newssting
BITING NEWS :
*విజయవాడలో ప్రజావేదిక కూల్చివేత *అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతాం: సీఎం జగన్ *పార్టీ మారడం ఖాయం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి *పార్టీ అంటే కుల సంఘం కాదని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి: పవన్ కళ్యాణ్ *హోదా బాధ్యత జగన్‌దే: ఎంపీ గల్లా జయదేవ్‌*‘నెహ్రూ-గాంధీ’ కుటుంబంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు *ప్రపంచకప్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా

బాలయ్యా.. ఎన్నికల వేళ ఈ గోల ఏందయ్యా..?

28-03-201928-03-2019 12:25:26 IST
2019-03-28T06:55:26.759Z28-03-2019 2019-03-28T06:55:22.809Z - - 26-06-2019

బాలయ్యా.. ఎన్నికల వేళ ఈ గోల ఏందయ్యా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తీరు కారణంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సరిగ్గా ఇలాగే ఫీలవుతోందట. ఇప్పటికే అనంతపురం జిల్లాలో ఈసారి అంతంతమాత్రంగా ఉంది పార్టీ పరిస్థితి. బాలయ్య బాబు సినీగ్లామర్ వాడి నాలుగు డైలాగులు పేల్చి ఓట్లు రాలుస్తాడని టీడీపీ లెక్కలేసుకుంటోంటే ఆయనేమో నేరుగా వివాదాల నోట్లో నోరు పెట్టేస్తున్నారు. ఇంకేముంది ఎన్నికల్లో ఇప్పటికే లోకేష్ కామెడీ షోని ఎంజాయ్ చేస్తున్న జనం.. బాలయ్య వీరావేశాన్నీ, కళ్లప్పగించి చూస్తున్నారు. 

ఇంతకీ విషయం ఏంటంటే.. బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం ప్రచారంలో ఉన్నప్పుడు ఓ చానెల్ వీడియో జర్నలిస్ట్ పెయిడ్ యాంగిల్లో కాకుండా.. సిసలైన న్యూస్ యాంగిల్లో ఏవో కొన్ని విజువల్స్ తీశారట. అవి బయటికి వస్తే తన పరువు పోతుందని బాలయ్య భావించారు.

అంతే నేరుగా వచ్చి ఆ జర్నలిస్టుపై చెయ్యి చేసుకున్నారు. మాస్ సినిమాలకు దూరంగా ఉండి తండ్రి సినిమాలను క్లాస్‌గా పూర్తి చేసిన బాలయ్యను ఒక్కసారిగా సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సీమసింహం పూనేశారు. ఆ వీడియో డిలీట్ చేస్తావా ఛస్తావా అన్న రీతిలో బెదిరింపులకు దిగాడు. ‘‘రాస్కెల్.. మా బతుకులు మీ చేతుల్లో ఉన్నాయారా.. ప్రాణాలు తీస్తాను. నాకు బాంబులు వేయడం కూడా తెలుసురా... కత్తితిప్పడం కూడా తెలుసు’’ అంటూ మాస్ డైలాగును రియలిస్టిక్ యాక్షన్‌తో కలిపి కొట్టాడు బాలయ్య.

బాలకృష్ణ ఆయన అనుచరులు చుట్టుముట్టేసరికి డిలీట్ చేసినట్లే నటించిన సదరు బ్రిలియంట్ రిపోర్టర్, కెమెరామెన్.. ఆ వీడియో ఫీడ్‌ను క్షణాల్లో తమ ఛానెల్‌కు పంపారు. వాళ్లు డైలాగ్­ టు డైలాగ్ బాలయ్య మాటల్నీ, యాక్షన్­ సీన్లనీ చూపిస్తూ.. ఈ యాక్షన్ హీరోని విలన్‌ని చేసి పడేశారు. ఇక.. సోషల్ మీడియా ఊరుకుంటుందా.. ముందే ఎలక్షన్ సీజన్. అందులోనూ బాలయ్య.. మొన్ననే సారే జహాసె అచ్చా బుల్ బుల్ సితా హమారా అంటూ తన పాండిత్యాన్ని ఆవిష్కరించి.. ఆ ఆటను సోషల్ మీడియాలో వంద రోజులు నడిచేందుకు కృషి చేశారు.

ఇప్పుడు ఈ యాక్షన్ సీన్ అంతకంటే బాగా పండించారని నెటిజన్లు తెగ కామెంట్లు పెట్టి.. వాట్సప్పుల్లో తెగ తిప్పేస్తున్నారు. బాలయ్యా.. మజాకా.. ఆయన తలచుకుంటే రైళ్లూ, విమానాలే కంటి చూపుతో ఆపేయగలరు. సోషల్ మీడియా ఓ లెక్కా. ఎటొచ్చీ.. చంద్రబాబు, టీడీపీ నాయకులే ఈ బాలయ్యను చూసుకోండ్రా.. ముందే సర్వేలన్నీ మనకు ఉక్కపోతా జగన్‌కు ఫ్యాను గాలీ అని చెవిలో జోరీగల్లా చెప్తున్నాయి.. అని రావు రమేష్ డైలాగుల తరహాలో మాట్లాడుతున్నారట.

ముందే ఎండాకాలం.. హిందూపురంలో గతంలోనే మహిళలంతా ఖాళీబిందెలతో రోడ్లపైకి వచ్చి సమస్యలు చెప్పుకున్నా బాలకృష్ణ పూర్తిగా పట్టించుకోలేదని ఆగ్రహంతో ఉన్నారు. లేనిపోని వివాదాల్లో తలదూర్చి అసలుకే ఎసరుతెచ్చుకునేలా బాలయ్య తీరు ఉందని సొంత పార్టీలోనే గుసగుసలాడుతున్నారట.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle