newssting
BITING NEWS :
*శాసన మండలిలో మళ్ళీ గందరగోళం...కొనసాగుతోన్న మూడు రాజధానుల రగడ..రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌..అభ్యంతరం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు *మండలి ఛైర్మన్ ఛైర్ వద్దకు వెళ్లిన పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలు..వాయిదా పడ్డాక మండలి ఛైర్మనుతో మంత్రుల భేటీ*ఐదోసారి శాసన మండలి వాయిదా..మండలి వద్ద భారీగా మార్షల్స్ మొహరింపు..మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన బుద్దా వెంకన్న*ఎంపీ గల్లా జయదేవ్ కి బెయిల్ మంజూరు..బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి సెషన్స్ కోర్టు..గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన ఎంపీ, పోలీసుల తీరు సరిగా లేదన్న గల్లా *ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోంది.. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను-పవన్ కల్యాణ్‌*నాకు రాజకీయాలను ఆపాదించవద్దు... నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను-మండలి ఛైర్మన్ షరీఫ్*నిర్ణయాన్ని మార్చుకున్న వైసీపీ సర్కార్... విజయవాడలోనే రిపబ్లిక్ డే*అమరావతి: ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం.. చర్చకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు... జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ *వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం

బాల‌య్య అడ్డాలో 'సేవ్ వైసీపీ' నినాదాలు..!

29-11-201929-11-2019 07:25:32 IST
2019-11-29T01:55:32.128Z29-11-2019 2019-11-29T01:55:28.299Z - - 22-01-2020

 బాల‌య్య అడ్డాలో 'సేవ్ వైసీపీ' నినాదాలు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అనంత‌పురం జిల్లా హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విభేదాలు ర‌చ్చ‌కెక్కాయి. పార్టీలోని ఓ వ‌ర్గం సేవ్ వైఎస్సార్సీపీ పేరుతో స‌మావేశం పెట్టుకునే వ‌ర‌కే వ్య‌వ‌హారం వెళ్లింది.

పార్టీలో ముందు నుంచి ప‌ని చేస్తున్న వారికి న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని ఆ పార్టీ శ్రేణులే ఆరోపిస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వ‌చ్చినా తమకు మాత్రం ప్ర‌తిపక్షంలో ఉన్న‌ట్లుగానే ఉందంటున్నారు.

హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌. ఆ పార్టీ ఆవిర్భ‌వించిన నాటి నుంచి వ‌రుస‌గా ఇక్క‌డ గెలుస్తూ వ‌స్తోంది. గ‌త రెండు ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున నంద‌మూరి బాల‌కృష్ణ విజ‌యం సాధించారు.

ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో జిల్లాలో, రాష్ట్రంలో వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భంజ‌నం వీచినా హిందూపురంలో మాత్రం బాల‌కృష్ణ టీడీపీ జెండా ఎగ‌రేశారు. రాయ‌ల‌సీమ‌లోని 52 నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ కేవ‌లం మూడు సీట్లు మాత్ర‌మే గెల‌వ‌గా, అందులో హిందూపురం ఒక‌టి.

ఇంత‌లా తెలుగుదేశం పార్టీకి ప‌ట్టున్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టాలి. కానీ, అందుకు భిన్నంగా ప‌రిస్థితి ఉంది. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ రెండుగా చీలింది.

గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ విశ్రాంత పోలీస్ ఉన్న‌తాధికారి ఇక్బాల్‌కు జ‌గ‌న్ టిక్కెట్ ఇచ్చారు. హిందూపురంలో మైనారిటీ ఓట‌ర్లు ఎక్కువ సంఖ్య‌లో ఉన్నందున జ‌గ‌న్ చివ‌రి క్ష‌ణంలో ఇక్బాల్‌ను రంగంలోకి దింపారు. అంత‌కుముందు వ‌ర‌కూ వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జిగా ఉన్న న‌వీన్ నిశ్చ‌ల్‌ను జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో న‌వీన్ నిశ్చ‌ల్‌కు న్యాయం చేస్తామ‌ని వైసీపీ నేత‌లు హామీ ఇచ్చారు. దీంతో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం చేశారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చాక న‌వీన్ నిశ్చ‌ల్‌కు ఎమ్మెల్సీ లేదా ఇత‌ర ఏదైనా నామినేటెడ్ ప‌ద‌వి వ‌స్తుంద‌ని అంతా భావించారు.

కానీ, అందుకు భిన్నంగా ఓడిపోయినా ఇక్బాల్‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు జ‌గ‌న్‌. మైనారిటీల‌కు ఇచ్చిన హామీ మేర‌కు మొద‌టి విడ‌త‌లోనే ఇక్బాల్‌ను ఎమ్మెల్సీ చేశారు. ఆయ‌న ఎమ్మెల్సీగా ఉంటూనే హిందూపురం వ్య‌వ‌హారాలు చూసుకుంటున్నారు.

ఆయ‌న ముందునుంచి వైసీపీలో ఉన్న నేత‌ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోకుండా త‌న చుట్టూ కోట‌రీగా చేరిన వారికే పెద్ద పీట వేస్తున్నార‌నేది మ‌రో వ‌ర్గం ఆవేద‌న‌.

తాము పార్టీ కోసం ప‌దేళ్లుగా ప్ర‌తిప‌క్షంలో ఉంటూ కాంగ్రెస్‌, టీడీపీ నేత‌ల వేదింపుల‌ను త‌ట్టుకొని, ఆస్తులు అమ్ముకొని ఖ‌ర్చు పెట్టుకుంటే ఇప్పుడు పార్టీ అధికారంలోకి వ‌చ్చాక‌ త‌మ‌కు క‌నీసం గౌర‌వం ద‌క్క‌డం ఆరోపిస్తున్నారు.

ఈ మేర‌కు బుధ‌వారం వైసీపీలోని అసంతృప్త క్యాడ‌ర్ మొత్తం సేవ్ వైసీపీ పేరుతో స‌మావేశం ఏర్పాటుచేసి మ‌రీ మాట్లాడారు. ఇప్ప‌టికైనా పార్టీ పెద్ద‌లు జోక్యం చేసుకొని పార్టీ కోసం ప‌నిచేసిన వారిని గుర్తించాల‌ని డిమాండ్ చేశారు.

ఈ స‌మావేశంలో పాల్గొన్న వారిలో మాజీ ఇంఛార్ఙి న‌వీన్ నిశ్చ‌ల్ అనుచ‌రులే ఎక్కువ మంది ఉన్నారు. ఆయ‌న నేరుగా ఈ స‌మావేశంలో పాల్గొన‌క‌పోయినా ప్రోత్స‌హించార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ముందు ఇలా పార్టీ రెండు వ‌ర్గాలుగా చీల‌డం వైసీపీకి న‌ష్టం, టీడీపీకి లాభం చేసేలా ఉంది. ప‌రిస్థితి ఇలానే ఉంటే స్థానిక ఎన్నిక‌ల్లోనూ హిందూపురంలో టీడీపీనే ఆధిప‌త్యం చూపించ‌వ‌చ్చు. మొత్తానికి హిందూపురంలో వైసీపీ విభేదాలు బాల‌య్య బాబుకు, టీడీపీకి అయితే మేలే చేస్తున్నాయి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle