newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

బాబోయ్ నవ్వలేక ఛస్తున్నాం పాల్

03-04-201903-04-2019 13:33:49 IST
Updated On 03-04-2019 13:52:24 ISTUpdated On 03-04-20192019-04-03T08:03:49.096Z03-04-2019 2019-04-03T08:03:47.157Z - 2019-04-03T08:22:24.095Z - 03-04-2019

బాబోయ్ నవ్వలేక ఛస్తున్నాం పాల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఇప్పుడు జబర్ధస్త్‌కి మించిన కామెడీషో నడుస్తోంది. అదే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ ప్రచారం. హాట్ హాట్‌గా జరుగుతున్న ఏపీ ఎన్నికల ప్రచారంలో ఆయన తనదైన కామెడీతో ఓటర్లను కడుపుబ్బ నవ్విస్తున్నారు కేఏ పాల్.

ఎన్నికల బరిలో నిలిచిన దగ్గరి నుంచి పాల్ వినూత్న రీతిలో ముందుకెళ్తున్నారు. మొదట ‘ఏపీకి కాబోయే సీఎం నేనే’ అంటూ అందరి దృష్టిని ఆకర్షించి ముందుకు కదిలారు పాల్. ఇక ఆ తర్వాత ప్రజాశాంతి పార్టీలో టికెట్లు, బీఫారాల దగ్గరి నుంచి.. నర్సాపురంలో ఆయన నామినేషన్ తిరస్కరణ వరకు ప్రతి చోట పాల్ కామెడీ చేస్తూనే ఉన్నారు.

కెఎ పాల్ కామెడీ ఎపిసోడ్‌లో ఎన్నో చిత్రాలు విచిత్రాలు. ఆయన చేయని ఫీట్ లేదు. ఓటర్లకు ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ, వెహికల్ డ్రైవింగ్ చేస్తున్నట్లు యాక్టింగ్ చేస్తూ, బాక్సింగ్ చేస్తున్నట్లు పంచ్‌లు ఇస్తూ.. కామెడీ పంచ్‌లు విసురుతున్నారు పాల్. వినూత్న రీతిలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన నిరంతరం ప్రయత్నిస్తునట్టు కనిపిస్తోంది. మిగిలిన రాజకీయ పార్టీలు మాటలతో దాడులు చేసుకుంటుంటే.. ఆయన మాత్రం ఫన్నీగా అందరినీ నవ్విస్తున్నారు.

ఆయన రోడ్‌షోలు మాత్రం డిఫరెంట్‌గా సాగుతున్నాయి. టీడీపీ, వైసీపీలు ఒకరిపై ఒకరు విమర్శల దాడి చేసుకుంటుంటే.. పాల్ మాత్రం తనకేం పట్టదన్నట్టు తన హావభావాలతో ఏపీ ఎన్నికల రంగస్థలంపై నవ్వుల పువ్వులు పూయిస్తున్నారు. ఆ పార్టీకి ఓట్లు ఎన్ని పడతాయో ఆ సంగతి పక్కన పెడితే ఆయన కామెడీ షోకి మాత్రం మార్కులు మాత్రం బాగానే పడుతున్నాయి. 

Image may contain: 1 person, sittingImage may contain: 2 people


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle