newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

బీజేపీలో చేరిన అంబికా క‌ృష్ణ ..మరి బాబుకి మిగిలేదెవరు?

24-06-201924-06-2019 15:16:09 IST
Updated On 24-06-2019 17:36:31 ISTUpdated On 24-06-20192019-06-24T09:46:09.657Z24-06-2019 2019-06-24T09:46:06.917Z - 2019-06-24T12:06:31.482Z - 24-06-2019

బీజేపీలో చేరిన అంబికా క‌ృష్ణ ..మరి బాబుకి మిగిలేదెవరు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో తెలుగుదేశం పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, అంబికా దర్బార్ బత్తి అధినేత, టీడీపీ నేత అంబికా కృష్ణ పార్టీని వీడారు. ఈమధ్యే నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. వారి బాటలోనే అంబికా క‌ృష్ణ చేరారు.

ఢిల్లీలో ఉన్న అంబికా కృ‌ష్ణ, ఆయన సోదరుడు రాజా బీజేపీలో చేరారు. అంబికా క‌ృష్ణ బీజేపీ నేత రాంమాధవ్‌ సమక్షంలో బీజేపీలో చేరిపోయారు. ఆయనకు రాంమాధవ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంబికా క‌ృష్ణకు సెన్సార్ బోర్డులో అవకాశం కల్పించవచ్చని అంటున్నారు. 

అంబికా క‌ృష్ణ ..ప్రస్తుతం ఏపీ ఫిల్మ్‌, థియేటర్‌, టెలివిజన్‌ కార్పొరేషన్‌ ఛైర్మెన్‌గా కొనసాగుతున్నారు.  గత కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన పార్టీ మార్పుతో పశ్చిమ టీడీపీలో గందరగోళం నెలకొంది. ఇటీవల గెలిచిన వారిలో 14మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద బాబుతో ఉండేదెవరో అర్థం కాక క్యాడర్ తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయింది.

టీడీపీ అధినేత చంద్రబాబుకి వియ్యంకుడు బాలయ్య బాబుకి అంబికా క‌ృష్ణ అత్యంత సన్నిహితుడు. ఈయన పార్టీ మారతారనే విషయం బాలయ్యకు తెలియదా? ఒక వేళ తెలిసీ ఆయన మిన్నకుండిపోయారా? అనేది చర్చకు దారితీస్తోంది. అసలు అంబికా కృ‌ష్ణకు ఈ పదవి ఇప్పించిందే బాలయ్యబాబు. అలాంటి బాలయ్యకు తెలియకుండా ఈ వ్యవహారం తెలియకుండా జరిగి వుంటుందా? అనేది టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. 

ఇదిలా ఉంటే, కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన ఆ  పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భారత్‌కు ప్రయాణం కానున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle