీ శ్రేణుల‌కు ఈ పేరు మ‌రింత ద‌గ్గ‌ర‌. అయితే బుట్టా రేణుక ఎంత వేగంగా రాజ‌కీయాల్లోకి దూసుకొచ్చారో.. అంతే వేగంగా ఫేడౌట్ అయ్యారు. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో క‌ర్నూలు పార్ల‌మెంట్‌ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా పోటీచేసి ఘ‌న విజ‌యం సాధించారు. ఆ త‌రువాత చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిస్థితుల కార‌ణంగా బుట్టా రేణుక చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీ కండువా క‌ప్పుకున్నారు. ఇలా టీడీపీలో చేరిన బుట్టా రేణుక‌కు అక్క‌డ ద‌క్కిన గౌర‌వం ఏమిటో.. ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. టీడీపీ త‌రుపున ఎంపీ టికెట్ నుంచి ఎమ్మెల్యే టికెట్ వ‌ర‌కు ప్ర‌య‌త్నించి.. చివ‌ర‌కు ఏదీ ఖ‌రారు కాక‌పోవ‌డంతో వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి తిరిగొచ్చేశారు.

ఈ ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ అత్య‌ధిక ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల‌ను కైవ‌సం చేసుకున్నా బుట్టా రేణుకకు మాత్రం రాజకీయంగా పూర్వ వైభ‌వం ద‌క్క‌లేదు. దీంతో ఆమె గతాన్ని త‌లుచుకుని బాధ‌ప‌డుతున్నార‌ని అనుచ‌ర‌వ‌ర్గం చెబుతోంది. అయితే, బుట్టా రేణుక‌కు గ‌తంలో వైసీపీని వీడాల‌న్న ఉద్దేశం లేక‌పోయినా.. కుటుంబ స‌భ్యులు ఇచ్చిన సూచ‌న‌ల మేర‌కే ఆ నిర్ణ‌యం తీసుకున్నార‌ని, అలా ఆమె వైసీపీని వీడి టీడీపీలో చేరిందంటూ ఆమె అనుచ‌ర‌వ‌ర్గం చెప్పుకొస్తోంది.

అంతేకాక‌, కుటుంబ స‌భ్యులు ఇచ్చిన  సూచ‌న‌ల‌తో చేసిన రాజ‌కీయ ప్ర‌యాణంతో ఆమె కెరీర్ గ్రాఫ్ మ‌రీ ఇంత‌లా కింద‌కు దిగుతుంద‌ని ఊహించ‌నేలేద‌ని ఆమె అనుచ‌ర‌వ‌ర్గం ఆవేద‌న చెందుతోంది. కాగా బుట్టా రేణుక చివ‌రి నిమిషంలో జ‌గన్ చెంత‌కు చేరినా ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపున ప్ర‌చారం చేశారు. ప్ర‌స్తుతం ఆమె హైద‌రాబాద్‌తోపాటు వివిధ చోట్ల ఉన్న సొంత బిజినెస్‌ల మీద ఫోక‌స్ పెట్టిన‌ట్టు తెలుస్తుంది.

మ‌రోప‌క్క‌ వైసీపీ అధికారంలోకి వ‌చ్చినా, పార్టీ త‌రుపున‌ పార్ల‌మెంట్‌లో 23 మంది ఎంపీలు ఉన్నా.. బుట్టా రేణుక మాత్రం త‌న‌కు ప‌లాన ప‌ద‌వి కావాల‌ని గ‌ట్టిగా డిమాండ్ చేయ‌లేక‌పోతున్నారు. దీనికంత‌టికి ప్ర‌ధాన కార‌ణం అన్ కండీష‌న‌ల్‌గా పార్టీలో చేర‌డమేన‌ని, తెలుగుదేశంలో ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ ద‌క్క‌క‌పోవ‌డం, చివ‌రి నిమిషంలో వ‌చ్చినా పార్టీలో చేర్చుకోవ‌డంతో నా సంగ‌తి ఏంటి...? అని ఆమె అడ‌గ‌లేక‌పోతున్నార‌ని అనుచ‌ర‌వ‌ర్గం చెప్పుకొస్తోంది. అయితే, సీఎం జ‌గ‌న్‌కు మాత్రం త‌న మీద ఎంతో అభిమానం ఉంద‌ని, క‌చ్చితంగా ఎమ్మెల్సీకానీ, రాజ్య‌స‌భ కానీ ఇస్తార‌న్న న‌మ్మ‌కంతో ఆమె ఉన్నార‌ని బుట్టారేణుక గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్న‌ట్టు తెలుస్తుంది.


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle