newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

బీజేపీలో విలీనం చెల్లదన్న టీడీపీ ఎంపీలు

21-06-201921-06-2019 18:16:45 IST
Updated On 21-06-2019 18:34:49 ISTUpdated On 21-06-20192019-06-21T12:46:45.648Z21-06-2019 2019-06-21T12:46:44.096Z - 2019-06-21T13:04:49.767Z - 21-06-2019

బీజేపీలో విలీనం చెల్లదన్న టీడీపీ ఎంపీలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుని టీడీపీ ఎంపీలు ఈరోజు ఢిల్లీలో కలిశారు. రాజ్యసభలో టీడీపీ పక్షం విలీనం చెల్లదంటూ ఆయనకు ఓ లేఖ సమర్పించారు. టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరడం ఫిరాయింపుల కిందకే వస్తుందని ఫిర్యాదు చేశారు. పార్టీ మారిన నలుగురు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని కోరారు. 

No photo description available.

వెంకయ్యనాయుడిని కలిసిన వారిలో ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్, తోట సీతారామలక్ష్మి ఉన్నారు. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం బీజేపీ పార్లమెంటరీ పార్టీలో టీడీపీకి చెందిన నలుగురు ఎంపీల విలీనం అనేది చెల్లదని వారు పేర్కొన్నారు. 

No photo description available.

ఆ నలుగురు ఎంపీలు చెప్పినట్టు.. టీడీపీపీలో ఎలాంటి చర్చ జరగలేదన్నారు. పార్టీ విలీనం కావాలంటే సంస్థాగతంగా విలీనం కావాలన్నారు ఎంపీ గల్లా జయదేవ్. నలుగురిని డిస్ క్వాలిఫై చేయాలన్నారు. రాజ్యసభలో ఫ్లోర్ లీడర్‌గా కనకమేడల రవీందర్ గారిని, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా తోట సీతారామలక్ష్మి వ్యవహరిస్తాకని జయదేవ్ చెప్పారు. మాకు తెలిసి పార్లమెంటరీ మీటింగ్ జరగలేదని,  తీర్మానం పాస్ కాలేదు. అది చెల్లదని చెప్పాం అన్నారు మరో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్. 

టీడీపీ రాజ్యసభ లెజిస్లేచర్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని నలుగురు కోరారన్నారు. విలీనం చేయడం అనేది ఉపరాష్ట్రపతి పరిధిలోనిది కాదన్నారు రవీంద్రకుమార్.  అది ఈసీ పరిధిలోనిదని, అలాగే లోక్ సభ స్పీకర్ కూడా దీనిపై నిర్ణయించలేరన్నారు. డిస్ క్వాలిఫికేషన్ కే అది పరిమితం అవుతుందన్నారు. విలీనం చేసే అధికారం స్పీకర్, ఉపరాష్ట్రపతి నిర్ణయించలేరు. ఈసీ అనుమతిస్తేనే నిబంధనలు వర్తిస్తాయన్నారు కనకమేడల రవీంద్రకుమార్. న్యాయపరంగా అంశాలను పరిశీలిస్తామని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తమకు వివరించామన్నారు. రాజ్యసభ ఛైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు రవీంద్రకుమార్. విలీనానికి ఈసీ అనుమతించిందా లేదా అనేది ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడికి ఇంకా అధికారిక సమాచారం లేదన్నారు. అలాంటప్పుడు వీరిని బీజేపీలో విలీనం చేసుకున్నారని ఎలా చెబుతారని రవీంద్రకుమార్ అన్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle