newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

బీజేపీ ఆఫ‌ర్‌ను జ‌గ‌న్ తీసుకుంటారా..?

12-06-201912-06-2019 09:03:23 IST
Updated On 24-06-2019 11:58:54 ISTUpdated On 24-06-20192019-06-12T03:33:23.039Z12-06-2019 2019-06-12T03:27:10.741Z - 2019-06-24T06:28:54.556Z - 24-06-2019

బీజేపీ ఆఫ‌ర్‌ను జ‌గ‌న్ తీసుకుంటారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జన‌తా పార్టీ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింద‌ని, లోక్‌స‌భ డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విని వైసీపీకి ఇవ్వాల‌ని బీజేపీ యోచిస్తోంద‌ని జాతీయ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. బీజేపీ ఆఫ‌ర్‌కు జ‌గ‌న్ కొంత టైమ్ తీసుకొని త‌మ నిర్ణ‌యం చెబుతామ‌న్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే, నిజంగానే వైసీపీకి బీజేపీ ఆఫ‌ర్ చేసిందా.? ఒక‌వేళ నిజంగానే చేస్తే వైసీపీ ఈ ఆఫ‌ర్‌కు అంగీక‌రిస్తుందా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

లోక్‌స‌భ డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విని ప్ర‌తిప‌క్షానికి ఇవ్వ‌డం ఒక సంప్ర‌దాయంగా వ‌స్తోంది. అయితే, 52 సీట్ల‌తో ఉన్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఈ ప‌ద‌విని తీసుకునేందుకు ఆస‌క్తిగా లేదు. ఆ త‌ర్వాత 23 ఎంపీ సీట్ల‌తో డీఎంకే త‌ర్వాతి స్థానంలో ఉంది. అయితే, త‌మిళ‌నాడులో బీజేపీ అన్నా డీఎంకేతో క‌లిసి న‌డుస్తోంది. దీంతో డీఎంకేకు ఈ ప‌ద‌వి ఇచ్చేందుకు బీజేపీ మొగ్గు చూప‌డం లేదు.

డీఎంకే త‌ర్వాత 22 సీట్ల‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌స‌భ‌లో నాలుగో అతిపెద్ద పార్టీగా ఉంది. వైసీపీతో పొత్తులు లేక‌పోయినా ఆ పార్టీతో బీజేపీ స‌త్సంబంధాల‌నే నెర‌పుతోంది. దీంతో ఈ ప‌ద‌వి వైసీపీకి ఇస్తే ప్ర‌తిప‌క్షానికి ఇచ్చిన సంప్ర‌దాయం నిల‌బెట్ట‌డంతో పాటు త‌మ‌కు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండ‌ద‌ని బీజేపీ భావిస్తోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే, ఈ ప‌ద‌విని స్వీక‌రించేందుకు జ‌గ‌న్ ఆస‌క్తి చూపుతారా అనేది ప్ర‌శ్న‌గా మారింది. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ని బీజేపీపై ఏపీ ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంది. ఈ స‌మ‌యంలో జ‌గ‌న్ ప్ర‌త్యేక హోదా సాధించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని చెబుతున్నారు.

బీజేపీ ప్ర‌స్తుతానికి రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇచ్చే ఆలోచ‌న‌తో లేదు. ఒక‌వేళ లోక్‌స‌భ డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విని వైసీపీ తీసుకున్నాక ప్ర‌త్యేక హోదా రాలేదంటే అది టీడీపీ చేతికి బ్ర‌హ్మాస్త్రాన్ని ఇచ్చిన‌ట్లే అవుతుంది. ప‌ద‌వి కోసం ప్ర‌త్యేక హోదా అంశాన్ని తాక‌ట్టుపెట్టార‌ని ఆ పార్టీ విమ‌ర్శ‌లు చేయ‌వ‌చ్చు.

దీంతో బీజేపీ ఇచ్చిన ఆఫ‌ర్‌ను జ‌గ‌న్ సున్నితంగా తిర‌స్క‌రించే అవ‌కాశాలే ఎక్కువ ఉన్నాయంటున్నారు. ఒక‌వేళ ఈ ఆఫ‌ర్ క‌నుక తీసుకోవాల‌నుకున్నా వైసీపీ త‌ర‌పున గెలిచిన ఎంపీలంతా జూనియ‌ర్లు కావ‌డం మ‌రో స‌మ‌స్య‌. మొత్తంగా ఈ వ్య‌వ‌హారంపై మ‌రో ఒక‌టిరెండు రోజుల్లో క్లారిటీ రానుంది.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle