newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

బాలయ్యకు హిందూపురమే

08-03-201908-03-2019 07:48:52 IST
Updated On 08-03-2019 19:20:11 ISTUpdated On 08-03-20192019-03-08T02:18:52.716Z08-03-2019 2019-03-08T02:15:39.377Z - 2019-03-08T13:50:11.132Z - 08-03-2019

బాలయ్యకు హిందూపురమే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మొన్నటి దాకా బాలకృష్ణ ఎన్నికల బరిలో ఉంటారా, ఉంటే ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న దానిపై టీడీపీలో తీవ్రంగా చర్చ జరిగింది. ఆయన్ని ఎంఎల్సీ చేస్తారని ఓసారి, రాజ్యసభకు పంపుతారని మరోసారి వార్తలు వచ్చాయి. అయితే అనంతపురం జిల్లా సమీక్ష జరిపిన టీడీపీ అధినేత చంద్రబాబు... బాలయ్యను మరోసారి హిందూపూర్ నుంచి బరిలో దింపుతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. స్థానికంగా బాలయ్య మీద వ్యక్తం అవుతున్న నిరసనలను చంద్రబాబు కొట్టిపారేసినట్లు తెలుస్తోంది.

ఇక అనంతపురం జిల్లాలో ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలో కూడా చంద్రబాబు ఆదేశించారు. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్న జేసీ బ్రదర్స్... ఈసారి తమ కుమారులను బరిలో దింపుతున్నారు. అనంతపురం లోక్ సభ సీటు నుంచి జే.సీ. దివాకర్ రెడ్డి కుమారుడు పవన్, తాడిపత్రి అసెంబ్లీ సీటు నుంచి జే.సీ. ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డిలు పోటీ పడుతున్నారు. అయితే అనంతపురం లోక్ సభ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు స్థానాల్లో అభ్యర్థులను మారిస్తేనే తాను పోటీ చేస్తానన్న పవన్ రెడ్డి డిమాండును చంద్రబాబు తోసి పుచ్చారట.

ఇక అనంతపురం అర్బన్ నుంచి ప్రభాకర్ చౌదరికి, శింగనమల నుంచి యామినీ బాలకు మళ్లీ టిక్కెట్ ఇచ్చారు చంద్రబాబు. అయితే కదిరి నుంచి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన చాంద్ భాషాకు టిక్కెట్ ఇవ్వాలా, వద్దా అన్నది ఇంకా చంద్రబాబు తేల్చలేదని తెలుస్తోంది. అలాగే కల్యాణదుర్గం, పుట్టపర్తి నియోజకవర్గాలపై కూడా చంద్రబాబు క్లారిటీకి రాలేదట. ఇక ఈసారి కూడా పరిటాల రవీంద్ర కుమారుడు పరిటాల శ్రీరాంకు టిక్కెట్ ఇవ్వడం లేదు చంద్రబాబు. ఈ ఎన్నికలు కీలకం కావడంతో వారసులకు అవకాశం లేదన్నారు చంద్రబాబు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle