newssting
BITING NEWS :
*హైదరాబాద్‌: ఓయూ ప్రొఫెసర్ కాశింను హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసంలో హాజరుపర్చిన గజ్వేల్ పోలీసులు*షిర్డీలో కొనసాగుతోన్న బంద్.. షిర్డీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ బంద్.. షిర్డీలో తెరుచుకోని షాపులు, బంద్ కొనసాగించాలని షిర్డీ గ్రామ సభ నిర్ణయం*తిరుమల: రేపటి నుంచి శ్రీవారి భక్తులకు ఉచితంగా లడ్డూ... సబ్సిడీపై ఇస్తున్న లడ్డూలను నిలిపివేయనున్న టీటీడీ.. అదనపు లడ్డూ కోసం రూ.50*నేడు షిరిడీ బంద్... బాబా ఆలయం తెరిచి ఉంటుంది, దర్శనాలకు ఎలాంటి ఇబ్బందిలేదు, భక్తులు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు, భక్తులకు ఇబ్బంది లేకుండా షిరిడీ బంద్-సాయి ట్రస్ట్*హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... 32 కేసులు నమోదు, 16 కార్లు, 16 బైక్‌లు సీజ్... నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు*విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించాలని నేడు మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తగరపు వలసలో భారీ ర్యాలీ*నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే.. బెంగళూరు వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

బీజేపీ-జనసేన కీలక భేటీ.. స్థానిక ఎన్నికల్లో పొత్తుపైనే ఫోకస్

16-01-202016-01-2020 08:22:16 IST
2020-01-16T02:52:16.454Z16-01-2020 2020-01-16T02:52:14.079Z - - 19-01-2020

బీజేపీ-జనసేన కీలక భేటీ.. స్థానిక ఎన్నికల్లో పొత్తుపైనే ఫోకస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఎన్నికల అనంతరం పాత మిత్రుల మధ్య పొత్తు పొడుస్తోంది. విజయవాడలో బీజేపీ-జనసేన సమావేశం కానున్నాయి..జనసేన తరపున పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్ హాజరవుతారు. స్థానిక సంస్థల్లో పొత్తుపై చర్చించనున్నారు నేతలు. ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన పవన్ కళ్యాణ్ బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. ఇరు పార్టీల నేతలు విజయవాడలో 16వ తేదీన భేటీ కావాలని నిర్ణయించారు. 

జనసేన-బీజేపీ కలిసి నడుస్తాయనే వార్తలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. రాష్ట్రంలో రాజకీయపరిణామాలు వేగంగా మారుతున్నాయి. రెండు పార్టీలు ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఒక అవగాహనకు రానున్నాయి.

అమరావతి రాజధాని ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్న వేళ వైసీపీలో గుబులు రేగుతోంది. 29 గ్రామాలకే పరిమితమైందనుకున్న ఉద్యమం.. తర్వాత గుంటూరు, కృష్ణా జిల్లాలతోపాటు కోస్తా, రాయలసీమ జిల్లాలకు విస్తరించడంతో బీజేపీ-జనసేన కూడా ఈ ఉద్యమంలో భాగంగా మారాయి. 

రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో రాజధానులు ఆలోచన జగన్ నోటినుంచి రాగానే ఏపీలో తొలిసారి బీజేపీ ఉద్యమానికి నాంది పలికింది. అమరావతి విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తన అభిప్రాయాలను గతంలోనే వెల్లడించామన్నారు. తమ పార్టీ తొలి నుంచి ఒకే మాటపై ఉందని, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టామన్నారు.

సీఎం మారితే రాజధాని మార్చడం సమంజసం కాదన్నారు. ఇటు పవన్ కళ్యాణ్ కూడా తన సోదరుడు నాగబాబు, పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ తో అమరావతిలో పర్యటించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో రైతులకు, ఉద్యమకారులకు సంఘీభావం ప్రకటించారు.

ఉద్యమం కీలకదశలో ఉన్న వేళ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారపార్టీకి ఎదురుదెబ్బలు తగలడం ఖాయం అంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ-జనసేన కలిసి పోటీచేస్తే అధికారపార్టీ విజయావకాశాలకు భారీగా గండికొట్టవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle