newssting
BITING NEWS :
తీవ్ర వివాదాల మధ్యనే పార్లమెంటులో ఆమోదం పొందిన రెండు వ్యవసాయ బిల్లులు. ఆదివారం రాజ్యసభ ఆమోదం పొందిన బిల్లులు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఇవి చట్టరూపం. ఈ బిల్లులు వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయని, రైతులకు ఇవి మరణ శాసనాలని పేర్కొంటూ ప్రతిపక్ష పార్టీల సభ్యులు రాజ్యసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేసినా వెనక్కు తగ్గని కేంద్రం * రాజ్యసభలో కొనసాగుతున్న దుమారం. విపక్షాల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించిన నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌పై అవిశ్వాస తీర్మానం. హరివంశ్‌పై అవిశ్వాస తీర్మానానికి ఆదివారం 12 విపక్ష పార్టీలు నోటీసు. ప్రజాస్వామిక విలువలను, సంప్రదాయాలను హరివంశ్‌ తూట్లుపొడిచారాని కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ విమర్శ * అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరపన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న తమిలనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ ముందస్తు విడుదల కోసం మరోసారి ప్రయత్నాలు. శశికళ విడుదల కోసం అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌ ఢిల్లీకి పయనం. సుప్రీం కోర్టు న్యాయవాదులు, న్యాయనిపుణులతో చర్చలు * ఆరు నెలల తర్వాత సోమవారం ఉదయం సందర్శకుల కోసం తెరుచుకున్న ఆగ్రాలోని అంతర్జాతీయ చారిత్రక పర్యాటక కేంద్రం తాజ్‌మహల్‌. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ బారులు తీరిన సందర్శకులు. సోమవారం 160 మంది పర్యాటకులు ఆన్ లైన్ లో టికెట్లు కొనుగోలు. రెండు షిఫ్తుల్లో రెండు వేలమందికి అనుమతులు * మహారాష్ట్రలోని భీవండి నగరంలో తీవ్ర విషాదం. మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలి పది మంది మృతి, మరో 20 మందికి గాయాలు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నట్లు సమాచారం. పోలీసులు, ఫైర్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముమ్మర సహాయక చర్యలు * నేటి నుండి హైకోర్టులో అమరావతి రైతులు, రైతు పరిరక్షణ సమితి, మాజీ ఎంఎల్‌ఏ శ్రవణ్ కుమార్ తదితరులు వేసిన పిటిషన్‌లపై రోజువారీ విచారణ. నేడు ధర్మాసనం ముందు లిస్ట్ అయిన 93 పిటిషన్‌లు విచారణ. ఆన్‌లైన్ ద్వారా రాజధానికి సంబంధించిన కేసులను విచారించనున్న ధర్మాసనం * నేటి నుండి అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనాల పునరుద్ధరణ. ఆలయ ప్రాంగణంలో దేవస్థానం పరిసర ప్రాంతాల్లో కరోనా కేసుల కారణంగా దర్శనాలు నిలిపివేయగా నేటి నుండి తిరిగి దర్శనాలు ప్రారంభం. సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్‌ వాడుతూ క్యూలైన్‌లో దర్శనం. పిల్లలకు, వృద్ధులకు ఆలయంలోకి నో ఎంట్రీ * భారీ వర్షాలతో పోటెత్తిన కృష్ణా, పెన్నా, తుంగభద్ర నదులకు వరద. పలు గ్రామాలు ముంపునకు గురవడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు. పలు గ్రామాల్లో వరదలలో చిక్కుకున్న 48 మంది రైతులు, వ్యవసాయ కూలీలు, రక్షించిన ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాలు * కేంద్రం జారీ చేసిన కోవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యాశాఖ ఉత్తర్వులు. నేటి నుంచి 50 శాతం మంది టీచర్లు బడులకు హాజరు. సోమవారం నుంచి విద్యార్థులు లేకుండానే కొనసాగనున్న పాఠశాలలు * ఈశాన్య బంగా‌ళా‌ఖాతంలో ఆది‌వారం ఉదయం ఏర్పడిన అల్ప‌పీ‌డనం. సోమ‌వారానికి మ‌రింత బలపడి అను‌బం‌ధంగా 3.1 కి.మీ. నుంచి 7.6 కి.‌మీ. ఎత్తు‌వ‌రకు ఉప‌రి‌తల ఆవ‌ర్తనం. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం.

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

26-05-202026-05-2020 15:46:19 IST
2020-05-26T10:16:19.030Z26-05-2020 2020-05-26T10:16:17.000Z - - 21-09-2020

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారి ప్రజల ఒంట్లో తేమను లాగేస్తున్నాయి. ఇంట్లో నుండి మొహం బయటపెట్టే పరిస్థితి అసలే లేకపోగా.. ఇంట్లో ఉన్నా ఉక్కపోతకు సాయంత్రానికి ఆరోగ్యవంతులు సైతం పీల్చి పిప్పయిపోతున్నారు. ఇక వృద్దులు, పిల్లల బాధ వర్ణనాతీతం. చంటి బిడ్డలైతే తోటకూర కాడల్లా వాలిపోతున్నారు. ఉక్కపోతకు ఒకటే ఏడుపులు.. మధ్యాహ్నం సమయంలో వారిని సముదాయించడం ఆ తల్లుల వల్ల కావడం లేదు.

వారం క్రితం సైక్లోన్ అంఫన్ గాల్లోని తేమను లాగేసుకొని పోవడంతో తెలుగు రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. గత నాలుగు రోజులుగా ఏపీ, తెలంగాణల్లో సాధారణంగా కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవగా ఇటు కూల్ కూల్ అనిపించే భాగ్యనగరంలో కూడా భానుడి భగభగలకు జనం బెంబేలెత్తుతున్నారు. మొత్తంగా గడిచిన వారం రోజుల్లో రెండు రాష్ట్రాలలో ఎండకు తాళలేక 200 మందిపైనే ప్రాణాలు కోల్పోయారని అంచనా.

కాగా సోమవారం రోహిణి కార్తె మొదలవగా ఈ ఉష్ణోగ్రతలకు తోడు వడగాలులు కూడా వీయనున్నారని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలలో దీని ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పినా తెలుగు రాష్ట్రాలలో మరికాస్త పెరిగే అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాలులు అంటే పరిస్థితి దారుణంగా ఉంటుందనే చెప్పుకోవాలి.

మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈనెల 28 వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని ఐఎండి హెచ్చరికలు జారి చేసింది. తెలుగు రాష్ట్రాలలో కొన్ని జిల్లాలలో 48 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. ఇప్పటికే తెలంగాణలోని కొన్ని జిల్లాలలో 46 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవగా వచ్చే మూడు రోజులు భయాందోళనగా మారాయి.

గడిచిన నాలుగు రోజులు ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవగా వచ్చే నాలుగు రోజులు తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని గత వారమే భారత వాతావరణ శాఖ తెలిపింది. కానీ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అధిక ఉష్ణోగ్రతలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. దీంతో ప్రాణ నష్టం కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. కాగా, ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వాల కంటే ప్రజలే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉంటేనే ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావాలి ఉండగా పిల్లలు, వృద్దులు బయటకి రాకపోవడమే మంచింది. అసలే కరోనా మహమ్మారి మళ్ళీ ఉదృతంగా వ్యాపిస్తుండగా ఈ ఎండలు కూడా తోడవడంతో వృద్ధులకు ప్రాణసంకటంగా మారింది. ఎండ వేడిమి నుండి తప్పించుకునేందుకు సాధ్యమైనంత వరకు ఎక్కువ ద్రవ పదార్ధాలను తీసుకోవాలని వృద్ధులకు వైద్యులు సూచిస్తున్నారు.

ఇక కరోనా జాగ్రత్తలలో భాగంగా శానిటైజర్లను వాహనాలలో తీసుకెళ్లే వాళ్ళు, శానిటైజర్లు ఎక్కువగా వినియోగించి ఎండకు బయటకు వెళ్లకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. శానిటైజ్ చేసుకున్న వారి చర్మం ఎండకు బర్న్ అవడం అధికంగా ఉంటుందని.. వాహనాలలో అయితే ప్రమాదాలకు కూడా కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరో మూడు రోజులు వైద్యుల సలహాలు, సూచనలతో అధిక ఉష్ణోగ్రతల నుండి మనల్ని మనమే కాపాడుకోవడమే అవసరం! 

 

 

ఆగ్రో బిల్లు..రైతులకే కాదు...రాష్ట్రాలకూ శాపమే!

ఆగ్రో బిల్లు..రైతులకే కాదు...రాష్ట్రాలకూ శాపమే!

   3 hours ago


స్టేటస్ సింబల్ గా పులస.. రూ.21 వేలకు పులస దక్కించుకున్న వైసీపీ నేత

స్టేటస్ సింబల్ గా పులస.. రూ.21 వేలకు పులస దక్కించుకున్న వైసీపీ నేత

   3 hours ago


భారీ విధ్వంసం సృష్టించనున్న మావోయిస్టులు.. వరంగల్ లో హై అలర్ట్

భారీ విధ్వంసం సృష్టించనున్న మావోయిస్టులు.. వరంగల్ లో హై అలర్ట్

   4 hours ago


బీజేపీకి అండగా వైసీపీ.. ఎలాంటి మొహమాటల్లేవు!

బీజేపీకి అండగా వైసీపీ.. ఎలాంటి మొహమాటల్లేవు!

   5 hours ago


ఏపీ పోలీస్ సేవ.. ఫిర్యాదులు చేసేందుకు పోలీస్ స్టేషన్లకు వెళ్లనక్కర్లేదు

ఏపీ పోలీస్ సేవ.. ఫిర్యాదులు చేసేందుకు పోలీస్ స్టేషన్లకు వెళ్లనక్కర్లేదు

   7 hours ago


కేంద్రానికి వ్యతిరేకంగా కేసీఆర్.. తదుపరి వ్యూహమేంటి?

కేంద్రానికి వ్యతిరేకంగా కేసీఆర్.. తదుపరి వ్యూహమేంటి?

   7 hours ago


ప్రైవేటు ఏజెన్సీలకు ధీటుగా టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలు

ప్రైవేటు ఏజెన్సీలకు ధీటుగా టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలు

   8 hours ago


వైద్యులపై దాడి చేస్తే కఠిన శిక్షలు.. జరిమానాలు

వైద్యులపై దాడి చేస్తే కఠిన శిక్షలు.. జరిమానాలు

   20-09-2020


కేంద్రం తీరు కూటమి ధర్మానికి చేటు!

కేంద్రం తీరు కూటమి ధర్మానికి చేటు!

   20-09-2020


ముందు గొయ్యి... వెనుక నుయ్యిలా అకాలీల పరిస్థితి!

ముందు గొయ్యి... వెనుక నుయ్యిలా అకాలీల పరిస్థితి!

   20-09-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle