newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

బీజేపీలోకి నాదెండ్ల భాస్కరరావు.. తర్వాత ఎవరు?

06-07-201906-07-2019 18:00:19 IST
Updated On 08-07-2019 11:33:57 ISTUpdated On 08-07-20192019-07-06T12:30:19.338Z06-07-2019 2019-07-06T12:30:17.539Z - 2019-07-08T06:03:57.354Z - 08-07-2019

బీజేపీలోకి నాదెండ్ల భాస్కరరావు.. తర్వాత ఎవరు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బీజేపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఎప్పటినుంచో నాదెండ్ల బీజేపీలో చేరతారనే ఊహాగానాలు వచ్చాయి. చివరికి ఇప్పుడు అమిత్ షా పర్యటనలో బీజేపీలో చేరడం చర్చకు దారితీస్తోంది. ఆయన బాటలోనే ఆయన తనయుడు నాదెండ్ల మనోహర్ కూడా చేరతారనే వార్తలు వస్తున్నాయి. గుంటూరు జిల్లా దోనేపూడిలో 1935 జూన్‌ 23న జన్మించిన నాదెండ్ల, 1978లో తొలిసారి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

1983లో ఎన్టీఆర్‌ టీడీపీని పెట్టినప్పుడు, ఆయనతో కలిసి నడిచారు నాదెండ్ల. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా, నాదెండ్ల భాస్కరరావు ఆయన మంత్రి వర్గంలో కేబినెట్ హోదా కలిగిన ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మరుసటి సంవత్సరం ఎన్టీఆర్ ను పీఠం నుంచి దింపేసి, ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 16 వరకు, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నెలరోజుల సీఎం అంటూ అప్పట్లో ఆయనపై చలోక్తులు కూడా విసిరేవారు. నాదెండ్లను పదవి నుంచి తప్పించి మళ్ళీ తన పదవిని పునరుద్ధరించుకోగలిగారు ఎన్టీఆర్. అప్పట్లో గవర్నర్ పాత్రపై విమర్శలు వచ్చాయి, 

అనంతరం మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో, టి.అంజయ్య మంత్రివర్గంలో కూడా మంత్రిగా పనిచేశారు. 1998లో ఖమ్మం నియోజక వర్గం నుండి పన్నెండవ లోక్‌సభకు ఎన్నికై పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు. ఆ తరువాత దాదాపు రెండు దశాబ్దాల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న నాదెండ్ల, తాజాగా బీజేపీలో చేరడం హాట్ టాపిక్ అవుతుంది. ఏపీలో బీజేపీ పటిష్టతకు నాదెండ్ల ఏం చేస్తారో చూడాలి. 

అమిత్‌ షా సమక్షంలో భాజపాలో చేరిన వారిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ రామ్మోహన్‌రెడ్డి, మెదక్‌ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, నిర్మాత బెల్లంకొండ రమేశ్‌,  రామగుండం డిప్యూటీ మేయర్‌ ఎం సత్యప్రసాద్‌, భద్రాద్రి కొత్తగూడెం తెదేపా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, బుక్కా వేణుగోపాల్‌, సిద్ధా వెంకటేశ్వరరావు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ చంద్రవదన్‌, మాజీ ఎంపీ చాడా సురేశ్‌రెడ్డి తదితరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle