newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

బీజేపీ వైపు వైసీపీ ఎంపీల చూపు!? అలర్టైన ఏపీ సీఎం!

20-11-201920-11-2019 10:09:01 IST
2019-11-20T04:39:01.364Z20-11-2019 2019-11-20T04:38:59.219Z - - 25-05-2020

బీజేపీ వైపు వైసీపీ ఎంపీల చూపు!?  అలర్టైన ఏపీ సీఎం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైసీపీ ఎంపీల్లో చీలక వచ్చిందా..! 10మంది ఎంపీలు బీజేపీలోకి వెళ్లేందుకు ఆసక్తిచూపుతున్నారా..!! అదేంటి ఏపీలో వైసీపీ మంచి జోష్‌మీద ఉంటే ఎంపీలు బీజేపీలోకి ఎందుకు వెళ్తారనేగా మీ డౌట్‌.. అంత ఆశ్చర్యపోకండి.. రాజకీయాలంటే అంతేమరి. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలోకి వెళ్తారో చెప్పలేం. ఇదేకోవలో వైసీపీ ఎంపీలు బీజేపీలోకి వెళ్లినా ఆశ్చర్యపడాల్సిన అవసరమూ లేదు.

ఏపీలో 151 స్థానాలను గెలచుకొని సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్‌రెడ్డి.. పాలనలోనూ వేగంగా దూసుకెళ్తున్నారు. ప్రతిపక్షాల మాటలదాడిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలకు మరింత దగ్గయ్యేందుకు అద్భుత పథకాలను అమల్లోకి తెస్తున్నాడు. మరోవైపు 22 ఎంపీ స్థానాలతో కేంద్రంలోనూ బలమైన ప్రాంతీయ పార్టీగా వైసీపీకి పేరుంది. అయితే ఇప్పుడు వీరిలో కొందరు ఎంపీలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అమిత్‌షా, పలువురు బీజేపీ పెద్దలతో టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం.

బీజేపీ పెద్దలు పది మంది ఎంపీలతో అప్పుడప్పుడు రహస్యంగా చర్చలు సైతం జరుపుతున్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో టాక్‌నడుస్తోంది. దీనిని పసిగట్టిన వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అలర్టైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చసాగుతుంది. పార్లమెంట్‌ సమావేశాలకు ముందు వైసీపీ ఎంపీలతో సమావేశమైన జగన్మోహన్‌రెడ్డి.. ఎంపీలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు ప్రచారం సాగుతుంది. కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలను కలిసేటప్పుడు విజయసాయిరెడ్డితో కలిసే వెళ్లాలని, అలా కాకుండా మీకుమీరు వెళ్లి అమిత్‌షా, మోదీ, ఇతర బీజేపీ పెద్దలను కలవొద్దని జగన్మోహన్‌రెడ్డి కుండబద్దలుకొట్టినట్లు ఎంపీలకు సూచించినట్లు సమాచారం.

ఇప్పటికే ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బలమైన పార్టీగా నిరూపించుకొనేందుకు బీజేపీ వ్యూహాలను సిద్ధంచేస్తుంది. ఇందులో భాగంగా టీడీపీ, వైసీపీ, ఇలా ఏ పార్టీ నుంచి ఎవరు వచ్చిన కాదనకుండా బీజేపీ కండువా కప్పేందుకు ఆ పార్టీ పెద్దలు సిద్ధమయ్యారు. వలస నేతలతో పార్టీని బలమైన శక్తిగా మార్చేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురు ఆ పార్టీ కండువా కప్పుకోగా.. త్వరలో మరికొందరు చేరే అవకాశాలు ఉన్నాయి. దీనికితోడు వైసీపీ ఎంపీలపైనా బీజేపీ పెద్దలు గురిపెట్టారు.

కేంద్రంలో బీజేపీ బలమైన పార్టీగా ఉంది. ఇప్పుడికిప్పుడు ఇతర పార్టీల్లోని ఎంపీలు ఆ పార్టీకి అవసరం లేదు. కానీ ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ.. వైసీపీ ఎంపీలను తమవైపుకు లాక్కోవడం ద్వారా ఆ పార్టీకి వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు వ్యూహాలు సిద్ధంచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వైసీపీలోని పలువురు ఎంపీలు వ్యాపార లావాదేవీలతో పాటు, పలు కేసుల్లో ఇరుక్కుపోయి ఉన్నవారు ఉన్నారు. దీంతో వారుసైతం వైసీపీలో ఉంటే తమకు ఒరిగేదేమీ లేదని, బీజేపీలోకి వెళితే.. తమపై ఉన్న కేసులనుండి తప్పించుకోవటంతోపాటు.. వ్యాపారాలను వృద్ధిచేసుకొనేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

దీనిలో భాగంగానే పలువురు ఎంపీలు బీజేపీ పెద్దలతో టచ్‌లోకి వెళ్తున్నట్లు ప్రచారం సాగుతుంది. మరోవైపు ఎంపీలు ఒకవేళ బీజేపీలోకి వెళితే పార్టీ పిరాయింపు చట్టం కిందకు రాకుండా.. ఉండేందుకు ఏకంగా ఎనిమిది నుంచి 10మంది ఎంపీలపై బీజేపీ పెద్దలు గురిపెట్టినట్లు తెలుస్తోంది. 10మంది ఎంపీలు బీజేపీలోకి వస్తే వారిని బీజేపీ ఎంపీలుగా గుర్తించేలా చేయాల్సిన చర్యలను బీజేపీ పెద్దలు ముందస్తుగా సిద్ధంచేసుకుంటున్నట్లు ఢిల్లీ రాజకీయాల్లో చర్చ సాగుతుంది. గతంలోనూ టీడీపీ రాజ్యసభ సభ్యుల విషయంలోనూ ఇదే ప్రక్రియను బీజేపీ అమలు చేసింది.

ఇదిలా ఉంటే తాజా ఊహాగానాలకు ఊతమిస్తూ మంగళవారం పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టేందుకు జగన్మోహన్‌రెడ్డి సిద్ధమయ్యారు. ప్రతిపక్షాల నుంచి, తెలుగు రాష్ట్రాల్లోని పెద్దల నుంచి వ్యతిరేఖత వచ్చినా జగన్‌ వెనక్కుతగ్గడం లేదు. తాజాగా పార్లమెంట్‌లో తెదేపా ఎంపీ కేశినేని నాని ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. తెలుగు మాద్యమాన్ని కాపాడేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలపై ప్రశ్నించారు.

వైసీపీ ఎంపీ రామకృష్ణంరాజు జోక్యంచేసుకుంటూ ఏపీలో తెలుగు మాద్యమం రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో వైసీపీ ఒక స్టాండ్‌పై వెళ్తుంటే పార్లమెంట్‌లో రఘు రామకృష్ణరాజు అందుకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేయటం వైసీపీని కలవరపాటుకు గురిచేసింది.

ఈ పరిస్థితులన్నీ గమనిస్తుంటే ఢిల్లీ రాజకీయాల్లో గుసగుసలు వినిపిస్తున్నట్లుగానే వైసీపీలోని దాదాపు పదిమంది ఎంపీలు బీజేపీలోకి వెళ్లినా ఆశ్చర్యపోనక్కరలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి బీజేపీ కేంద్ర పెద్దల నుంచి ఎదురయ్యే సవాళ్లను ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఎలా స్వీకరిస్తారనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర అంశంగా మారింది.  

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   19 hours ago


రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

   21 hours ago


కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

   a day ago


లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

   a day ago


డోసు పెంచిన కమలనేతలు.. ప్రభుత్వంపై గవర్నరుకు ఫిర్యాదు!

డోసు పెంచిన కమలనేతలు.. ప్రభుత్వంపై గవర్నరుకు ఫిర్యాదు!

   a day ago


ప్రయాణికులకు గుడ్ న్యూస్.... తెలుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్ కౌంటర్లివే

ప్రయాణికులకు గుడ్ న్యూస్.... తెలుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్ కౌంటర్లివే

   a day ago


శ్రీవారి అస్తులకే ఎసరు.. అమ్మకానికి సిద్ధమైన టీటీడీ!

శ్రీవారి అస్తులకే ఎసరు.. అమ్మకానికి సిద్ధమైన టీటీడీ!

   a day ago


చరిత్రలో కలిసిపోయిన మూడులాంతర్ల స్థూపం.. విమర్శల పర్వం

చరిత్రలో కలిసిపోయిన మూడులాంతర్ల స్థూపం.. విమర్శల పర్వం

   23-05-2020


వరద రోజుల్లో వాడుకున్న నీటిని కోటాలో కలిపేస్తారా.. కృష్ణా బోర్డుపై ఏపీ గుస్సా

వరద రోజుల్లో వాడుకున్న నీటిని కోటాలో కలిపేస్తారా.. కృష్ణా బోర్డుపై ఏపీ గుస్సా

   23-05-2020


ఇప్పుడు జూనియ‌ర్‌పైనే ఆశ‌లు పెంచుకుంటున్నారా..?

ఇప్పుడు జూనియ‌ర్‌పైనే ఆశ‌లు పెంచుకుంటున్నారా..?

   23-05-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle