newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

బుట్టా పంతం ... టీడీపీ అంతం..!

31-03-201931-03-2019 08:09:41 IST
2019-03-31T02:39:41.027Z31-03-2019 2019-03-31T02:39:35.993Z - - 20-09-2019

బుట్టా పంతం ... టీడీపీ అంతం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుక చేసిన త‌ప్పు తెలుసుకున్నారంట‌. చంద్రబాబు నాయుడును న‌మ్మి తెలుగుదేశం పార్టీకి వెళ్లి త‌న రాజ‌కీయ జీవితాన్ని ఆగం చేసుకున్నాన‌ని దిగులు ప‌డుతున్నారంట‌. త‌న‌కు టిక్కెట్ ఇవ్వ‌కుండా మోసం చేసిన తెలుగుదేశం పార్టీని ఓడించేందుకు శ‌క్తిమేర ప‌నిచేయాల‌ని ఆమె పంతం ప‌ట్టారు. ఈ మేర‌కే ఆమె త‌న సామాజ‌క‌వ‌ర్గాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ వైపు ఆక‌ర్షించేందుకు కృషి చేస్తున్నారు.

వ్యాపార రంగంలో బాగా స్థిర‌ప‌డ్డ బుట్టా రేణుక గ‌త ఎన్నిక‌ల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. క‌ర్నూలు టిక్కెట్ బీసీల‌కు ఇవ్వాల‌నుకున్న జ‌గ‌న్ ఆమెకు టిక్కెట్ కేటాయించ‌గా ఆ ఎన్నిక‌ల్లో జిల్లాలో వైసీపీ హ‌వా వీచ‌డంతో సులువుగా విజ‌యం సాధించింది. త‌ర్వాత కొన్ని రోజుల‌కే ఆమె భ‌ర్త వెళ్లి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు.

కొన్ని రోజుల పాటు వైసీపీలోనే ఉన్న బుట్టా రెండేళ్ల క్రితం వెళ్లి టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీ త‌ర‌పున బాగానే తిరిగారు. ఓ ద‌శ‌లో త‌మ పార్టీ అభ్య‌ర్థి బుట్టా రేణుక‌నే అని మంత్రి నారా లోకేష్ స్వయానా క‌ర్నూలులో ప్ర‌క‌టించారు. దీంతో టిక్కెట్‌పై ఆమె ధీమాగా ఉన్నారు. అయితే క‌ర్నూలు పార్ల‌మెంటు ప‌రిధిలో ప‌ట్టున్న కోట్ల కుటుంబం టీడీపీలో చేర‌డంతో బుట్టా ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి.

క‌ర్నూలు ఎంపీ టిక్కెట్ కోట్ల‌కు ఇవ్వ‌డం ఖాయ‌మై స‌మ‌యంలో ఏదో ఒక అసెంబ్లీ సీటు ఇవ్వాల‌ని బుట్టా టీడీపీ అధిష్టానాన్ని కోరారు. అయినా ఆమెకు అసెంబ్లీ సీటు కూడా ద‌క్క‌లేదు. దీంతో వైసీపీని వీడి టీడీపీలో చేరి త‌ప్పు చేశాన‌ని బుట్టా గుర్తించారు. వెంట‌నే వ‌చ్చిన వైసీపీలో చేరిపోయారు. తాను టీడీపీని వీడి త‌ప్పు చేశాన‌ని, శిక్ష కూడా అనుభ‌వించాన‌న్నారు.

త‌న‌కే ప‌ద‌వులూ వ‌ద్ద‌ని పార్టీ గెలుపు కోసమే ప‌నిచేస్తాన‌న్నారు. అన్న‌ట్లుగానే ఆమె వైసీపీ విజ‌యం కోసం, త‌నకు టిక్కెట్ ఇవ్వ‌కుండా అవ‌మానించిన టీడీపీ ప‌రాజ‌యం కోసం ప‌నిచేస్తున్నారు.

ప‌ద్మ‌శాలి వ‌ర్గానికి చెందిన ఆమె ఆ సామాజిక‌వ‌ర్గం వారు ఎక్కువున్న చోట్ల వైసీపీ త‌ర‌పున ప్ర‌చారం చేస్తున్నారు. క‌ర్నూలు వైసీపీ ఎంపీ టిక్కెట్ మ‌ళ్లీ అదే సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన వ్య‌క్తికి ఇవ్వ‌డంతో ఆయ‌నకు బుట్టా ఫుల్ స‌పోర్ట్ చేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి అత్యంత కీల‌క‌మైన మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోకి కూడా ఆమె ఎంట‌ర్ అయ్యారు. అక్కడ కూడా ప‌ద్మశాలీల సంఖ్య గెలుపోట‌ముల‌ను ప్ర‌భావితం చేసే స్థాయిలో ఉన్నారు.

వారికి టిక్కెట్ ఇస్తామ‌ని టీడీపీ చివ‌రి నిమిషంలో లోకేష్‌కు ఇచ్చింద‌ని ఇప్ప‌టికే వారంతా టీడీపీపై గుర్రుగా ఉన్నారు. బుట్టా రేణుక కూడా వారిని వైసీపీ వైపు ఆక‌ర్షించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రి, త‌న‌ను అవ‌మానించిన టీడీపీ ప‌రాజ‌య‌మే ల‌క్ష్యంగా బుట్టా చేస్తున్న కృషి ఫ‌లిస్తుందో లేదో చూడాలి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle