newssting
BITING NEWS :
*ఢిల్లీలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్... పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం*ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్..రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చీఫ్ జస్టిస్ *జగన్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు-లోకేష్ * బస్సు రోకోకి ఆర్టీసీ జేఏసీ పిలుపు.. అనుమతిలేదన్న పోలీసులు..బస్ డిపోల దగ్గర 144 సెక్షన్ విధింపు* ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న తర్వాత సోనియా గాంధీ నేతృత్వంలో తొలిసారి కీలక భేటీ*టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిపై ప్రివిలేజ్ పిటిషన్ ఇచ్చిన వైసీపీ..స్పీకర్ తమ్మినేనిని పరుష పదజాలంతో దూషించారని ఫిర్యాదు *ఎన్నికలు నాకు కొత్తేమీ కాదు.. దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ పోటీచేయాలి-వంశీ సవాల్

బీజేపీలోకి క‌ర‌ణం బ‌ల‌రామ్‌...?

29-10-201929-10-2019 15:10:35 IST
Updated On 29-10-2019 15:27:16 ISTUpdated On 29-10-20192019-10-29T09:40:35.227Z29-10-2019 2019-10-29T09:40:27.821Z - 2019-10-29T09:57:16.469Z - 29-10-2019

బీజేపీలోకి క‌ర‌ణం బ‌ల‌రామ్‌...?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పుచూసి టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు బెంగ‌ప‌ట్టుకుందా..?కేవలం 23 స్థానాల‌కే టీడీపీని ప‌రిమితం చేయ‌డంపై అస‌లు పార్టీ నేత‌లు, శ్రేణులు త‌న‌తో ఉంటారా..?  గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు నిల‌బ‌డ‌తారా..? అన్న దిగులు ఆయ‌న‌లో మొద‌లైందా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు రాజ‌కీయ విశ్లేష‌కుల నుంచి అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.

అయితే, అత్య‌ధిక మెజార్టీతో గెలిచి అధికారం చేప‌ట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాలు చేస్తాన‌ని చెప్ప‌డం, అందుకు త‌గ్గ‌ట్టుగానే పార్టీ మారాల‌నుకునే ఎమ్మెల్యేలు ప‌ద‌వులు వ‌దులుకుని రావాల్సిందేన‌ని ష‌ర‌తు పెట్ట‌డంతో చంద్ర‌బాబు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే ప‌ద‌విని వ‌దులుకుని ఎవ్వ‌రూ పార్టీ మారేంత సాహసం చేయ‌రు క‌నుక‌.

అయితే వైఎస్ఆర్‌సీపీలా బీజేపీ అలాంటి విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాలు, నిబంధ‌న‌లు ప‌ట్టుకోలేదు. పార్టీలోకి ఎవ‌రొచ్చినా కండువా క‌ప్పేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు క‌మ‌ల‌నాథులు. తాజాగా టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్య‌స‌భ స‌భ్యుడు సుజ‌నా చౌద‌రి, టీడీపీలోని వ‌లస ప‌క్షుల‌పై దృష్టి పెట్టారు.అందుకు ఉదాహ‌ర‌ణే టీడీపీ సీనియ‌ర్ నేత‌, చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రామ్‌తో జ‌రిపిన చ‌ర్చ‌లు.

ఒంగోలులో చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రామ్ బీజేపీ ఎంపీ సుజ‌నాచౌద‌రి భేటీ రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపింది. గాంధీ సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా ఒంగోలుకు వ‌చ్చిన సుజ‌నా చౌద‌రి క‌లిసి క‌ర‌ణం బ‌ల‌రామ్ లంచ్ చేశారు. త‌న బంధువుల ఇంట్లో లంచ్ ఏర‌పాటు చేసిన క‌ర‌ణం బ‌ల‌రామ్ సుజ‌నా చౌద‌రితో క‌లిసి భోజ‌నం చేశారు. అనంత‌రం కొద్దిసేపు ర‌హ‌స్యంగా మంత‌నాలూ జ‌రిపారు.

అయితే, త‌మ‌ది స్నేహ‌పూర్వ‌క క‌ల‌యికేన‌ని క‌ర‌ణం బ‌ల‌రామ్ చెబుతున్నప్ప‌టికి జిల్లా టీడీపీతో పాటు ఆ పార్టీ అధిష్టానాన్ని సైతం ఈ భేటీ షాక్‌కు గురి చేసింది. ఇప్ప‌టికే మాజీ జ‌డ్పీ చైర్మ‌న్ ఈద‌ర హ‌రిబాబు, సిద్ధా వెంక‌టేశ్వ‌ర‌రావుల వంటి కీల‌క నేత‌ల‌తోపాటు ప‌లువురు దిగువ శ్రేణి నేత‌ల‌ను పార్టీలోకి చేర్చుకున్న బీజేపీ తాజాగా జిల్లా టీడీపీలోని పెద్ద త‌ల‌కాయ‌ల‌పై క‌న్నేసింద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.

అందులో భాగంగానే క‌ర‌ణం బ‌ల‌రామ్ సుజ‌నా చౌద‌రిని క‌లిశార‌నే టాక్ న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో క‌ర‌ణమ్ బ‌ల‌రామ్ టీడీపీని వీడి బీజేపీలో చేరితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో దాని ప్ర‌భావం జిల్లా టీడీపీపై ఉంటుంద‌ని ఆ పార్టీ శ్రేణులే చ‌ర్చించుకుంటున్నారు. 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle