newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

బాల‌య్య నియోజ‌క‌వ‌ర్గంలో పేరుకుపోయిన స‌మ‌స్య‌లు..!

29-10-201929-10-2019 11:04:10 IST
Updated On 29-10-2019 15:44:22 ISTUpdated On 29-10-20192019-10-29T05:34:10.761Z29-10-2019 2019-10-29T05:34:08.013Z - 2019-10-29T10:14:22.846Z - 29-10-2019

బాల‌య్య నియోజ‌క‌వ‌ర్గంలో పేరుకుపోయిన స‌మ‌స్య‌లు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హిందూపురం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు బాల‌య్యా.. నువ్వు ఎక్క‌డ‌య్యా..?  అని అడుగుతున్నారు. అస‌లు త‌మ ఎమ్మెల్యే ఆచూకీనే క‌న‌ప‌డ‌టంలేదంటూ గ‌గ్గోలు పెడుతున్నారు. కాగా, ఈ ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏపీ మొత్తంవైసీపీ గాలి బ‌లంగా వీచిన స‌మ‌యంలోనూ టీడీపీ అభ్య‌ర్ధిగా బ‌రిలో నిలిచిన బాల‌య్య‌కు ప‌ట్టం క‌డితే క‌నీసం అటువైపే చూడ్డం లేదని, షూటింగ్‌లే త‌ప్ప నియోజ‌కవ‌ర్గ స‌మ‌స్య‌ల‌ను అస్సలు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ప్ర‌జ‌లు విమ‌ర్శిస్తున్నారు.

నిజానికి టీడీపీ ఆవిర్భావం నుంచి ఎత్తిన జెండా దించ‌కుండా మోస్తున్న‌ది హిందూపురం ప్ర‌జ‌లే. ఆ నాడు ఎన్టీఆర్‌ను రెండుసార్లు గెలిపించారు. అలాగే హ‌రికృష్ణ‌కు ఒక‌సారి, బాల‌య్య‌కు రెండుసార్లు ప‌ట్టం క‌ట్టారు. 2019 ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఫ్యాన్ గాలి వీచినా హిందూపురం ప్ర‌జ‌లు మాత్రం బాల‌య్య‌కే జై కొట్టారు. రాయ‌ల‌సీమ‌లో ముగ్గురు టీడీపీ అభ్య‌ర్ధులు గెలిస్తే అందులో ఒక‌రు బాల‌కృష్ణ‌.

అయినా, 2019 ఎన్నిక‌ల్లో పార్టీ అధికారంలోకి రాక‌పోవ‌డంతో కొంత నిరుత్సాహప‌డ్డా.. బాల‌య్య గెలుపుతో ఆనంద‌ప‌డ్డారు. అయితే అప్పుడెప్పుడో ఎన్నిక‌ల ప్ర‌చారంలో క‌నిపించిన బాల‌కృష్ణ మ‌ళ్లీ నియోజ‌క‌వ‌ర్గంవైపు చూడ‌లేద‌న్న‌ది అక్క‌డి జ‌నం ప్ర‌ధాన ఆరోప‌ణ‌.

ఇప్ప‌టికీ బాల‌య్య తాను న‌టుడిగానే భావిస్తున్నారే త‌ప్ప హిందూపురం ఎమ్మెల్యేన‌న్న విష‌యం మ‌రిచిపోయార‌ని వారు విమ‌ర్శిస్తున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా నియోజ‌క‌వర్గంలో ఒక్క స‌మ‌స్య‌ను కూడా ప‌రిష్క‌రించ‌లేక‌పోయార‌ని ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

బాల‌కృష్ణ 2014లో హిందూపురం నుంచి గెలిచిన త‌రువాత ఐదేళ్ల‌లో మూడు నాలుగు సినిమాలు తీసుకున్నారు త‌ప్పితే ఇక్క‌డి ప్ర‌జ‌ల సంక్షేమాన్ని కానీ.. వారి బాగోగుల‌ను కానీ.. ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

అయినా కూడా మ‌రోసారి గెలిస్తే నేను నియోజ‌క‌వ‌ర్గంలోనే అందుబాటులోనే ఉంటానంటూ  ఆధార్ కార్డుతోపాటు ఎన్నికల కార్డు అడ్ర‌స్‌లు హిందూపురానికి మార్పించుకున్నారు. దీంతో అక్క‌డి జ‌నం మ‌న బాల‌య్యే క‌దా అని మ‌రోసారి ఛాన్స్ ఇచ్చారు. అయితే మ‌ళ్లీ బాల‌య్య హిందూపురం ముఖాన్ని చూడ‌ట‌మే మానేశారు. దీంతో హిందూపురంలో ఎక్క‌డి స‌మ‌స్య‌లు అక్క‌డే పేరుకుపోయాయి. ఏదేమ‌నా బాల‌య్య అటు సినిమాల‌తోపాటు ఇటు త‌నను గెలిపించిన ప్ర‌జ‌ల నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌ల‌పైనా దృష్టి పెడితే బాగుంటుంద‌న్న వాద‌న‌లూ వారి నుంచి విన‌వ‌స్తుండ‌టం గ‌మ‌నార్హం.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle