newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

బాలయ్యపై పొలిటికల్ ఎటాక్

08-01-201908-01-2019 11:22:20 IST
Updated On 08-01-2019 12:56:18 ISTUpdated On 08-01-20192019-01-08T05:52:20.311Z08-01-2019 2019-01-08T05:52:18.463Z - 2019-01-08T07:26:18.197Z - 08-01-2019

బాలయ్యపై పొలిటికల్ ఎటాక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
‘బాలయ్య ఎవరో తెలియద’ని తాను తెరమీదకి తీసుకొచ్చిన వివాదం ముదిరి పాకాన పడడంతో... నాగబాబు నేరుగా రంగంలోకి దిగారు. గతంలో బాలయ్య చేసిన విమర్శల్ని ఏకరువు పెడుతూ... వాటికి జవాబుగా ఒక్కో వీడియో విడుదల చేస్తున్నారు. తన ఫ్యామిలీపై ముఖ్యంగా పవన్, చిరంజీవిలను ఉద్దేశిస్తూ బాలయ్య చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఇప్పటికే నాలుగు వీడియోలు బయటపెట్టారు. తాజాగా రాజకీయంగా బాలయ్య చేసిన కామెంట్స్‌పై వరుస పంచ్‌లు పేలుస్తూ మరో వీడియో రిలీజ్ చేశారు.

కొన్నాళ్ళ క్రితం ఓ టివి ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన బాలయ్య... పవన్ స్థాపించిన ‘జనసేన’ పార్టీని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు సంధించారు. ‘‘తండ్రి మతాచార్యుడు, తనయుడు ఆచార్యుడు, తల్లి రామానుజ మతస్థురాలు, అల్లుడు పింజారి, మరదలు మార్వాడి’’ అని ఒక సామెత చెప్తూ... ఈమధ్య తోక, తొండం లేని సంకర పార్టీలు అలగా బలగా జనాన్ని వెంటేసుకొని తిరుగుతున్నాయని బాలయ్య అన్నారు. దీనిపై నాగబాబు స్పందిస్తూ... ‘‘అలగా బలగా జనం ఏంటి..? ఇతర కులాల మీద, జాతుల మీద మీకు గౌరవం లేదా... అంత వెటకారమేంటి మీకు’’ అంటూ నిలదీశారు.

‘‘మీ టిడిపి పార్టీని పవన్ విమర్శించాడు కాబట్టి... మీరూ జనసేన పార్టీని ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశారని మేము అనుకుంటున్నాం! రాజకీయంగా పవన్‌ని ఏమైనా విమర్శించుకోండి... నాకెలాంటి అభ్యంతరమూ లేదు. కానీ జనసేన పార్టీలో తిరిగే వ్యక్తులు... ఎస్సీలు, ఎస్టీలు, కాపు వర్గీయులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, ఇంకా ఇతరత్ర కమ్యూనిటీకి చెందినవారు కలిసి పనిచేస్తున్నారు. మీ టిడిపిలో అయినా, వైఎస్ఆర్‌సిపిలో అయినా ఇవే కమ్యూనిటీలు ఉంటాయి. మీరు విమర్శించాల్సింది పార్టీ పాలసీలనే కానీ, వ్యక్తుల్ని, కమ్యూనిటీల్ని కాదు’’ అని మండిపడ్డారు.

‘‘అసలు మీరు ఎంత అహంకారంతో మాట్లాడుతున్నారో మీకెవరూ చెప్పలేదా? మీరు చేసిన ఆ వ్యాఖ్యల వల్ల ఎంతోమంది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. అన్ని కమ్యూనిటీల వారు బాధపడ్డారు. అయినా మేము అందుకు రియాక్ట్ అవ్వలేదు. రాజకీయాల్లో తలదూర్చడం ఎందుకని ఊరికే ఉన్నాను. కానీ... ఇప్పుడు ‘ఎవరో తెలియదని’ వివాదం ముదరడంతో చెప్పాల్సి వస్తోంది’’ అంటూ నాగబాబు వీడియో ముగించారు.


Syed Abdul Khadar Jilani


సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ- కంటెంట్ రైటర్‌. జర్నలిజంలో ఐదేళ్ళ అనుభవం. ప్రముఖ మీడియా సంస్థ టీవీ9, తొలివెలుగు, ఇతర డిజిటల్ మీడియా సంస్థల్లో పనిచేశారు. సినిమా కథనాలు, రివ్యూలు, రాజకీయాలు, టెక్నాలజీ, లైఫ్ స్టయిల్ వంటి అంశాలపై మంచి అవగాహన. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్.ఇన్‌లో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
 syedabdul@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle