newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

బాబోయ్ ఎండలు.. భరించేదెలా?

06-05-201906-05-2019 12:17:32 IST
Updated On 06-05-2019 12:48:47 ISTUpdated On 06-05-20192019-05-06T06:47:32.949Z06-05-2019 2019-05-06T06:45:45.327Z - 2019-05-06T07:18:47.219Z - 06-05-2019

బాబోయ్ ఎండలు.. భరించేదెలా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. గత నాలుగు రోజులుగా ఎండల తీవ్రత పెరుగుతోంది. ఉదయం 7గంటల కల్లా పనులు పూర్తిచేసుకుంటున్నారు గ్రామీణ వాసులు. అలాగే రాత్రి ఏడుగంటల వరకూ ఎండల తీవ్రత తగ్గడం లేదు. ఏపీలో ఏడు జిల్లాల్లో వడగాడ్పులు బాగా వీస్తున్నాయి. 210 మండ‌ల్లాల్లో వ‌డ‌గాల్పుల ప్రమాదం అధికంగా ఉందని, చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ నెల 10వ తేదీ వ‌ర‌కు ఇదే ప‌రిస్థితి కొన‌సాగే అవ‌కాశం ఉంది. 

ఏపీలో నమోదయిన ఉష్ణోగ్రతలు ఎండల తీవ్రతకు అద్దం పడుతున్నాయి. రోడ్లపై కోడిగుడ్డు పగలగొడితే ఆమ్లెట్ తయారవుతోంది. అత్యధికంగా ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో 47డిగ్రీలకు పైనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. కారంచేడ, ఉంగుటూరు, విజయవాడ రూరల్, పెంటపాడు,  టీ నర్సాపురం, పెదపాడు, గుంటూరు, మండపేట, ఏలూరు, రాజమండ్రి.... వంటి చోట్ల 46 డిగ్రీలకు చేరుకుంది. ఈ ఎండల తీవ్రత గతంలో మే నెల చివరన నమోదవుతూ ఉంటుంది. ఈసారి 20 రోజుల ముందే సూరీడు మండిపోతున్నాడు. సోమ, మంగళవారాల్లో 45 నుంచి 47డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందని.. వడగాలులు తీవ్రం అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. 

సమ్మర్ ఎఫెక్ట్:  పూరి గుడిసెలోనూ ఏసీ 

Image may contain: text and outdoor

రాష్ట్రంలో ఎండల తీవ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఉష్ణోగ్రతల పెరుగుదలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఎండలపై ప్రజల్లో అవగాహన పెంచి, ప్రయాణాలు తగ్గించుకోవాలని, అవసరమయితే తప్ప బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు సూచనలు జారీచేశారు. ఎండల తీవ్రత నేపథ్యంలో జనం ఎక్కువగా తిరిగేచోట చ‌లివేంద్రాలు ఏర్పాటు చేయాలి. చ‌లివేంద్రాల్లో తాగునీరు, మ‌జ్జిగ అందించేలా చ‌ర్యలు తీసుకోవాలని సీఎస్ కోరారు. ఆస్పత్రులు, దేవాల‌యాలు, చ‌ర్చి, మ‌సీదులు, రైల్వేస్టేష‌న్లు, బ‌స్ స్టాండ్‌ల‌లో తాగునీటి వ‌స‌తి క‌ల్పించాలి. పశువుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle