newssting
BITING NEWS :
* ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ గరం గరం *సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన శివసేన.. ఇవాళ విచారణ *సమ్మెపై హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాం: అశ్వథ్థామరెడ్డి.*ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో కోహ్లీ, బుమ్రా *గురుగ్రామ్ లో తైక్వాండో క్రీడాకారిణి సరిత దారుణ హత్య *మిషన్ భగీరథ అవినీతిపై సీబీఐతో విచారణ జరపాలి : భట్టి విక్రమార్క*నా పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకెళ్లారా ? : పవన్*ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్టులో విచారణ *ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ

బీజేపీలో టీడీపీ విలీనానికి జీవీఎల్ మధ్యవర్తిత్వం

20-10-201920-10-2019 09:49:43 IST
2019-10-20T04:19:43.481Z20-10-2019 2019-10-20T04:19:19.581Z - - 14-11-2019

బీజేపీలో టీడీపీ విలీనానికి జీవీఎల్ మధ్యవర్తిత్వం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత ఎన్నికలకు ముందు కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వంతో ఘర్షణకు దిగడంద్వారా తప్పు చేశామని తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొనడం సంచలనం కలిగించింది. పైగా తనకు ప్రధాని నరేంద్రమోదీతో వ్యక్తిగతంగా శత్రుత్వం ఏదీ లేదని చంద్రబాబు స్పష్టం చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలకు దారితీసింది.

అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్‌ధర్ మొదలుకుని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వరకు పైనుంచి కింది దాకా బీజేపీ నాయకత్వం తాము టీడీపీకి తలుపులు పూర్తిగా మూసివేశామని, ఆ పార్టీతో మళ్లీ పొత్తు కుదిరే అవకాశమే లేదని తేల్చిచెప్పడం తెలిసిందే.

అయితే బీజేపీ నాయకుడు, ఆ పార్టీ జాతీయ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు శనివారం ఒక ఆసక్తికరమైన ప్రతిపాదన చేశారు. చంద్రబాబు నాయుుడు తెలుగుదేశం పార్టీని నిజంగానే బీజేపీలో విలీనం చేయాలని భావిస్తున్నట్లయితే  ఈ విషయాన్ని మా పార్టీ కేంద్ర నాయకత్వంతో చర్చిస్తానని, వీలైతే విలీనానికి మధ్యవర్తిత్వం కూడా వహిస్తానని జీవీఎల్ పేర్కొనడం సంచలన కారకమైంది.

ప్రస్తుతం రాజ్యసభలో జీవీఎల్ సహచరుడు, మాజీ కేంద్ర మంత్రి వైఎస్ చౌదరి లేక సుజనా చౌదరి ఇటీవల ఒక ప్రకటన చేస్తూ టీడీపీని తాను బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నిస్తానని చేసిన ప్రకటన నేపథ్యంలో జీవీఎల్ తాజా ప్రతిపాదనతో ముందుకొచ్చారు.

సుజనా చౌదరి అలాంటి ప్రకటన చేసినట్లు నా దృష్టికి రాలేదు. చంద్రబాబు నాయుడితో తన మునుపటి సాన్నిహిత్యం కారణంగా సుజనా టీడీపీ పట్ల అలాంటి మృదు వ్యాఖ్య చేసి ఉండవచ్చు. లేదా బీజేపీలో తెలుగుదేశం పార్టీ విలీనం గురించి ఆయన మాట్లాడి ఉండవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు వద్ద అలాంటి ప్రతిపాదన ఏదైనా ఉంటే, నేను మా జాతీయ నాయకత్వంతో ఈ విషయమై మాట్లాడతాను అని జీవీఎల్ పేర్కొన్నారు.

అయితే టీడీపీని విలీనం చేసుకోవడం ద్వారా బీజేపీకి పెద్దగా ఒరిగిదేమీ లేకపోవచ్చని జీవీఎల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలుగదేశ పార్టీ రాజకీయంగా సర్వస్వం కోల్పోయింది. ఇక అది కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే తన రాజకీయ భవిష్యత్తు గురించి చంద్రబాబు నాయుడు తీవ్రంగా కలవరపడుతున్నట్లు తెలుస్తోంది అని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

   11 hours ago


చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

   12 hours ago


ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

   13 hours ago


ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

   13 hours ago


మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

   14 hours ago


పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

   14 hours ago


జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

   14 hours ago


న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

   15 hours ago


జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

   15 hours ago


అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle