newssting
BITING NEWS :
*దేశంలో కరోనా విజృంభణ... 7,42,661, మరణాలు 20,53, కోలుకున్నవారు 4,57, 016 *నేడు వైఎస్సార్‌ 71వ జయంతి *ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్ *శ్రీకాకుళం జిల్లాలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పర్యటన..ఆమదాలవలసలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న విజయసాయిరెడ్డి *కడప : ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి సందర్భంగా కుటుంబసభ్యుల తో కలసి నివాళులర్పించనున్న సీఎం జగన్*తెలంగాణలో 1879 కరోనా పాజిటివ్ కేసులు, 7 గురు మృతి..తెలంగాణలో ఇప్పటి వరకు 313 మంది మృతి..హైదరాబాద్ లో 1422 కేసులు..యాక్టివ్ కేసులు 11,012, డిశ్చార్జ్ అయిన కేసులు 16,287* రాజ‌ధానిలో త‌ల‌పెట్టిన 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హ ఏర్పాటును విజ‌య‌వాడ‌కు మార్చిన ఏపీ స‌ర్కార్ *ముంబై ఎయిర్‌పోర్టు అథారిటీ నిధుల గోల్‌మాల్‌పై ఇప్ప‌టికే జీవీకేపై కేసు న‌మోదు చేసిన సీబీఐ.. సీబీఐ కేసు ఆధారంగా కేసు న‌మోదు చేసిన ఈడీ*ఏపీలో గ‌త‌ 24 గంటల్లో 1178 క‌రోనా పాజిటివ్ కేసులు, 13 మంది మృతి.. 21,197కి చేరిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 252 మంది మృతి*ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై హైకోర్టులో పిల్. కరోనా టెస్టులు, చార్జీల నియంత్రణ మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషన్. యశోద, కేర్, సన్ షైన్, మెడికవర్ ఆసుపత్రులకు హైకోర్టు నోటీసులు. ఈనెల 14 లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

బీజేపీలోకి బైరెడ్డి - అంతా సిద్ధం?

25-10-201925-10-2019 09:59:59 IST
Updated On 25-10-2019 15:37:43 ISTUpdated On 25-10-20192019-10-25T04:29:59.924Z24-10-2019 2019-10-24T14:05:19.203Z - 2019-10-25T10:07:43.102Z - 25-10-2019

బీజేపీలోకి బైరెడ్డి - అంతా సిద్ధం?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాయ‌ల‌సీమ రాజ‌కీయాల్లో ఇప్పుడు ఓ వార్త సంచ‌ల‌నం సృష్టిస్తోంది. బైరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పార్టీ మారేందుకు అంతా సిద్ధం చేసుకున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. దీంతో, అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసిన నాటి నుంచి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్న బైరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి టీడీపీకి గ‌ట్టి షాక్ ఇచ్చిన‌ట్ల‌యింది.

కాగా, వైసీపీ అధికారంలోకిరాక ముందు టీడీపీలో చేరేందుకు బైరెడ్డి చేయ‌ని ప్ర‌య‌త్న‌మంటూ లేదనే చెప్పాలి. ఎట్ట‌కేల‌కు ఆయ‌న ప్ర‌య‌త్నాలు ఎన్నిక‌ల‌కు ముందు ఫ‌లించాయి.

స‌రిగ్గా ఎన్నిక‌లు స‌మీపిస్తున్నాయ‌న‌గా నారా చంద్ర‌బాబు నాయుడు బైరెడ్డికి రాజశేఖ‌ర్‌రెడ్డికి టీడీపీ కండువాక‌ప్పి పార్టీలోకి స్వాగ‌తం ప‌లకడంతోపాటు త‌మ పార్టీ త‌రుపున నిల‌బ‌డిన‌ నాడు నంది కొట్కూరు, పాణ్యం, నంద్యాల ఎంపీ అభ్య‌ర్ధుల విజ‌యానికి కృషి చేయాల‌ని ఆదేశించారు.

చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు అప్ప‌టి వ‌ర‌కు బ‌ద్ద‌శ‌త్రువులుగా ఉన్న గౌరు వెంక‌ట్‌రెడ్డితో బైరెడ్డి చేతులు క‌ల‌ప‌క త‌ప్ప‌లేదు. టీడీపీ అభ్య‌ర్ధుల‌ను గెలిపించాలంటూ ఊరూరా తిరుగుతూ ప్ర‌చారం నిర్వ‌హించారు. కానీ వైసీపీ ఫ్యాన్ గాలికి బైరెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చార క‌ష్ట‌మంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరు మాదిరి అయింది.ఇలా సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర ప‌రాజయం పాల‌వ‌డంతో త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై బైరెడ్డి తీవ్రంగా ఆలోచిచారంటూ ఆయ‌న అనుచ‌ర‌వర్గం చెప్పుకొస్తుంది.

అదే స‌మయంలో ఢిల్లీకి చెందిన కొంద‌రు బీజేపీ కీల‌క నేతుల బైరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి ట‌చ్‌లోకి వ‌చ్చార‌ని, మ‌రీ ముఖ్యంగా ఇటీవ‌ల టీడీపీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఎంపీలు సీఎం ర‌మేష్, సుజ‌నా చౌద‌రి, టీజీ వెంక‌టేష్‌, మాజీ మంత్రి ఆది నారాయ‌ణ‌రెడ్డి సైతం బైరెడ్డిని త‌మ పార్టీలోకి ర‌మ్మంటూ  ఆహ్వానించిన‌ట్టు తెలుస్తుంది.

బీజేపీ జాతీయ అధ్య‌క్షులు అమిత్ షా కూడా బైరెడ్డి చేరిక‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌న్న వార్త ఇప్పుడు అటు ఆ పార్టీలోనే కాకుండా, ఇటు టీడీపీలోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీంతో త‌న అనుచ‌రుల అభిప్రాయం కోసం స‌మావేశం ఏర్పాటు చేసిన బైరెడ్డి వారూ సుముఖ‌త వ్య‌క్తం చేయ‌డంతో ఇక బీజేపీలో చేరిక‌కు లైన్ క్లియ‌ర్ అయిన‌ట్ట‌యింది.

ఇదే స‌మ‌యంలో బీజేపీలోకి చేరిక ఓకే.. మ‌రి ఆ పార్టీలో మీకు కీల‌క స్థానం ద‌క్కుతుందా..? అని కొంద‌రు స‌న్నిహితులు బైరెడ్డిని ప్ర‌శ్నించ‌గా, అందుకు స‌మాధానంగా ఆయ‌న చాలా విష‌యాల‌నే చెప్పుకొచ్చారని అనుచ‌రులు చెప్పుకొస్తున్నారు.

అనుచ‌రులు చెప్పిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త కొన్ని రోజులుగా దేశ రాజధానిలో బీజేపీ కీల‌క నేత‌లతో ర‌హ‌స్య స‌మావేశం జ‌రిగింది. అక్క‌డ అన్ని విష‌యాలు మాట్లాడాను. ముఖ్యంగా రాయ‌ల‌సీమ అభివృద్ధి, సీమ డిక్ల‌రేష‌న్‌పై చ‌ర్చ జ‌రిగింది. సీమ క‌రువు, పెండింగ్ ప్రాజెక్టులు, నీటి వాటాలో జ‌రుగుతున్న అన్యాయం, రాయ‌ల‌సీమ‌లో రాజ‌ధాని, హైకోర్టు ఏర్పాటు కోసం విద్యార్థి సంఘాల నాయ‌కులు చేస్తున్న  ఉద్య‌మాల‌పై మాట్లాడిన‌ప్పుడు ఢిల్లీ పెద్ద‌లు పాజిటివ్‌గా స్పందించారు. రాయ‌ల‌సీమ అభివృద్ధి గురించి క్లారిటీ ఇచ్చారని, బైరెడ్డి వివ‌రించార‌ట‌.

పార్టీలో త‌మ‌కు స‌ముచిత స్థానం క‌ల్పిస్తామ‌ని కూడా హామీ ఇచ్చిన‌ట్టు బైరెడ్డి కార్య‌క‌ర్త‌ల‌తో చెప్పుకొచ్చార‌ట‌. ఇదిలా ఉంటే బైరెడ్డి బీజేపీలోచేరి గౌరు వెంక‌ట్‌రెడ్డి టీడీపీలో ఉంటే రాజ‌కీయంగా వీరి మ‌ధ్య మ‌ళ్లీ ఆధిప‌త్య పోరు మొద‌ల‌య్యే అవ‌కాశం ఉంద‌ని నందికొట్కూరు, పాణ్యం నియోజ‌క‌వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.  బైరెడ్డి రాశేఖ‌ర్‌రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నార‌న్న క‌థ‌నాలు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌లో భాగంగా బ‌ఢా నేత‌ల‌కే బీజేపీ గాల‌మేస్తోందని మ‌రోసారి స్ప‌ష్ట‌మైందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

 

 

కరోనాతో ఎవ్వరూ ఆడుకోవద్దు.. కేటీఆర్ హెచ్చరిక

కరోనాతో ఎవ్వరూ ఆడుకోవద్దు.. కేటీఆర్ హెచ్చరిక

   21 minutes ago


ఏపీ సీఎంవోలో కీలక మార్పులు చేర్పులు

ఏపీ సీఎంవోలో కీలక మార్పులు చేర్పులు

   13 hours ago


 అది రైతు దినోత్సవం కాదు.. రైతు దగా దినోత్సవం .. లోకేష్ ట్వీట్

అది రైతు దినోత్సవం కాదు.. రైతు దగా దినోత్సవం .. లోకేష్ ట్వీట్

   14 hours ago


అచ్చెన్నాయుడికి ఊరట.. రమేష్ ఆస్పత్రికి తరలించేందుకు అనుమతి

అచ్చెన్నాయుడికి ఊరట.. రమేష్ ఆస్పత్రికి తరలించేందుకు అనుమతి

   19 hours ago


మరిన్ని కోవిడ్ పరీక్షలు.. విజయవాడలో మొబైల్ టెస్టింగ్ వాహనాలు

మరిన్ని కోవిడ్ పరీక్షలు.. విజయవాడలో మొబైల్ టెస్టింగ్ వాహనాలు

   20 hours ago


ఎల్జీ పాలిమర్స్ ఘటన....  సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్

ఎల్జీ పాలిమర్స్ ఘటన.... సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్

   a day ago


విజయమ్మ పుస్తకం ‘నాలో నాతో వైఎస్సార్’ ఆవిష్కరణ.. జగన్ భావోద్వేగం

విజయమ్మ పుస్తకం ‘నాలో నాతో వైఎస్సార్’ ఆవిష్కరణ.. జగన్ భావోద్వేగం

   a day ago


‘‘హైదరాబాద్‌లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి’’

‘‘హైదరాబాద్‌లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి’’

   a day ago


కరోనా పరిస్థితిపై ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

కరోనా పరిస్థితిపై ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

   a day ago


గవర్నర్ Vs సీఎం... కరోనా చిచ్చుపెట్టిందా?

గవర్నర్ Vs సీఎం... కరోనా చిచ్చుపెట్టిందా?

   08-07-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle