newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

బీఎస్పీతో జేఎస్పీ పొత్తు.. మాయ చేస్తారా?

15-03-201915-03-2019 17:00:49 IST
Updated On 16-03-2019 15:27:22 ISTUpdated On 16-03-20192019-03-15T11:30:49.593Z15-03-2019 2019-03-15T11:28:01.224Z - 2019-03-16T09:57:22.872Z - 16-03-2019

బీఎస్పీతో జేఎస్పీ పొత్తు.. మాయ చేస్తారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ, తెలంగాణల్లో సరికొత్త పొత్తుల పొడుపు పొడిచింది. ఆంధప్రదేశ్‌, తెలంగాణలో జనసేన పార్టీతో కలిసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించడంతో కొత్త సమీకరణలు తెరమీదకు వచ్చాయి.  జనసేన అధినేత పవన్ కల్యాణతో కలిసి లక్నోలో ఆమె మీడియాతో మాట్లాడారు. శుక్రవారం పవన్ కళ్యాణ్ లక్నో వెళ్లి బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలిశారు. అనంతరం ఈనేతలు ఇద్దరు పొత్తుల గురించి మాట్లాడారు. 

గత ఏడాది లక్నోలో పర్యటించిన జనసేన ప్రతినిధి బృందం

Image result for janasena leaders lucknow

‘‘ఆంధప్రదేశ్‌లో లోక్‌సభతో పాటు శాసనసభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. అక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కొత్తవారు అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. జనసేన, బీఎస్పీ, కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తాం’’ అని మాయావతి ప్రకటించారు. 

ఏప్రిల్ 3,4 తేదీలలో ఏపీ, తెలంగాణలో పర్యటిస్తానని మాయావతి తెలిపారు. మరోవైపు మాయావతితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. ఆమె ప్రధానమంత్రి అయితే అది తమ అదృష్టంగా భావిస్తామని తెలిపారు. ఏపీలో బీఎస్పీతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు. అసెంబ్లీ తరహాలో కాకుండా తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు కలిసి పోటీకి దిగుతామని స్పష్టం చేశారు.

అంబేద్కర్ ఆశయాలను పాటిస్తూ ముందుకు వెళుతామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలంగాణ ఎన్నికల టైంలో గత ఏడాది నవంబర్ నెలలో లక్నోలో డాక్టర్ అంబేద్కర్ మెమోరియల్ పార్క్‌ను సందర్శించిన పవన్ టీం రాజకీయాలపై బీఎస్పీ నేతలతో మేధో మథనం చేశారు. అప్పుడే పొత్తు ఉంటుందని భావించారు. కానీ అప్పుడు పొత్తు పొడవలేదు. ఇప్పుడు బీఎస్పీతో జేఎస్పీ పొత్తు పెట్టుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో కలిసి నడిచేది లేదని ఇటీవలే ప్రకటించిన బీఎస్పీ ఆయా రాష్ట్రాల్లో తమతో కలిసి వచ్చే పార్టీలకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. అందులో భాగంగా ఏపీలో జనసేనకు వెల్ కం చెప్పింది. బీఎస్పీ పొత్తుతో పవన్ ఏం మాయచేస్తారో చూడాలి. 

మరోవైపు ఈ పొత్తుపై నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఇది కేవలం పొలిటికల్ స్టంట్ అని విమర్శించారు. అసలు ఏపీలో వారు చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్తున్నారా, లేక ఒంటరిగా వెళ్తున్నారా ముందు చెప్పాలన్నారు. దీనిపై స్పష్టత కావాలన్నారు.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle