newssting
BITING NEWS :
*శాసన మండలిలో మళ్ళీ గందరగోళం...కొనసాగుతోన్న మూడు రాజధానుల రగడ..రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌..అభ్యంతరం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు *మండలి ఛైర్మన్ ఛైర్ వద్దకు వెళ్లిన పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలు..వాయిదా పడ్డాక మండలి ఛైర్మనుతో మంత్రుల భేటీ*ఐదోసారి శాసన మండలి వాయిదా..మండలి వద్ద భారీగా మార్షల్స్ మొహరింపు..మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన బుద్దా వెంకన్న*ఎంపీ గల్లా జయదేవ్ కి బెయిల్ మంజూరు..బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి సెషన్స్ కోర్టు..గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన ఎంపీ, పోలీసుల తీరు సరిగా లేదన్న గల్లా *ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోంది.. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను-పవన్ కల్యాణ్‌*నాకు రాజకీయాలను ఆపాదించవద్దు... నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను-మండలి ఛైర్మన్ షరీఫ్*నిర్ణయాన్ని మార్చుకున్న వైసీపీ సర్కార్... విజయవాడలోనే రిపబ్లిక్ డే*అమరావతి: ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం.. చర్చకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు... జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ *వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం

బిగ్ బ్రేకింగ్.. వైఎస్ వివేకా మాదిరే జ‌గ‌న్ హ‌త్యకూ కుట్ర?!

11-10-201911-10-2019 12:19:58 IST
2019-10-11T06:49:58.997Z11-10-2019 2019-10-11T06:49:47.383Z - - 21-01-2020

బిగ్ బ్రేకింగ్.. వైఎస్ వివేకా మాదిరే జ‌గ‌న్ హ‌త్యకూ కుట్ర?!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య మాదిరే ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి హ‌త్య‌కూ కుట్ర ప‌న్నార‌ట‌. ఈ విషయాన్ని స్వ‌యాన సీఎం జ‌గ‌న్ లాయ‌ర్ పొన్న‌వోలు సుధాకర్‌రెడ్డి వెల్ల‌డించారు. కాగా, వివేకా హత్య జ‌రిగి ఆరు నెల‌లు గ‌డుస్తున్నా కేసు విచార‌ణ‌ ఒక్క అంగుళం కూడా  ముందుకు జ‌ర‌గ‌డంలేదు. కేసు దర్యాప్తు ఓ అడుగు ముందుకు ప‌డితే నాలుగు అడుగులు వెన‌క్కు వెళుతోంది. విచార‌ణ కోసం ఒక‌రిద్ద‌రు కాదు.. ఏకంగా 60 మంది అధికారులు ప‌నిచేస్తున్నారు. అయినా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క కీల‌క ఆధారం కూడా ల‌భ్యం కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

కేసు ద‌ర్యాప్తులో భాగంగా అనుమానం వ‌చ్చిన ప్ర‌తి వ్య‌క్తిని పోలీసులు విచారిస్తున్న‌ప్ప‌టికీ హంత‌కులు ఎవ‌ర‌న్న‌ది క‌నిపెట్టలేక‌పోతున్నారు. మ‌రోవైపు విచార‌ణ పేరుతో గ్రామంలో అనుమానం క‌లిగిన వారంద‌ర్నీ పోలీసులు వేధింపుల‌కు గురి చేస్తున్నార‌న్న ఆరోప‌ణ బ‌హిరంగంగానే వినిపిస్తోంది. ఆ వేధింపులు తాళ‌లేకనే ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న శ్రీ‌నివాసులురెడ్డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడంటూ ఆయ‌న కుటుంబ సభ్యులు చెబుతున్న మాట‌.

పోలీసులు విచార‌ణ పేరుతో వేధింపుల‌కు గురిచేస్తున్నార‌ని సూసైడ్ నోట్ రాసి మ‌రీ శ్రీ‌నివాసులురెడ్డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడని ఆయ‌న త‌రుపు బంధువులు మీడియా ముందు గ‌తంలో చెప్పుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే మృతుడు శ్రీ‌నివాసులురెడ్డి ఆత్మ‌హ‌త్య లేఖ‌తోపాటు హ‌త్య‌కూ, త‌న‌కు ఎటువంటి సంబంధం లేద‌ని సీఎం జ‌గ‌న్‌, వైఎస్ భాస్క‌ర్‌రెడ్డిల‌కు కూడా లేఖ‌లు రాశాడు.

ఈ నేప‌థ్యంలో పొన్న‌వోలు సుధాక‌ర్ ఇటీవ‌ల ఓ సోష‌ల్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వైఎస్ వివేకా హ‌త్య‌పై చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారి తీశాయి. వైఎస్ జ‌గ‌న్ నాయ‌క‌త్వం ఏపీకి కావాల‌ని దేవుడు నిర్ణ‌యించాడు కాబ‌ట్టి ఆయ‌న ఇంకా బ‌తికి ఉన్నారు. జ‌గ‌న్ ఈ రోజు మ‌న ముందు బ‌తికి తిరుగుతున్నాడంటే అందంతా దైవ నిర్ణ‌యమే. దేశానికి, రాష్ట్రానికి ఆయ‌న నాయ‌క‌త్వం అవ‌స‌రం. ముఖ్యంగా బ‌డ‌గు బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు, తాడిత పీడిత ప్ర‌జానీకానికి సీఎం జ‌గ‌న్ అవ‌స‌రమ‌ని పొన్న‌వోలు సుధాక‌ర్ అన్నారు.

వైఎస్ జ‌గ‌న్ ఆ రోజు హ‌త్య గావింప ప‌డ‌కుండా బ‌తికించిన‌టువంటి వైనం భ‌గ‌వంతుడు రాసిన స్క్రిప్టే.

జ‌గ‌న్‌ని అంతం చేయాల‌ని ఎన్నిక‌ల‌కు ముందే ప్ర‌య‌త్నించారు. ఎన్నిక‌ల చివ‌ర్లోనూ ప్ర‌య‌త్నం చేశారు. హ‌త్య కుద‌ర‌క‌పోవ‌డంతో వైఎస్ వివేకాను హ‌త్య‌చేసి అందుకు సీఎం జగ‌న్‌ను బ‌ద‌నాం చేయాల‌ని చూశార‌ని పొన్న‌వోలు సుధాక‌ర్ తెలిపారు.

వివేకా నుదుట‌పై రెండు గొడ్డ‌లి గాయాలు, త‌ల వెనుక భాగాన‌ దెబ్బ త‌గిలిన‌ట్టు శ‌వ‌ పంచ‌నామా రిపోర్టులో స్ప‌ష్టంగా రాసి ఉన్నాయ‌ని, కానీ చంద్ర‌బాబు మాత్రం నాడు పోస్టుమార్టం రిపోర్టు వ‌చ్చే వ‌ర‌కు గాయాలు దాచి పెట్టారంటూ విమ‌ర్శించ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని పొన్న‌వోలు సుధాక‌ర్ ప్ర‌శ్నించారు. సామాన్య ప్ర‌జ‌ల‌కు వివేకా హ‌త్య‌పై అందిన ఫిర్యాదు, న‌మోదైన ఎఫ్ఐఆర్, ఇన్విస్టిగేష‌న్ రిపోర్ట్స్ గురించి తెలీదు క‌దా..!

ఆ క్ర‌మంలో నాడు సీఎంగా ఉన్న చంద్ర‌బాబు వివేకా హ‌త్య‌ను జ‌గ‌న్ కుటుంబంపై నెట్టి ప్ర‌జ‌లను తప్పుదోవ ప‌ట్టించాల‌ని చూశారు. అలా చంద్ర‌బాబు వివేకా హ‌త్య‌ను త‌న‌కు అనుకూలంగా వాడుకోవాల‌ని తీవ్ర ప్ర‌య‌త్నం చేశార‌ని పొన్న‌వోలు సుధాక‌ర్ చెప్పుకొచ్చారు.

ఇలా వివేకా హ‌త్య కేసు పొన్న‌వోలు సుధాక‌ర్ ఇంట‌ర్వ్యూతో మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఏదేమైనా, వివేకా హ‌త్య‌కేసు ద‌ర్యాప్తుపై అంద‌రిలోను అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. వివేకా హ‌త్య కేసులో నిజంగానే హంత‌కులు ప‌ట్టుబ‌డ్డారా..?  లేక కేసును నీరుగార్చే క్ర‌మంలో పోలీసులే ఏదైనా ప్లాన్ చేశారా..? ఒక‌వేళ నిజంగా హంత‌కులు దొరికి ఉంటే వారు ఎవ‌రై ఉంటారు..?  నిజ‌మైన హంత‌కులను ప‌ట్టుకునేందుకు పోలీసులు ఇన్ని రోజులు ఆగారా..?  ఈ క్ర‌మంలోనే శ్రీ‌నివాసులురెడ్డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు తెలియాల్సి ఉంది. 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle