newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

బీజేపీ నేతల రూటెటు? భవిష్యత్తుపై బెంగ..!

18-02-201918-02-2019 13:33:10 IST
Updated On 19-02-2019 19:05:24 ISTUpdated On 19-02-20192019-02-18T08:03:10.711Z18-02-2019 2019-02-18T08:02:38.939Z - 2019-02-19T13:35:24.487Z - 19-02-2019

బీజేపీ నేతల రూటెటు? భవిష్యత్తుపై బెంగ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో బీజేపీ రాజకీయ పరిస్థితి అంత మెరుగ్గా లేదనే ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో అటు మోడీ ప్రభంజనం, పవన్ క్రేజ్ కారణంగా టీడీపీతో పొత్తు పెట్టుకుని నాలుగు సీట్లు సంపాదించింది ఏపీ బీజేపీ. ఈసారి టీడీపీతో గిల్లికజ్జాలు కారణంగా అసలు అసెంబ్లీలో బీజేపీ ప్రాతినిధ్యం ఉంటుందా? కనీసం పాత సీట్లయినా దక్కుతాయా? అసలు బీజేపీని నడిపించే నాథుడు ఎవరు? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. 

బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తన పదవికి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. కైకలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఈసారి పోటీచేయనని ప్రకటించారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాణిక్యాలరావు మళ్ళీ పోటీచేసి గెలుస్తానని పైకి గాంభీర్యంగా చెబుతున్నా పరువు దక్కుతుందో లేదోనని మథనపడుతున్నారు. తాడేపల్లిగూడెంలో మాణిక్యాలరావు పోటీచేస్తే చిత్తుగా ఓడించడానికి అక్కడి టీడీపీ శ్రేణులు గట్టి పంతం మీద ఉన్నాయి. 

ఇక విశాఖ జిల్లా సంగతికి వస్తే అక్కడ ఉన్న బీజేపీ ఎమ్మెల్యే పెన్మెత్స విజయకుమార్ రాజు పార్టీలో కొనసాగక పోవచ్చనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అసెంబ్లీలో బీజేపీ వాయిస్ వినిపిస్తున్న ఆ పార్టీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే దానిపై రాజకీయవర్గాల్లో ఎక్కువగా చర్చ జరుగుతోంది. పదే పదే ఆయన చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు అసలు కారణం. ఆయన ఎన్నికల ముందు వరకూ బీజేపీలోనే కొనసాగుతారా లేదా అనే విషయంలో డైలమా కొనసాగుతోంది. 

తాను రాబోయే ఎన్నికల్లో మళ్లీ విశాఖ నార్త్ నుంచే పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. కానీ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే అంశంలో మాత్రం విష్ణుకుమార్ రాజు  గోప్యత పాటిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరువాత తాను ఏ పార్టీ బీఫాం మీద పోటీకి దిగుతానో చెబుతానన్నారు. తాజాగా విష్ణుకుమార్ రాజు తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

దీంతో ఆయన సైకిల్ ఎక్కడం ఖాయంగా చెబుతున్నారు. తాను అజాత శత్రువునని చెబుతూనే.... అన్ని పార్టీలతోనూ తాను సఖ్యంగానే ఉంటానని విష్ణుకుమార్ రాజు అన్నారు. కొంతమంది నేతలు ఓటమి భయంతోనే నేతలు నియోజకవర్గాలు మారుతుంటారని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో ఆ పార్టీనేతలే చెప్పలేకపోతున్నారు. 

మోడీ గుంటూరు పర్యటన అనంతరం ఏపీలో బీజేపీ బలోపేతం అయిందని, వచ్చే ఎన్నికల నాటికి పార్టీ మరింత పటిష్టం అవుతుందంటున్నారు బీజేపీ నేతలు. ఎన్నిస్థానాల్లో పోటీచేస్తామనేది ఇంకా తేలలేదని, ప్రభావశీలమయిన పాత్ర పోషించడం ఖాయం అంటున్నారు. పొత్తుల గురించి కేంద్రనాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. దేశం సత్తా చాటాలంటే మరో సర్జికల్ స్ట్రయిక్స్ అవసరం అంటున్నారు పలువురు నేతలు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle