newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

బీసీలకు పెద్ద పీట.. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం

20-07-201920-07-2019 09:44:14 IST
Updated On 20-07-2019 11:18:58 ISTUpdated On 20-07-20192019-07-20T04:14:14.575Z20-07-2019 2019-07-20T04:14:09.411Z - 2019-07-20T05:48:58.366Z - 20-07-2019

బీసీలకు పెద్ద పీట.. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తాను అధికారంలోకి రావడానికి దోహదం చేసిన బీసీ వర్గాల పట్ల జగన్ తన అవ్యాజ్యమయిన ప్రేమ కురిపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసేలా ఏపీ ప్రభుత్వం ముందుకెళుతోంది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ భేటీలో పలు కీలక అంశాలను చర్చించి ముసాయిదా బిల్లులకు ఆమోద ముద్ర వేశారు.

దీనిలో భాగంగా ప్రభుత్వంలోని అన్ని నామినేటెడ్‌ పోస్టులు, నామినేషన్‌ పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం కేటాయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. 

రజకులకు, నాయీబ్రాహ్మణులకు, టైలర్లకు ఆర్థిక సహాయంగా ఏడాది రూ.10వేలు ఇవ్వడానికి కేబినెట్‌ అంగీకారం తెలిపింది. అలాగే  ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు, మహిళల ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి కీలక నిర్ణయాలు తీసుకుంది.  ప్రభుత్వ నామినేషన్‌ కాంట్రాక్టులు, సర్వీసుల్లో 50శాతం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకే కేటాయిస్తారు. యాభైశాతం కాంట్రాక్టులు, సర్వీసులు మహిళలకే ఇస్తారు. 

నిరుద్యోగాన్ని నిర్మూలించే దిశగా పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే కల్పించాలని నిర్ణయించారు. ఇక టెండర్లలో అవినీతి, అక్రమాలను అరికట్టడంతోపాటు పారదర్శకతకు పెద్దపీట వేస్తూ న్యాయపరిశీలన – పారదర్శకత చట్టం- 2019 తీసుకువచ్చారు.

ప్రభుత్వ నామినేషన్‌ కాంట్రాక్టులు, సర్వీసుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం కేటాయించాలని ముఖ్యమంత్రి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు చట్టబద్ధత కల్పించేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలకు ఊరట కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది.”వైఎస్సార్‌ నవోదయం” పథకానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది,

మూడేళ్లుగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేలా ఈ పథకాన్ని రూపొందించారు. పాదయాత్రలో  భాగంగా .. వెనుకబడిన  వర్గాలకు ఇచ్చిన హామీని సీఎం జగన్‌ నిలబెట్టుకున్నారు.  

అదే విధంగా 1993 నాటి లోకాయుక్త చట్టాన్ని సవరించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ పదవిలో హైకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ లేదా మాజీ జడ్జీల నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Image may contain: 1 person, sitting, table and indoor

లోకాయుక్తగా ఇప్పటివరకు హైకోర్టు జడ్జి లేదా మాజీ చీఫ్‌ జస్టిస్‌లకు మాత్రమే అవకాశం ఉంది. వీటన్నిటితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా తుడా చైర్మన్‌ను నియమించేందుకు వీలుగా దేవాదాయ చట్టంలో సవరణలు తేవడాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. 

దేశచరిత్రలో టెండర్ల ప్రక్రియలో ఉత్తమ పారదర్శక విధానానికి వైఎస్ జగన్‌ ప్రభుత్వం  శ్రీకారం చుట్టింది.  జ్యుడిషియల్‌ కమిషన్‌ ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో టెండర్ల పరిశీలన నిర్వహిస్తారు. హైకోర్టు జడ్జి లేదా హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి  పరిధిలోకి రూ.100 కోట్లకు పైబడ్డ అన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పరిశీలిస్తారు. ఆయా పనులను ప్రతిపాదిస్తున్న ప్రతిశాఖ ఆ పత్రాలను జడ్జికి సమర్పించాల్సిందే. 

పనులను ప్యాకేజీలుగా విభజించినా సరే మొత్తం పని విలువ రూ.100 కోట్ల దాటితే.. జడ్జి పరిధిలోకి రావాల్సిందే అని మంత్రిమండలి నిర్దేశించింది.  ఎవరైనా ఉద్దేశపూర్వకంగా, పనిగట్టుకుని ఈ ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే.. దాన్ని నిరోధించడానికి తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకునేలా జడ్జికి అవకాశం వుంటుంది.

జడ్జి, జడ్జి దగ్గర పనిచేస్తున్న సిబ్బందిని పబ్లిక్‌ సర్వెంట్లుగా భావిస్తారు. దీనివల్ల వారికి రక్షణ ఉంటుంది. ఇలాంటి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ కేబినెట్. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle