బీజేపీతో కలిసే వున్నా.. జగన్ నాకు దండం పెట్టాలి!
04-12-201904-12-2019 15:59:59 IST
Updated On 04-12-2019 17:44:10 ISTUpdated On 04-12-20192019-12-04T10:29:59.073Z04-12-2019 2019-12-04T10:23:33.391Z - 2019-12-04T12:14:10.819Z - 04-12-2019

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో బీజేపీతో తన అనుబంధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ కి దూరంగా లేనని....ప్రత్యేక హోదా అంశంలోనే బీజేపీతో 2019 ఎన్నికల్లో విభేధించాననన్నారు. హోంమంత్రి అమిత్ షా అంటే తనకు గౌరవమని....కానీ వైసీపీ నేతలకు ఆయనంటే భయమన్నారు. తిరుపతిలో మీడియా తో మాట్లాడిన పవన్ 2019 లో బీజేపీ తో కలిసి పోటీ చేస్తే పరిస్థితి వేరేగా ఉండేదన్నారు. ప్రస్తుతం పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర సంచలనం గా మారాయి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ తాజా రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ సీఎం కావడానికే తానే కారణమన్నారు, 2019 ఎన్నికల్లో చంద్రబాబు, బీజేపీతో తాను మళ్ళీ కలిసి పోటీచేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చేదే కాదన్నారు. వైసీపీ నేతలు తనకు దండం పెట్టాలని కామెంట్లు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో కలవడం ఇష్టంలేక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశామన్నారు. ఇప్పటికీ తాను బీజేపీతో కలిసే ఉన్నానని పవన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించడంతోనే ప్రభుత్వం సమయం వృధా చేస్తోందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. మాజీ సీఎం ఇల్లు కూల్చివేతపై ఉన్న శ్రద్ధ సమస్యలపై వుందా అని పవన్ ప్రశ్నించారు. దేశ ప్రయోజనాలు, ప్రజల కోసం బీజేపీ నిర్ణయాలు తీసుకుంటోందని ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించడం విశేషం. ఆరునెలల జగన్ పాలనపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కియా కంపెనీ సీఈవోను వైసీపీ ఎంపీ బెదిరించారని పవన్ గుర్తుచేశారు. వైసీపీ నేతల వల్లే రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదన్నారు. 75శాతం స్థానికులకే ఉద్యోగాలు అంటే ఏ పరిశ్రమలు పెడతారు.. పారిశ్రామికవేత్తలు ఎలా ముందుకొస్తారు? అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.తన ప్రతి మాటన వక్రీకరిస్తున్నారని పవన్ వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబుపై ఆనం వ్యాఖ్యకు పడిపడి నవ్విన జగన్.. విభేదాలు తొలగినట్లేనా?
13 minutes ago

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్.. విప్ జారీ
2 hours ago

ఓడిపోయాం. ఒప్పుకుంటున్నాం.. కర్నాటక్ బైపోల్స్పై శివకుమార్
2 hours ago

20 మంది ఎమ్యెల్యేలను ఎదుర్కొనడానికి 150 మందికి శిక్షణా?
2 hours ago

పవన్లో అసహనం పెరుగుతోందా?
3 hours ago

ఉల్లి కష్టాలపై పవన్ సూటి ప్రశ్న
4 hours ago

రహస్య జీవోలు.. జగన్ పారదర్శకత చేతల్లో చూపించరే?
4 hours ago

విషాదం.. ఎస్కేయూ వైస్ ఛాన్సలర్ జయరాజ్ హఠాన్మరణం
5 hours ago

అధికారుల గొడవలు.. నివురుగప్పిన నిప్పులా ఏపీ సచివాలయం
6 hours ago

‘‘అంతా శరద్ పవారే చేశారు’’
8 hours ago
ఇంకా