newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

బిగ్ బ్రేకింగ్: పవన్ కళ్యాణ్ పై కేసు?

01-01-202001-01-2020 14:05:04 IST
Updated On 01-01-2020 14:08:35 ISTUpdated On 01-01-20202020-01-01T08:35:04.390Z01-01-2020 2020-01-01T08:35:02.687Z - 2020-01-01T08:38:35.068Z - 01-01-2020

బిగ్ బ్రేకింగ్: పవన్ కళ్యాణ్ పై కేసు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమరావతి రాజధాని అంశం రచ్చరేపుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించిన సంగతి తెలిసిందే. తుళ్లూరు పోలీసులు పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేయడానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.

రాజధాని పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, సెక్షన్ 144, 30 యాక్ట్‌ని బ్రేక్‌ చేసినందుకు పవన్‌‌‌పై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. అమరావతిలో పర్యటన సందర్భంగా మందడానికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అక్కడికి ఆయన్ని అనుమతించలేదు పోలీసులు. దీంతో ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించారు. 

Image may contain: 11 people, people standing and outdoor

మందడం వెళ్లడానికి అంగీకరించని పోలీసులు తుళ్లూరు వెళ్లాలని పవన్‌కు సూచించారు. అయితే పవన్ కారు దిగి మందడానికి నడుచుకుంటూ వెళ్ళడంతో పోలీసులు అభ్యంతరం తెలిపారు. పవన్‌ను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. సీఎం కాన్వాయ్ వెళ్తున్నందున పావు గంట పాదయాత్ర ఆపాలని పవన్‌ను కోరారు. దీంతో వెంకటాయపాలెం వద్ద రోడ్డుపై నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. 

మరోసారి మందడం శివార్లలో పవన్‌ను పోలీసులు అడ్డుకోవడంతో.. జనసేన నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసుల ఆంక్షలను పట్టించుకోకపోవడంతో తుళ్ళురు పోలీసులు పవన్ పై కేసు పెట్టనున్నారు. 

అయితే. పవన్ కల్యాణ్‌పై ఎటువంటి కేసు నమోదు చేయలేదని, పర్యటన సమయంలో ఎవరైనా ఇబ్బంది కలిగించారని ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తాం అని వివరణ ఇచ్చారు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి. 

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle