newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

బీ‘జేపీ’నడ్డా.. రాగానే మొదలెట్టేశారు...!

24-06-201924-06-2019 08:05:12 IST
2019-06-24T02:35:12.275Z24-06-2019 2019-06-24T02:35:07.566Z - - 22-09-2019

బీ‘జేపీ’నడ్డా.. రాగానే మొదలెట్టేశారు...!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నడూ లేని విధంగా బీజేపీ పెద్దలకు ఈమధ్య తెగ ప్రేమ పుట్టుకొచ్చేసింది. ఎన్నికల్లో తిన్న ఎదురుదెబ్బలను పెద్దగా పట్టించుకోకుండా.. టీడీపీని ఎలాగైనా దెబ్బకొట్టాలని తెగ ట్రై చేస్తోంది. బీజేపీ అధ్యక్షుడిగా గతంలో అమిత్ షా వ్యవహరించినప్పుడు ఆచి తూచి వ్యవహరించారు. బీజేపీకి ఏపీలో ఎంతమేరకు అవకాశం ఉందో ఆయన బాగా స్టడీ చేశారు. 2019 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల అనంతరం ఏపీలో బీజేపీ జీరో బ్యాలెన్స్ అకౌంట్‌గా మారిపోయింది. 

మోడీని నానా మాటలన్న చంద్రబాబుపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని బీజేపీ నేతలు భావించారు. అందులో భాగంగానే టీడీపీ నేతలకు వల వేయడం ప్రారంభించారు. బీజేపీ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా.. పక్కా ప్లాన్ వేశారు. చంద్రబాబు యూరోప్ టూర్లో ఉండగానే తమ ప్లాన్ అమలుచేశారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులను తమ పార్టీలోకి లాగేసుకున్నారు.

చంద్రబాబుకి అత్యంత సన్నిహితులుగా పేరున్న సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్, గరికపాటి మోహనరావు.. వంటి వారికి కమలం కండువా కప్పేశారు. రాజ్యసభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీని అమాంతం బీజేపీలో కలిపేసుకుని.. రాజ్యాంగపరమయిన ప్రక్రియలను చకచకా కానిచ్చేశారు. 

ఈ పరిణామాలను పరిశీలిస్తే.. అమిత్ షా కంటే బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ‘నాలుగు ఆకులు’ ఎక్కువే చదివారని తెలుస్తోంది. నడ్డా దూకుడు చంద్రబాబుకి అనుకూలమయిన టీడీపీ నేతలను భయపెడుతోంది. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్స్ లో నొక్కి వొక్కాణించినా.. టీడీపీ తమ్ముళ్ళ ముందు ఉన్నది మాత్రం ఐదేళ్ళ తమ భవిష్యత్తు. అందుకే తమకు అందుబాటులో ఉన్న అవకాశాలను వారు వినియోగించుకుంటున్నారు. రాజకీయాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినప్పుడు తలుపులు తెరిచి ఉంచుకోవాలని వారికి అర్థమవుతోంది. 

‘మీ భవిష్యత్తు-నా బాధ్యత’ అంటూ చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన నినాదం ఎంతో ప్రాచుర్యం పొందింది. టీడీపీకి భవిష్యత్తు లేనేలేదని తాజా పరిణామాలతో తేలిపోయింది. బీజేపీ నేతలు ఎప్పుడు తమ నేతలను లాక్కుపోతారోనని ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా లిస్టులో 14మంది ఎమ్మెల్యేలు ఉన్నారని స్వయాన బీజేపీ నేతలే ప్రకటించడం టీడీపీ నేతల్లో బీపీనీ పెంచుతోంది. ఎలాగైనా టీడీపీ ఆర్థిక మూలాలను దెబ్బతీసే పనిలో బీజేపీ బాస్ జేపీ నడ్డా నిమగ్నమయి ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులు తమవంతు సాయం చేస్తున్నారు. 

బీజేపీకి నడ్డా బాస్ గా రాబోతున్నారని, ఆయన సారథ్యంలో బీజేపీ రథం పరుగులు పెడుతుందని ‘న్యూస్ స్టింగ్’ ముందే చెప్పింది. జేపీ నడ్డా సారథిగా బీజేపీ రథం పరుగులు పెడుతుందా? జేపీ నడ్డా ఇటు మోడీకి-అమిత్ షాకు మంచి సంబంధాలున్నాయి. గత మోదీ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడైన నడ్డా బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

బీహార్ కు చెందిన జగత్ ప్రకాష్ నడ్డా పార్టీలో మంచి వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. లా వేగంగా వ్యూహాలు రచిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. తాజా పరిణామాలతో నడ్డా దూకుడు అర్థమవుతోంది. దక్షిణభారతంలో పెద్దగా ఎగరని, బీజేపీ జెండాను ఆయన ఎగరేయబోతున్నారో చూడాలి.

ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ఇప్పుడే వ్యూహం మొదలెట్టేశారు. సంస్థాగతంగా బలంగా లేని బీజేపీని ఫిరాయింపులు, వలస నేతల సహకారంతో బలోపేతం చేసుకోబోతున్నారని అర్థమవుతోంది. ఏపీలో ఇంకెన్ని రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle