newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

బీజేపీ దూకుడుతో జగన్‌కు చిక్కులు తప్పవా?

23-06-201923-06-2019 09:24:26 IST
2019-06-23T03:54:26.082Z23-06-2019 2019-06-23T03:49:31.805Z - - 20-09-2019

బీజేపీ దూకుడుతో జగన్‌కు చిక్కులు తప్పవా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ముందు ముందు కేంద్ర ప్ర‌భుత్వంతో చిక్కులు ఖాయ‌మ‌ని అంటున్నారు రాజ‌కీయ పండితులు. ఎందుకంటే, ప్ర‌స్తుతానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య స‌ఖ్య‌త ఉన్న‌ట్లే క‌నిపిస్తున్నా, లోపాయికారిగా ఎవ‌రి వ్యూహాలు వారికి ఉన్న‌ట్లు రాజ‌కీయ ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. సమాఖ్య దేశంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణితో వెళ్తేనే పాల‌న సాఫీగా, అభివృద్ధి దిశ‌గా సాగుతుంది. 

ఇక ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా రాష్ట్ర అవ‌స‌రాలు, నిధుల దృష్ట్యా కేంద్రంతో స‌ఖ్య‌త‌గా ఉంటున్న‌ట్లు క‌నిపిస్తున్నారు. కేంద్రంతో త‌గ‌వు పెట్టుకుని ఇబ్బంది ప‌డేకంటే, స్నేహంగా ఉంటూనే ప‌బ్బం గడుపుకోవాల‌న్న ధోర‌ణి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిలో ఉన్న‌ట్లు అర్థం అవుతోంది.

అయితే న‌లుగురు తెలుగుదేశం పార్టీ ఎంపీలు బీజేపీలో చేరిన త‌ర్వాత రాజ‌కీయం ఒక్క‌సారిగా మారిపోయింద‌ట‌. న‌లుగురు ఎంపీల చేరికతో ఏపీలో త‌మ బ‌లం పెరిగింద‌ని భావిస్తున్న బీజేపీ దూకుడుత‌నం ప్ర‌ద‌ర్శిస్తోంది. 

అయితే పార్టీలో చేరిన న‌లుగురు ఎంపీల్లో ఒక్క‌రు కూడా జ‌నంలో ప‌ట్టున్న వారు కాక‌పోవ‌డం, కేవ‌లం రాజ‌కీయ‌, వ్యాపార ప్ర‌యోజ‌నాల కోస‌మే పార్టీ మారార‌ని జ‌నం భావించ‌డం, ఇప్పుడు బీజేపీ ఇబ్బందిగా మారింది.

అందుకే మొన్న‌టి ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి గెలిచిన ఎంఎల్ఏల‌ను పార్టీలో చేర్చుకోడానికి బీజేపీ ఆతృత ప‌డుతోంది. ఇప్ప‌టికే గంటా శ్రీనివాస‌రావు, మ‌రికొంద‌రు పార్టీలో చేరిక మీద‌ త‌మ‌తో మాట్లాడుతున్నార‌ని ఏపీ బీజేపీ నేత‌లు ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. ఇదే జ‌రిగితే అటు బీజేపీకి, ఇటు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఇబ్బందులు త‌ప్ప‌వంటున్నారు రాజ‌కీయ పండితులు. 

ఎందుకంటే, టీడీపీ ఎంఎల్ఏలు బీజేపీలో చేరితో వారు విలీనం అయ్యారో, ఫిరాయించారో తేల్చాల్సింది స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం. ఇప్ప‌టికే పార్టీ మారే ఎంఎల్ఏల‌ను అన‌ర్హులుగా ప్ర‌క‌టించే విష‌యం మీద స్పీక‌ర్ విచ‌క్ష‌ణ‌కే వ‌దిలేస్తున్న‌ట్లు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు.

అంటే టీడీపీ ఎంఎల్ఏల చేరిక‌ను విలీనం కింద త‌మ్మినేని ప‌రిగ‌ణిస్తే వైసీపీకి ఇబ్బంది, అలా కాకుండా ఫిరాయింపు కింద‌, పార్టీ మారిన ఎంఎల్ఏల‌ను స్పీక‌ర్ త‌మ్మినేని అన‌ర్హులుగా ప్ర‌క‌టిస్తే బీజేపీకి ఇబ్బంది. 

ఎందుకంటే, పార్టీ మారినా వారికి ఎలాంటి లాభం లేదు కాబ‌ట్టి. ఈ రెండు అంశాల మీదే ఇప్పుడు ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు తీవ్రంగా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. ఒక‌వేళ తాము త‌లచిన విధంగా అంతా అనుకున్న‌ట్లుగా జ‌రిగితే ఓకే అనీ, అలా కాకుండా ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డితే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద ప్ర‌త్య‌క్ష యుద్ధం చేయాల‌ని బీజేపీ పెద్ద‌లు ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle