newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

బీజేపీ వైపు వలసలు.. టీడీపీ యాక్షన్ ప్లానేంటి?

27-06-201927-06-2019 09:26:35 IST
Updated On 27-06-2019 11:16:26 ISTUpdated On 27-06-20192019-06-27T03:56:35.914Z27-06-2019 2019-06-27T03:56:30.786Z - 2019-06-27T05:46:26.882Z - 27-06-2019

 బీజేపీ వైపు వలసలు.. టీడీపీ యాక్షన్ ప్లానేంటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నికల ఫలితాలు వచ్చి నేలరోజులు కూడా కాకుండానే టీడీపీ ఢీలా పడిపోయింది. నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడి బీజేపీ గూటికి చేరిన విషయం తెలిసిందే. తాజాగా టీడీపీ మరో నేత, అధికార ప్రతినిధి లంకా దినకర్ బీజేపీలో చేరారు. రెండురోజుల క్రితం వరకూ ఆయన టీడీపీ తరఫున తన వాణి బలంగా వినిపించిన దినకర్ బీజేపీ తీర్థం పుచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు మరింత మందిని తమ పార్టీలోకి లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

అంతేకాదు, టీడీపీ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షాతో భేటీ కావడం.. ఆ పార్టీ నేతలను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. ఆయనతో పాటు మరికొంత మంది ఎమ్మెల్యేలు, కీలక నేతలు కూడా క్యూలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఎంపీలతో పాటు, ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో భవిష్యత్తు లేదని, ఇతర పార్టీల్లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. టీడీపీలోని ఎక్కువమంది నేతలు కమలం గూటికి చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇదే పరిస్థితి మరికొంతకాలం కొనసాగితే.. పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశముందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

తాజాగా మరికొంత మంది నేతలు బీజేపీ కేంద్ర నాయకత్వంతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీలో చేరే టీడీపీ నేతల సంఖ్యపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అటు బీజేపీ పెద్దలు కూడా టీడీపీ నేతలను చేర్చుకునేందుకు స్థానిక నాయకత్వంతో మంతనాలు చేస్తున్నారు. కింది స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు టీడీపీ నేతలు సాయపడతారని బీజేపీ భావిస్తోంది.

తమకు పరిచయం ఉన్న నేతలతో కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, మాణిక్యాలరావు, సోమువీర్రాజు, మాధవ్ వంటి వారు చర్చలు జరుపుతున్నారు. బీజేపీ దూకుడుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహంతో ఉన్నారు. ఒకవైపు ప్రజావేదిక కూల్చివేతతో ఆయన గుర్రుగా ఉన్నారు. పార్టీనుంచి వలసలు ఆపేందుకు ఏం చేయాలనేదానిపై చంద్రబాబునాయుడు కీలక  నేతలతో చర్చిస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle