newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

బాలయ్య పట్టు.. చిన్నల్లుడికి సీటు

20-03-201920-03-2019 09:09:54 IST
2019-03-20T03:39:54.398Z20-03-2019 2019-03-20T03:38:16.812Z - - 18-07-2019

బాలయ్య పట్టు.. చిన్నల్లుడికి సీటు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ పేరును ఖరారు చేశారు. నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె  తేజస్వి భర్త భరత్...గీతం యూనివర్సిటీ ఎంవీవీఎస్ మూర్తికి మనుమడు. విశాఖ టిక్కెట్‌ను తన చిన్నల్లుడికి ఇప్పించుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబుపై నందమూరి బాలకృష్ణ ఒత్తిడి తీసుకొస్తున్నట్లు రెండ్రోజుల క్రితం ప్రచారం జరిగింది. 

చివరి నిమిషంలో భరత్ పేరు తెరమీదకు వచ్చినా...పార్టీ టిక్కెట్ సాధించడంలో సఫలీకృతమయ్యారు. విశాఖ జిల్లా టీడీపీ నేతలు కూడా శ్రీభరత్ వైపే మొగ్గుచూపారు.  విశాఖ టిక్కెట్‌ను శ్రీభరత్‌కు ఇవ్వాలని వారు పార్టీ అధిష్టానానికి సూచించారు. స్థానిక నేతలు కూడా భరత్ వైపే మొగ్గుచూపడంతో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ విశాఖ టిక్కెట్‌ను శ్రీభరత్ సొంతం చేసుకున్నాడు.

విశాఖలో సోమవారం సమావేశమైన  జిల్లా టిడిపి నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, విశాఖ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలన్న అంశంపై చర్చించారు. ఈ సమావేశంలో మెజార్టీ నేతలు శ్రీభరత్ వైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.  ఈ సమావేశం అనంతరం గంటా మీడియాతో మాట్లాడుతూ..విశాఖ లోక్‌సభ స్థానానికి శ్రీభరత్‌ ఆసక్తిగా ఉన్న అంశాన్ని సియంకు తెలిపామన్నారు. జిల్లా నేతలు కూడా భరత్ వైపే మొగ్గుచూపడంతో టీడీపీ ప్రకటించిన 25 మంది లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో భరత్ చోటు దక్కించుకున్నారు.

గతంలో రెండు సార్లు విశాఖ లోక్‌సభ నియోజకవర్గానికి భరత్ తాతయ్య ఎంవీవీఎస్ మూర్తి ప్రాతినిథ్యం వహించారు. గీతం సంస్థల వ్యవస్థాపకులుగా ఈ కుటుంబం సుపరిచితమే. అందుకే ఆ కుటుంబానికి చెందిన వ్యక్తైతే పోటీ గట్టిగా ఉంటుందని భావిస్తున్నారు. 

విశాఖ లోక్‌సభ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సినీ నిర్మాత-రియల్టర్ ఎంవీవీ సత్యనారాయణతో శ్రీభరత్ తలపడనున్నారు. 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ మద్దతుతో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి కంభంపాటి హరిబాబు...వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను ఓడించారు. ఈ ఎన్నికల్లోనూ విశాఖలో పసుపు జెండా ఎగురవేస్తామని టీడీపీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. 

మరోవైపు జనసేన పార్టీ విశాఖ లోక్ సభ అభ్యర్ధిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేరును ఖరారుచేసింది. అక్కడ వైసీపీ ఎంవీవీ చౌదరిని అభ్యర్ధిగా ప్రకటించింది. దీంతో విశాఖ తీరంలో టీడీపీ జెండా ఎగురేయడం అంత వీజీ కాదంటున్నారు. 

శ్రీభరత్ తరఫున తోడల్లుడు లోకేష్, మామ బాలయ్యబాబు, సీఎం చంద్రబాబు భారీ ఎత్తున ప్రచారం చేయనున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే చంద్రబాబు, బాలయ్య కుటుంబాల్లో నాలుగు పదవులు గ్యారంటీగా వుంటాయి. చంద్రబాబు సీఎం అయితే బాలయ్య ఎమ్మెల్యే, ఆయన పెద్దల్లుడు లోకేష్ ఎమ్మెల్యే, చిన్నల్లుడు శ్రీభరత్ ఎంపీ అవుతారు. దీనిపై ఎలాంటి విమర్శలు వస్తాయో చూడాలి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle