newssting
BITING NEWS :
*దేశంలో కరోనా విజృంభణ... 7,42,661, మరణాలు 20,53, కోలుకున్నవారు 4,57, 016 *నేడు వైఎస్సార్‌ 71వ జయంతి *ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్ *శ్రీకాకుళం జిల్లాలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పర్యటన..ఆమదాలవలసలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న విజయసాయిరెడ్డి *కడప : ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి సందర్భంగా కుటుంబసభ్యుల తో కలసి నివాళులర్పించనున్న సీఎం జగన్*తెలంగాణలో 1879 కరోనా పాజిటివ్ కేసులు, 7 గురు మృతి..తెలంగాణలో ఇప్పటి వరకు 313 మంది మృతి..హైదరాబాద్ లో 1422 కేసులు..యాక్టివ్ కేసులు 11,012, డిశ్చార్జ్ అయిన కేసులు 16,287* రాజ‌ధానిలో త‌ల‌పెట్టిన 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హ ఏర్పాటును విజ‌య‌వాడ‌కు మార్చిన ఏపీ స‌ర్కార్ *ముంబై ఎయిర్‌పోర్టు అథారిటీ నిధుల గోల్‌మాల్‌పై ఇప్ప‌టికే జీవీకేపై కేసు న‌మోదు చేసిన సీబీఐ.. సీబీఐ కేసు ఆధారంగా కేసు న‌మోదు చేసిన ఈడీ*ఏపీలో గ‌త‌ 24 గంటల్లో 1178 క‌రోనా పాజిటివ్ కేసులు, 13 మంది మృతి.. 21,197కి చేరిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 252 మంది మృతి*ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై హైకోర్టులో పిల్. కరోనా టెస్టులు, చార్జీల నియంత్రణ మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషన్. యశోద, కేర్, సన్ షైన్, మెడికవర్ ఆసుపత్రులకు హైకోర్టు నోటీసులు. ఈనెల 14 లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

బీజేపీ ఎదుగుద‌ల‌కు జ‌గ‌నే అడ్డంకి

20-07-201920-07-2019 08:08:18 IST
Updated On 20-07-2019 11:27:00 ISTUpdated On 20-07-20192019-07-20T02:38:18.625Z20-07-2019 2019-07-20T02:37:00.079Z - 2019-07-20T05:57:00.543Z - 20-07-2019

బీజేపీ ఎదుగుద‌ల‌కు జ‌గ‌నే అడ్డంకి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎద‌గాల‌ని భావిస్తున్న భార‌తీయ జన‌తా పార్టీకి ఇప్పుడు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అడ్డుగా మారారు.

తెలుగుదేశం పార్టీ నుంచి వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హించ‌డం ద్వారా పార్టీని బ‌లోపేతం చేసుకోవాల‌ని బీజేపీ భావిస్తోంది. ఇందుకు గానూ ప‌లువురు టీడీపీ ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో బీజేపీ పెద్ద‌లు చ‌ర్చ‌లు కూడా జ‌రిపారు. కానీ, వీరు బీజేపీలో చేరేందుకు వెన‌కాడుతున్నారు.

ఇందుకు ప్ర‌ధాన కార‌ణం జ‌గ‌న్‌. బీజేపీలో చేరిత జ‌గ‌న్ త‌మ ప‌ద‌వుల‌కు ఎస‌రు పెట్ట‌డం ఖాయ‌మ‌ని, బీజేపీలోకి చేరి ప‌ద‌వి పోగొట్టుకోవ‌డం ఎందుక‌ని వారు వెనుకంజ వేస్తున్నారు.

మొద‌టి అసెంబ్లీ స‌మావేశాల్లోనే పార్టీ ఫిరాయింపుల‌పై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స్ప‌ష్టంగా మాట్లాడారు. ఎవ‌రైనా పార్టీ మారితే వెంట‌నే వారిపై వేటు వేయాల‌ని స్పీక‌ర్‌కు పూర్తి స్వేచ్ఛ‌ను ఇచ్చారు.

ప‌లువురు టీడీపీ ఎమ్మెల్యేలు త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నా చేర్చుకోమ‌ని, రాజీనామా చేసే రావాల‌ని, లేదా అన‌ర్హ‌త వేటు ప‌డుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇప్పుడు జ‌గ‌న్ చేసిన ఈ ప్ర‌క‌ట‌నే బీజేపీలో చేరిక‌ల‌కు బ్రేకులు వేస్తోంది.

ఎవ‌రైనా టీడీపీ ఎమ్మెల్యేలు లేదా ఎమ్మెల్సీలు బీజేపీలో చేరితే టీడీపీ ఫిర్యాదు చేసిందే త‌డ‌వు వారిపై అన‌ర్హ‌త వేటు వేసే అవ‌కాశం ఉంది. అలా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీ ఖాతాలో ప‌డ‌టం ఖాయం.

దీంతో ప‌ద‌విని రిస్క్‌లో పెట్ట‌డం ఇష్టం లేక బీజేపీలోకి వెళ్లాల‌ని అనుకుంటున్న వారు కూడా సైలెంట్ అవుతున్నారు. ఇదే విష‌యాన్ని బీజేపీ ఎమ్మెల్సీ మాధ‌వ్ కూడా చెబుతున్నారు.

అయితే, ఫిరాయింపుల వేటు ప‌డ‌కుండా బీజేపీ పెద్ద ప్లానే చేస్తోందంట‌. రాజ్య‌స‌భ‌లో టీడీపీ స‌భ్యులు బీజేపీలో విలీనం అయిన‌ట్లుగా ఎమ్మెల్యేల‌ను, ఎమ్మెల్సీల‌ను కూడా బీజేపీలో విల‌నీం చేసుకోవాల‌నేది త‌మ ప్లాన్ అని మాధ‌వ్ చెప్పారు.

అయితే, విలీనం కావాలంటే మూడింట రెండొంతుల మంది స‌భ్యులు టీడీపీ నుంచి బీజేపీలో చేరాలి. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఇది అంత సులువు కాదు. సాధ్యం కూడా కాక‌పోవ‌చ్చ‌నే విశ్లేష‌ణ‌లు ఉన్నాయి.

ఇక‌, ప‌లువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల‌తోనూ బీజేపీ నేత‌లు సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. త్వ‌ర‌లోనే పెద్ద ఎత్తున చేరిక‌లు ఉంటాయ‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు.

ఇక‌, ప్ర‌స్తుతం వైసీపీలో మంత్రిగా ఉన్న బోత్స స‌త్య‌నారాయ‌ణ‌, ఎమ్మెల్యే ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు కూడాఎన్నిక‌ల ముందు బీజేపీతో ట‌చ్‌లో ఉన్నార‌ని మాధ‌వ్ చేసిన వ్యాఖ్య‌లు సైతం సంచ‌ల‌నంగా మారాయి. వైసీపీలో ఈ వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.

మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్‌కుమార్ రెడ్డి సైతం బీజేపీలో చేరుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, ప్ర‌చారం జ‌రుగుతున్న వారిలో ప‌దో వంతు నేత‌లు కూడా బీజేపీలో చేరేందుకు ధైర్యం చేయ‌డం లేదు.

‘‘హైదరాబాద్‌లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి’’

‘‘హైదరాబాద్‌లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి’’

   an hour ago


కరోనా పరిస్థితిపై ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

కరోనా పరిస్థితిపై ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

   2 hours ago


గవర్నర్ Vs సీఎం... కరోనా చిచ్చుపెట్టిందా?

గవర్నర్ Vs సీఎం... కరోనా చిచ్చుపెట్టిందా?

   2 hours ago


టీటీడీపై ‌కుట్ర‌లా..?! మ‌రి ఆ కుట్ర‌ల‌ను చేధించ‌లేరా..?

టీటీడీపై ‌కుట్ర‌లా..?! మ‌రి ఆ కుట్ర‌ల‌ను చేధించ‌లేరా..?

   2 hours ago


టెస్టుల్లో ఆలస్యం నిజమే.. క్వారంటైన్లో నాణ్యమైన ఆహారం

టెస్టుల్లో ఆలస్యం నిజమే.. క్వారంటైన్లో నాణ్యమైన ఆహారం

   15 hours ago


టీటీడీలో ఉద్యోగులకు భారీగా కరోనా పరీక్షలు

టీటీడీలో ఉద్యోగులకు భారీగా కరోనా పరీక్షలు

   15 hours ago


డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు కరోనా పాజిటివ్

డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు కరోనా పాజిటివ్

   20 hours ago


విదేశీ విద్యార్ధులకు అమెరికా షాక్.. తిరిగి రావాల్సిందేనా?

విదేశీ విద్యార్ధులకు అమెరికా షాక్.. తిరిగి రావాల్సిందేనా?

   a day ago


ఏపీలో మూడ్రోజులపాటు వర్షాలు

ఏపీలో మూడ్రోజులపాటు వర్షాలు

   a day ago


విజయవాడ ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ట్రాఫిక్ కిట్లు.. కరోనాపై జాగ్రత్తలు

విజయవాడ ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ట్రాఫిక్ కిట్లు.. కరోనాపై జాగ్రత్తలు

   07-07-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle