newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

బీజేపీకి అండగా వైసీపీ.. ఎలాంటి మొహమాటల్లేవు!

21-09-202021-09-2020 15:35:54 IST
Updated On 21-09-2020 15:44:45 ISTUpdated On 21-09-20202020-09-21T10:05:54.713Z21-09-2020 2020-09-21T10:05:52.572Z - 2020-09-21T10:14:45.297Z - 21-09-2020

బీజేపీకి అండగా వైసీపీ.. ఎలాంటి మొహమాటల్లేవు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఏపీలో అధికార పార్టీ అయిన వైసీపీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుంది. దక్షణాది నుండి ఉత్తరాది వరకు, చివరికి ఎన్డీఏలోని పార్టీలు సైతం వ్యతిరేకించినా వైసీపీ మాత్రం కేంద్రం ఏం చెప్తే అది.. అందుకు తలఊపి ప్రత్యక్షంగా కేంద్రానికి జైకొడుతున్నారు. పైగా కేంద్ర బిల్లులకు వ్యతిరేకంగా మాట్లాడిన మిగతా పార్టీలను సైతం బీజేపీ తరపున వైసీపీ నేతలు వకాల్తా పుచ్చుకొని విమర్శలకు దిగడం మరో విశేషం. ప్రసుత్తం దేశవ్యాప్తంగా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై రగడ, వివాదాల గురించి తెలిసిందే. 

కేంద్ర వ్యవసాయ బిల్లులకు అకాలీదళ్ లాంటి మిత్రపక్షాలు వ్యతిరేకించినా.. నిన్నటి వరకు అన్ని బిల్లులను సమర్ధించిన టీఆర్ఎస్ పార్టీ సైతం వ్యవసాయ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించినా వైసీపీ మాత్రం ఎలాంటి షరతులు లేని మద్దతు ప్రకటించింది. వైసీపీకి రాజ్యసభలో ఆరుగురు సభ్యులు ఉండగా ఆరుగురు ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. ఈ బిల్లులపై జరిగిన స్వల్ప చర్చలో కూడా వైసీపీ ముఖ్యనేత విజయసాయి రెడ్డి ఈ బిల్లుల వల్ల రైతులు ఎదుర్కొంటున్న మద్దతు ధర, గిట్టుబాటు ధర సమస్య పరిష్కారం అవుతుందని కూడా ప్రకటించారు. 

ఎన్డీఏలోని పలు పార్టీలతో సహా చాలా పార్టీలకు ఈ బిల్లులతో దేశంలో వ్యవసాయరంగం ప్రైవేట్ పరం అవుతుందని వ్యతిరేకిస్తుంటే ఒక్క వైసీపీకి మాత్రం రైతులకు మేలు జరుగుతుందని ప్రకటించడంతో విస్తుపోవడం రాజకీయ వర్గాల వంతైంది. ఇప్పటికే ఏపీలో ఆ బిల్లులకు అనుగుణంగా కార్యాచరణ కూడా మొదలైంది. ఇప్పటికే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించేందుకు కూడా సిద్దమైన వైసీపీ ప్రభుత్వం వెనకా ముందు లేకుండా కేంద్రం తెచ్చిన చట్టాలను అమలు చేయడం గ్యారంటీ.

కాగా, గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి పలు మార్లు ఓ మాట చెప్పేవారు. కేంద్రంలో మన అవసరం వస్తే ప్రత్యేక హోదా బిల్లుపై సంతకం పెట్టు మీ బిల్లుపై సంతకం పెడతామని కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పేవారు. నిజానికి ఇప్పుడు రాజ్యసభలో వైసీపీ అవసరం కేంద్రానికి ఉంది. అయినా వైసీపీ ఎలాంటి షరతులు లేకుండానే మద్దతు ఇచ్చేసింది. ఇంకా ప్రత్యేక హోదా ఊసే ఎత్తని ఆ పార్టీ దేశంలో పార్టీలన్నీ వ్యతిరేకించినా తాము మాత్రం కేంద్రానికి జై కొట్టడంలో ఎలాంటి మొహమాటాలు పెట్టుకోవడం లేదని వ్యవసాయ బిల్లులతో స్ఫష్టంగా చెప్పేసింది. అయితే, అసలు ఇంతకీ అంత మొహమాటం లేకుండా మద్దతు ఇచ్చేంతగా కేంద్రానికి సీఎం జగన్ ఎందుకు భయపడుతున్నారన్నది ఇప్పుడు మరోసారి తెరమీదకి వచ్చిన చర్చ!


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle