newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

బీజేపీ.. 'ఆప‌రేష‌న్ ఫినిష్ టీడీపీ'

21-06-201921-06-2019 08:01:50 IST
Updated On 21-06-2019 08:03:40 ISTUpdated On 21-06-20192019-06-21T02:31:50.189Z21-06-2019 2019-06-21T02:27:52.180Z - 2019-06-21T02:33:40.445Z - 21-06-2019

బీజేపీ.. 'ఆప‌రేష‌న్ ఫినిష్ టీడీపీ'
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో ఫ‌క్తు రాజ‌కీయ పార్టీ అంటే ముందుగా చెప్పుకోవాల్సింది భార‌తీయ జ‌న‌తా పార్టీ గురించే. వ్య‌క్తిగ‌త స్వార్థాల‌ను ప‌క్క‌న‌పెట్టి పార్టీ బాగు కోసం ప‌నిచేసే నాయ‌కులు ఆ పార్టీలో కోకొల్ల‌లు. పైగా ఆరెస్సెస్ వంటి బ‌ల‌మైన వ్య‌వ‌స్థ అండ‌గా ఉండ‌టం కూడా ఆ పార్టీ బ‌లం. ఒక‌ప్పుడు కేవ‌లం ఉత్త‌ర భార‌తేద‌శానికి ప‌రిమిత‌మైన బీజేపీ ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా విస్త‌రించాల‌ని భావిస్తోంది. బీజేపీలో న‌రేంద్ర మోడీ - అమిత్ షా జోడీ శ‌కం మొద‌లైన నాటి నుంచి ఇదే టార్గెట్‌గా పెట్టుకుంది.

ఆ పార్టీకి ఏ మాత్రం స్కోప్ ఉండ‌దు అనుకున్న ఈశాన్య రాష్ట్రాల్లోకి చురుగ్గా విస్త‌రించింది. ద‌శాబ్దం కింది వ‌ర‌కు క‌మ్యూనిస్టుల‌కు కంచుకోట‌గా ఉన్న ప‌శ్చిమ బెంగాల్‌లోనూ బ‌ల‌ప‌డుతోంది. ఇప్పుడు ఆ పార్టీ ద‌క్షిణాధిపై దృష్టి పెట్టింది. ప్ర‌తిప‌క్షాల‌ను బ‌ల‌హీనం చేసి వారి స్థానంలోకి తాము రావ‌డం బీజేపీ త‌క్ష‌ణ ల‌క్ష్యం కాగా.. ప్ర‌తిప‌క్షం నుంచి అధికార ప‌క్షంలోకి రావ‌డం త‌ర్వాతి ల‌క్ష్యం. ఈ ఫార్ములాలో మొద‌టి విడ‌త ప‌శ్చిమ‌బెంగాల్‌లో ఇప్ప‌టికే స‌క్సెస్ అవ్వ‌గా ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై కూడా ప్ర‌యోగిస్తోంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇందుకోసం బీజేపీ 'ఆప‌రేష‌న్ ఫినిష్ టీడీపీ' అంటోంది. ఓవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బ‌లీయ‌మైన శ‌క్తిగా ఎద‌గ‌డంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి ఆ పార్టీ స్థానంలోకి తాము ఎద‌గాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంది. ఇందుకోసం ఇప్ప‌టికే వ్యూహాలు అమ‌లు చేస్తూ చ‌ర్చ‌లు ప్రారంభించిన ఆ పార్టీ చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌గానే భారీ షాక్ ఇచ్చింది.

చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితులుగా ఉండే సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేశ్ తో పాటు గ‌రిక‌పాటి మోహ‌న్‌రావు, టీజీ వెంక‌టేశ్ టీడీపీని వీడి బీజేపీలో చేర‌డం ఖాయ‌మైంది. వీరు న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులుగా ఉన్నారు. మ‌రోవైపు ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో ఓడిన సుమారు 20 మంది కాపు సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కాకినాడ‌లో పార్టీ అధిష్టానానికి స‌మాచారం లేకుండా ర‌హ‌స్యంగా స‌మావేశ‌మ‌య్యారు.

పైకి తాము ఏ పార్టీలోకి వెళ్ల‌డం లేద‌ని, కేవ‌లం ఓట‌మిపై స‌మీక్షించుకునేందుకే భేటీ అయ్యామ‌ని చెబుతున్నా వారి అంత‌రంగం మాత్రం వేరే ఉంద‌ని తెలుస్తోంది. బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, వ్యూహ‌క‌ర్త‌గా గుర్తింపు ఉన్న రాంమాధ‌వ్ వీరిలో కొంద‌రితో ఇప్ప‌టికే చ‌ర్చ‌లు జ‌రిపార‌ని, బీజేపీలో చేరిన సుజ‌నా చౌద‌రి వారితో ట‌చ్‌లో ఉన్నార‌ని తెలుస్తోంది. ఇక‌, బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు కూడా బీజేపీ పెద్ద ప్లాన్‌తో ఉంద‌ని స్ప‌ష్టం చేస్తున్నాయి. చంద్ర‌బాబు విదేశాల నుంచి తిరిగి వ‌చ్చే వ‌ర‌కు టీడీపీలో చాలా పెద్ద స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని, చాలామంది నేత‌లు త‌మ పార్టీలో చేరేందుకు సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు ప‌రిశీలిస్తే ఆయ‌న వ్యాఖ్య‌లు నిజ‌మే అనేలా ఉన్నాయి. మొత్తంగా పార్టీ చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేనంత ఓట‌మిని ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో ఎదుర్కున్న ఆ పార్టీ ఇప్పుడు తీవ్ర సంక్షేభం దిశ‌గా వెళుతున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. మ‌రి, బీజేపీ వ్యూహాల‌ను చిత్తు చేసి చంద్ర‌బాబు మ‌ళ్లీ తెలుగుదేశం పార్టీని నిల‌బెట్ట‌గ‌ల‌రా చూడాలి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle