newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

బీజేపీలోకి అఖిలప్రియ..?

22-09-201922-09-2019 10:07:53 IST
Updated On 23-09-2019 14:15:32 ISTUpdated On 23-09-20192019-09-22T04:37:53.444Z22-09-2019 2019-09-22T04:37:43.887Z - 2019-09-23T08:45:32.859Z - 23-09-2019

బీజేపీలోకి అఖిలప్రియ..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో భూమా ఫ్యామిలీకి ప్రత్యేక స్థానముంది. ముఖ్యంగా కర్నూల్‌ జిల్లా రాజకీయాలంటే ముందుగా గుర్తుకొచ్చేది భూమా ఫ్యామిలీనే. అంతగా ఆ ఫ్యామిలీ ప్రజాభిమానం పొందింది. తల్లిదండ్రుల వారసత్వంతో భూమా అఖిలప్రియ నిత్యం ప్రజల్లో ఉంటూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ ప్రజల మనిషిగా పేరు సంపాదిస్తున్నారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లి ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. అంతేకాకుండా టీడీపీసైతం అధికారాన్ని కోల్పోవటంతో అప్పటి నుండి ఆమె పార్టీ మార్పుపై పుకార్లు సికార్లు చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఆమె బీజేపీలో చేరుతున్నారంటూ ప్రచారం సాగుతుంది.

ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచిన అఖిలప్రియ.. టీడీపీలోకి వెళ్లారు. అప్పుడు తన తండ్రి భూమా నాగిరెడ్డి అండగా నిలిచారు. ఆ తర్వాత నాగిరెడ్డి మరణంతో భూమా వారసులకు పెద్దదిక్కు లేకుండా పోయింది. అదే సమయంలో మంత్రి పదవి వరించడం.. కాస్త భరోసాగా నిలిచింది. కానీ ప్రస్తుతం ఆమె రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

అఖిలప్రియ క్యాడర్‌ను కాపాడుకొనేందుకు టీడీపీ చేపట్టే పలు కార్యక్రమాల్లోనూ, సొంతంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ పాల్గొంటున్నారు. అయినా అధికార పార్టీలో లేని వెలితి స్పష్టంగా అఖిలప్రియకు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె వైసీపీలో చేరుతారని గతకొద్దిరోజులుగా ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో అంత మంచి అభిప్రాయం లేదని భావించిన అఖిలప్రియ అటువైపు ప్రయత్నాలను నిలిపివేసినట్లు కర్నూలు జిల్లాలో చర్చసాగుతుంది. దీనికితోడు స్పీకర్‌ కోడెల మరణం తరువాత ఆమె వైసీపీ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వమే కోడెల మరణానికి కారణమంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఇదిలాఉంటే ఇప్పుడు అఖిలప్రియ చూపు బీజేపీ వైపు పడినట్లు ఏపీలో చర్చసాగుతుంది. దీనికితోడు ఆమె శనివారం హైదరాబాద్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని కలవడంతో ఏపీ ప్రజల అనుమానాలకు బలంచేకూర్చినట్లయింది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌తో కలిసి ఆమె కిషన్‌రెడ్డిని కలిశారు. అయితే తాము సమస్యలను వివరించేందుకే కేంద్రమంత్రిని కలిశామని అఖిలప్రియ పేర్కొన్నారు.

కర్నూలులో రాజకీయ దాడులు చేస్తున్నారని.. ఫ్యాక్షన్‌ గ్రామాల్లో పరిస్థితులను చక్కదిద్దేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కేంద్ర సహాయ మంత్రిని కోరినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే భూమా కుటుంబ సభ్యులు కొంత మంది టీడీపీకి గుడ్‌ బై చెప్పి.. కమలం గూటికి చేరటంతో, అఖిల ప్రియ కూడా బీజేపీ గూటికి చేరేందుకు.. కిషన్‌ రెడ్డితో భేటీ అయినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనికితోడు రాయలసీమపై కూడా బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టడం.. ఇప్పటికే జేసీ, పరిటాల కుటుంబాలను కూడా కమలం గూటికి రావాలంటూ కమలనాథులు కొందరు ఆహ్వానం పలికినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అఖిలప్రియ బీజేపీలోకి చేరుతారనే వాదనలు రోజురోజుకు బలపడుతున్నాయి. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మరికొద్దిరోజులు ఓపికపట్టాల్సిందే.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle