newssting
BITING NEWS :
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై అన్నాడీఎంకేలో అసంతృప్తులు. సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఎవరికివారు నేనంటే నేనే అంటూ వాదులాడుకునే స్థాయికి చేరిన వివాదం. వివాదానికి తెరదించేలా అక్టోబరు 7న అధికారిక ప్రకటిన చేయనున్నట్లు స్పష్టం చేసిన పార్టీ * కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టం బిల్లు ఆమోదాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేరళకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ టీఎన్‌ ప్రతాపన్‌. వ్యవసాయ రంగం అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, కేం‍ద్రప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని సుప్రీం పిటిషన్ లో పేర్కొన్న ఎంపీ. కేం‍ద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మూడు చట్టాలు రాజ్యాంగ విరుద్దమని, చెల్లదని రద్దుచేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరిన ఎంపీ * అసోం మాజీ మహిళా ముఖ్యమంత్రి సైదా అన్వర తైమూర్ (84) అనారోగ్యంతో ఆస్ట్రేలియాలో కన్నుమూత. అసోం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా 4 దశాబ్దాల పాటు పనిచేసిన సైదా అన్వర తైమూర్. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సైదా అన్వర అసోం మొట్టమొదటి మహిళా సీఎం. గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో ఉన్న తన కుమారుడి వద్ద ఉంటున్న సైదా అన్వర తీవ్ర అనారోగ్యానికి గురై కన్నుమూత * బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి(61)కి కరోనా సోకిన సంగతి తెలిసిందే. హిమాలయాల పర్యటనలో ఉండగా స్వల్ప జ్వరం రావడంతో పరీక్షలు చేయగా పాజిటివ్‌ ఫలితాలు. రిషికేశ్‌ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరినట్లుగా ట్వీట్. తన డ్రైవర్‌కు పాజిటివ్‌ వచ్చిందని, అతడి ద్వారా వ్యాపించి ఉంటుందని ట్వీట్ లో వెల్లడించిన ఉమా భారతి * రైలు ప్రయాణికుల నెత్తిన చార్జీల భారం మోపేందుకు రైల్వే శాఖ కసరత్తులు. అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన రైల్వే స్టేషన్ల ప్రయాణికులపై చార్జీల మోత. ప్రయాణికుడు కొనుగోలు చేసే టికెట్ ధరను బట్టి పెరుగుదలకు అవకాశం. గరిష్ఠంగా రూ.35 నుండి కనిష్ఠంగా పది రూపాయల వరకు వసూలు చేయనున్న వినియోగ రుసుము* దేశవ్యాప్తంగా మొత్తం 7 వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో రద్దీగా ఉండే స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి వినియోగ రుసుమును వసూలు చేస్తామని రైల్వే శాఖ ఇది వరకే ప్రకటించింది. ఇలా అభివృద్ధి చేసిన స్టేషన్లు దాదాపు 1000 వరకు ఉన్నాయి. రైల్వే శాఖ ప్రతిపాదనకు కేంద్రం కనుక ఆమోద ముద్ర వేస్తే ఈ స్టేషన్లలోని ప్రయాణికుల జేబులకు చిల్లులు పడడం ఖాయం * నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఆకస్మాత్తుగా కుప్పకూలడంతో ముగ్గురు దుర్మరణం. గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలో సోమవారం రాత్రి జరిగిన ఘటన. బావామాన్ పురా ప్రాంతంలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం. ఈ ఘటనలో అక్కడికక్కడే మరణించిన ముగ్గురు వ్యక్తులు. కరోనా బారిన పడ్డ ఒడిశా డిప్యూటీ స్పీకర్ రజనీకాంత్ సింగ్‌తోపాటు 11 మంది ఎమ్మెల్యేలు. నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, పాత్రికేయులకు ప్రత్యేకంగా కరోనా పరీక్షలు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్, 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్టు నిర్ధారణ * ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి అధికంగా సాగుతున్న వరద నీటి ప్రవాహం. జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల చేస్తున్న అధికారులు. జలాశయం ఇన్ ఫ్లో 2,05,017 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 3,06,819 క్యూసెక్కులు. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. 883.90 అడుగులకు చేరిన ప్రస్తుతం నీటి మట్టం * తమ భూములకు సరైన నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు కృష్ణంరాజు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణలో తమ భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్ దాఖలు. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు * దేశంలో సోమవారం నుండి ప్రారంభమైన వాయువ్య భారతం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌, బికనీర్‌ల నుంచి ఈనెల 17నే ఉపసంహరణ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈసారి 11 రోజులు ఆలస్యం. ఏపీ నుంచి అక్టోబరు 15న రుతుపవనాలు నిష్క్రమిస్తాయని అంచనా. కాగా, దక్షిణ ఏపీలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. దీని ప్రభావంతో రాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం. 18 క్రస్టు గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3,10,631 క్యూసెక్కులు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 309.6546 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగులకు చేరిక * మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో 2 గేట్ల నుంచి నీటి విడుదల చేస్తున్న అధికారులు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 645 అడుగులు(4.46టీఎంసీలు) కాగా 644 అడుగుల(4.20టీఎంసీలు)కు చేరిన ప్రస్తుత నీటి మట్టం. అలాగే ఇన్ ఫ్లో 4,505 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3,978 క్యూసెక్కులుగా నమోదు * కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు లంచం కేసులో అరెస్టయిన ముగ్గురు సహనిందితులకు ఏసీపీ ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు. చేసింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శ్రీనాథ్‌యాదవ్‌, మధ్యవర్తి అంజిరెడ్డి, వీఆర్‌ఏ సాయిరాజ్‌కు బెయిల్‌

బీజేపీలో జ‌గ‌న్ శ్రేయోభిలాషులు వీరేనా?

30-05-202030-05-2020 08:26:34 IST
Updated On 30-05-2020 11:14:49 ISTUpdated On 30-05-20202020-05-30T02:56:34.792Z30-05-2020 2020-05-30T02:56:20.723Z - 2020-05-30T05:44:49.387Z - 30-05-2020

బీజేపీలో జ‌గ‌న్ శ్రేయోభిలాషులు వీరేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విష‌యంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఒక్కోసారి ఒక్కోలా ప్ర‌వ‌ర్తిస్తూ ఉంటోంది. ముఖ్యంగా ఆ పార్టీలోని కొంద‌రు నేత‌లు జ‌గ‌న్‌కు సానుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. మ‌రికొంద‌రు జ‌గ‌న్ పేరు విన‌గానే శ‌త్రువు లాగా చూస్తూ ఒక రేంజ్‌లో విరుచుకుప‌డుతుంటారు. ఇక‌, జాతీయ స్థాయిలో బీజేపీ పెద్ద‌లు జ‌గ‌న్ ప‌ట్ల కొంత సానుకూలంగా వెళుతుండ‌గా రాష్ట్ర బీజేపీ నేత‌లు మాత్రం జ‌గ‌న్ ప‌ట్ల కొంత వ్య‌తిరేకత ప్ర‌ద‌ర్శిస్తూ ఉంటారు. చాలా విష‌యాల్లో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వెళ్ల‌డంలో ప్ర‌తిప‌క్ష టీడీపీని మించి దూకుడుగా వెళ‌తారు బీజేపీ నేత‌లు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గాల‌నేది బీజేపీ నేత‌ల ల‌క్ష్యం. ఇందుకోస‌మే ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించేందుకు ఆరాట‌ప‌డుతోంది. చాలా విష‌యాల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఆందోళ‌న‌ల‌ను ముందుండి న‌డిపిస్తోంది. అయితే, ఏపీ బీజేపీలోనూ రెండు వ‌ర్గాలు ఉన్నాయ‌నే చ‌ర్చ చాలా రోజులుగా జ‌రుగుతోంది. కొత్త‌గా వ‌చ్చిన కొంద‌రు నేత‌లు జ‌గ‌న్ ప‌ట్ల తీవ్ర వ్య‌తిరేక‌త నింపుకున్నారు. పాత బీజేపీ నేత‌లు, గ‌త ఎన్నిక‌ల ముందు చంద్ర‌బాబు ప్ర‌భుత్వంతో పోరాడిన వారు మాత్రం జ‌గ‌న్ ప‌ట్ల కొంత సానుకూల ధోర‌ణితో ఉంటారు.

ఈ నేప‌థ్యంలో బీజేపీలో జ‌గ‌న్‌కు శ్రేయోభిలాషులు ఉన్నార‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇందుకు పెద్ద ఉదాహ‌ర‌ణ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి. రాజ్య‌స‌భ స‌భ్యుడు, మాజీ కేంద్ర మంత్రి అయిన ఈ బీజేపీ సీనియ‌ర్ నేత జ‌గ‌న్‌కు కొంత సానుకూలంగా ఉంటున్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న విష‌యాల్లో సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి అండ‌గా నిలుస్తున్నారు.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చిన మొద‌ట్లోనే ఆయ‌న ఒక క్రిష్టియ‌న్‌ను టీటీడీ ఛైర్మ‌న్ చేశార‌ని పెద్ద ఎత్తున దేశ‌వ్యాప్తంగా త‌ప్పుడు ప్ర‌చారం మొద‌లైంది. వైవీ సుబ్బారెడ్డి నికార్సైన హిందువు అని తెలియ‌ని చాలా మంది జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ స‌మ‌యంలో మొద‌టిసారి సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి జోక్యం చేసుకున్నారు. వైవీ సుబ్బారెడ్డి త‌న‌కు బాగా తెలుస‌ని, ఆయ‌న ప‌క్కా హిందువు అని ప్ర‌క‌టించారు.

హిందుత్వవాదుల్లో, నెటిజ‌న్ల‌లో సుబ్ర‌హ్మ‌ణ్యస్వామి ఉన్న‌ది ఉన్న‌ట్లు కుండ‌బ‌ద్ద‌లు కొడ‌తార‌నే పేరుంది. దీంతో ఆయ‌న ఈ ప్ర‌క‌ట‌న చేశాక‌నే వివాదం స‌ద్దుమ‌ణిగింది. ఇటీవ‌ల టీటీడీ భూముల వేలం వ్య‌వ‌హారంలోనూ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై జాతీయ స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇప్పుడు కూడా సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి టీటీడీ భూములు అమ్మ‌డం కొత్త కాద‌ని, చాలా రోజులుగా జ‌రుగుతోంద‌ని ట్వీట్ చేశారు.

పైగా ఈ నిర్ణ‌యం గ‌త ప్ర‌భుత్వం తీసుకుంద‌ని, అప్పుడు టీటీడీ బోర్డులో బీజేపీ నేత భానుప్ర‌కాశ్ రెడ్డి స‌భ్యుడిగా ఉన్నార‌ని గుర్తు చేశారు. జ‌గ‌న్ ఛాన‌ల్‌కు సైతం ఆయ‌న ఈ విష‌యాలు చెప్ప‌డానికే ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూ కూడా ఇచ్చారు. వాస్త‌వానికి ఏ వైసీపీ నేత ఈ విష‌యాలు చెప్పినా పెద్ద‌గా ప్రాధాన్య‌త ఉండేది కాదు. సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి చెప్ప‌డంతో నెటిజ‌న్ల‌కు నిజానిజాలు తెలిశాయి. ఈ విష‌యంలో బీజేపీ నేత భానుప్ర‌కాశ్‌రెడ్డి.. సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నార‌ని ప‌రోక్షంగా విమ‌ర్శించారు.

ఇక‌, మ‌రో బీజేపీ కీల‌క నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు కూడా జ‌గ‌న్ పట్ల కొంత ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తుంటారు. అమ‌రావ‌తి విష‌యంలో క‌చ్చితంగా కేంద్రం జోక్యం చేసుకొని జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని ఆపుతుంద‌నే బీజేపీ నేత‌లు, బీజేపీతో పొత్తు పెట్టుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పుకొచ్చారు. కానీ, జీవీఎల్ మాత్రం రాష్ట్రం ప‌రిధిలోని రాజ‌ధాని అంశంలో కేంద్రం ఎట్టి ప‌రిస్థితుల్లో జోక్యం చేసుకోద‌ని ప‌దేప‌దే చెప్పారు. ఆఖ‌రికి కేంద్రం కూడా జీవీఎల్ చెప్పిన విష‌యాన్నే దృవీక‌రించింది. మిగ‌తా విష‌యాల్లోనూ జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి సంబంధించి ఆచితూచి అడుగులు వేస్తారు. వివిధ అంశాల‌పై ఆయ‌న విమ‌ర్శించినా పెద్ద‌గా సీరియెస్ కామెంట్స్ చేయ‌రు.

ఇక‌, తాజాగా బీజేపీ అగ్ర నేత‌ల్లో ఒక‌రైన రాంమాధ‌వ్ ఏపీ బీజేపీ నేత‌ల‌కు గ‌ట్టి షాక్ ఇచ్చే వ్యాఖ్య‌లు చేశారు. అధికారంలోకి వ‌చ్చి ఏడాది అయిన సంద‌ర్భంగా జ‌గ‌న్‌కు శుభాకాంక్ష‌లు చెప్పిన ఆయ‌న ఏపీని అభివృద్ధిప‌థంలో న‌డిపించేందుకు జ‌గ‌న్ ధృడ సంక‌ల్పంతో ప‌ని చేస్తున్నార‌ని ప్ర‌శంసించారు. అక్క‌డ‌క్క‌డా వివాదాలు ఉన్నా అవేం పెద్ద‌వి కావ‌ని కొట్టి పారేశారు.

కేంద్రం తీసుకుంటున్న మంచి నిర్ణ‌యాల‌కు వైసీపీ మ‌ద్ద‌తు ఇస్తోంద‌ని, అలాగే ఏపీ ప్ర‌భుత్వానికి కూడా కేంద్రం అన్ని విధాలుగా స‌హ‌క‌రిస్తుంద‌ని చెప్పారు. మోడీ - జ‌గ‌న్ మ‌ధ్య మంచి సంబంధాలు ఉన్నాయ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై రోజూ అనేక విమ‌ర్శ‌లు చేసే రాష్ట్ర బీజేపీ నేత‌లు రాంమాధ‌వ్ వ్యాఖ్య‌ల‌ను ఎలా తీసుకుంటార‌నేది చూడాల్సి ఉంది. మొత్తానికి బీజేపీలో జ‌గ‌న్‌కు వెల్ విషెర్స్ ఉన్న‌ట్లే క‌నిపిస్తోంది.

 

 

 

బీజేపీదీ విస్తరణ కాంక్షే!

బీజేపీదీ విస్తరణ కాంక్షే!

   11 hours ago


దంచి కొడుతున్న వానలతో నిండు కుండలా తెలంగాణ.. పదేళ్ల రికార్డు బద్దలు

దంచి కొడుతున్న వానలతో నిండు కుండలా తెలంగాణ.. పదేళ్ల రికార్డు బద్దలు

   12 hours ago


ఏడాదిలో పీజీ, డిగ్రీ త‌ర్వాత పీహెచ్‌డీ... జ‌గ‌న్ దిశా నిర్దేశం

ఏడాదిలో పీజీ, డిగ్రీ త‌ర్వాత పీహెచ్‌డీ... జ‌గ‌న్ దిశా నిర్దేశం

   12 hours ago


ఏపీ బీజేపీ మౌన‌మెందుకు?.. వైసీపీ నేత‌ల‌కు అలుసైపోయారా?

ఏపీ బీజేపీ మౌన‌మెందుకు?.. వైసీపీ నేత‌ల‌కు అలుసైపోయారా?

   13 hours ago


ఏపీలో పాఠశాలలు తెరవడం.. ఇప్పట్లో లేనట్లేనా..!

ఏపీలో పాఠశాలలు తెరవడం.. ఇప్పట్లో లేనట్లేనా..!

   13 hours ago


దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల..!

దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల..!

   14 hours ago


శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొన్న మ‌రో మంత్రికి క‌రోనా పాజిటివ్‌!

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొన్న మ‌రో మంత్రికి క‌రోనా పాజిటివ్‌!

   14 hours ago


రూ. 70 కోట్ల బకాయిలు కట్టకపోతే ఆయిల్ బంద్.. టీఎస్ఆర్టీసీకి కొత్త చిక్కులు

రూ. 70 కోట్ల బకాయిలు కట్టకపోతే ఆయిల్ బంద్.. టీఎస్ఆర్టీసీకి కొత్త చిక్కులు

   16 hours ago


అశ్వ‌నీదత్‌, కృష్ణంరాజు ఏపీ ప్రభుత్వం పై న్యాయ పోరాటం...

అశ్వ‌నీదత్‌, కృష్ణంరాజు ఏపీ ప్రభుత్వం పై న్యాయ పోరాటం...

   16 hours ago


కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇష్టంలేదా?!

కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇష్టంలేదా?!

   16 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle