newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

బాబోయ్.. ఈ మంత్రి పదవుల గోలేంటి?

03-05-201903-05-2019 07:34:59 IST
Updated On 02-07-2019 13:02:24 ISTUpdated On 02-07-20192019-05-03T02:04:59.839Z03-05-2019 2019-05-03T02:04:50.961Z - 2019-07-02T07:32:24.385Z - 02-07-2019

బాబోయ్.. ఈ మంత్రి పదవుల గోలేంటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇళ్ళలక గానే పండగ కాదంటారు. ఎన్నికలయిపోయాయి. ఎవరి లెక్కలు వారివి. ఆలూ లేదు చూలు లేదు..కొడుకు పేరు సోమ‌లింగం అన్నట్లు ఉంది వైసీపీ నేత‌లు వింత పోకడకు పోతున్నారు. ఎన్నిక‌లు ముగిశాయో లేదో.. ఇక త‌మదే అధికారం అన్నట్లుగా కొంద‌రు నేత‌లు వ్యవ‌హ‌రిస్తున్నారు. సర్వేలను చూసి చంకలు గుద్దుకుంటున్నారు.

ఏకంగా మే 23వ తేదీ రాత్రి నుంచే ...ఫ‌లితాలు వెలువ‌డిన వెంటనే త‌మ‌దే అధికారం అన్న రీతిలో వ్యవ‌హార శైలి మారిపోయింది. ఎప్పుడు ఫ‌లితాలు వ‌స్తాయా.. ఎప్పుడెప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తామా.. అని రోజులు లెక్కపెట్టుకుంటున్నార‌ట కొంద‌రు నేత‌లు. 

ఎన్నిక‌ల ఓటింగ్ స‌ర‌ళి గ‌మ‌నించాక.. ఇక వైసీపీదే అధికారం అని ఫిక్స్ అయిపోయార‌ట‌ చాలామంది నేతలు. అస‌లు ప్రజ‌ల తీర్పు ఎటు వ‌స్తుందో.. ఏం జ‌రుగుతుందో తెలియ‌క అయోమయంలో ఉంటే... వైసీపీ నేత‌ల అత్యుత్సాహం ఇప్పుడు పార్టీకి త‌ల‌నొప్పిగా మారిందంటున్నారు. ఫ‌లితాలు రాక‌మునుపే అధికారంలోకి వ‌చ్చేశామ‌ని చెప్పుకుని తిరుగుతుండ‌టంతో వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా సీరియ‌స్ అవుతున్నారు.

అంతేకాదు.. కొంద‌రు నేత‌ల అతి ప్రవ‌ర్తన‌తో.. భ‌విష్యత్తులో ఏం జ‌రుగుతుందోనన్న టెన్షన్ మొద‌లైంది. ఇప్పటికే అధికారంలోకి వ‌స్తామ‌ని చెబుతున్నప్పటికీ.. రేపు ఫ‌లితాల త‌ర్వాత సీన్ రివ‌ర్స్ అయితే ప్రజ‌ల్లో తమ పరువు పోవడం ఖాయమంటున్నారు. అందుకే సంయమనంతో ఉండమని సీరియస్ సలహా ఇచ్చారట జగన్ తమ పార్టీ సీనియర్ నేతలకు. 

అసలు సంగతి ఏంటంటే రాజ‌కీయ‌మంతా వైసీపీ కేంద్ర కార్యాల‌యం చుట్టూ తిరుగుతోంది. అతి చేస్తున్న నేత‌ల‌ను జ‌గ‌న్ రోజూ పార్టీ కార్యాల‌యానికి పిలిపించుకుని క్లాస్ పీకుతున్నారట. ఇంకొంద‌రు నేత‌ల‌ను మాత్రం జిల్లా ఇన్‌ఛార్జుల ద్వారా మంద‌లించేలా చేస్తున్నారు. కొన్ని బహిరంగ సభల్లో జగన్ కొంతమంది పేర్లు చెప్పారు.

అక్కడ కార్యకర్తల్లో, ప్రజలలో ఆయా నేతల ఇమేజ్ పెంచాలని జగన్ అలా చేసి ఉండవచ్చు. చిత్తూరు జిల్లాలో పోటీ చేసిన ఓ మ‌హిళా అభ్యర్థి.. వైసీపీ అధికారంలోకి రాగానే తాను హోంమంత్రి అవుతాన‌ని ప్రచారం చేసుకుంటున్నారు. ఒంగోలు జిల్లాకు చెందిన మ‌రో నేత తాను స్పీక‌ర్ అని, అనంత‌పురం జిల్లాకు చెందిన నేత త‌న‌కు నీటి పారుద‌ల శాఖ ద‌క్కబోతోంద‌ని ప్రచారం చేసుకుంటున్నారు. వీరు బాధ్యత‌లు స్వీక‌రించేందుకు ఏకంగా పండితుల‌ను పిలిపించుకుని ముహూర్తాలు కూడా పెట్టించుకుంటున్నట్టు భోగట్టా.

పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు నేతలు తాము గెలుస్తున్నట్టు త్వరలో మంత్రి అవుతానని ప్రచారం చేసుకుంటున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న వైసీపీ.. ఈసారి జిల్లాలో సగానికి సగం కొల్లగొడుతుందని అంచనా వేశారు. ఒక మంత్రిపై పోటీచేసిన సదరు నేతకు మంత్రి పదవి హామీ ఇచ్చారని తెలుస్తోంది.

మరోవైపు జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం కూడా పెట్టేశారని సమాచారం. సోషల్ మీడియాలో ఆ ముహూర్తానికి సంబంధించిన పత్రం ఒకటి హల్ చల్ చేస్తోంది. అదీ కథ. 

ఒక‌వైపు పార్టీ గెలుస్తుందో.. లేదో తెలియ‌దు.. మ‌రోవైపు నేత‌లు ఇలా త‌లో శాఖ త‌మ‌ది ప్రచారం చేసుకోవ‌డంతో అంద‌రూ ముక్కున వేలేసుకుంటున్నారు. అప్పుడెప్పుడో వచ్చిన దాసరి నారాయణరావు మూవీని నేతలు గుర్తుచేస్తున్నారు. వారి అనుచ‌రులు కూడా మ‌రీఇంత అత్యుత్సాహమా.. అని నోరెళ్లబెడుతున్నారు.

చివ‌రికి ఈ విష‌యం కాస్త.. అటు ఇటు తిరిగి పార్టీ అధినేత జ‌గ‌న్ చెవిన ప‌డింది. దీంతో స‌ద‌రు అతి నేత‌ల‌ను లోటస్‌పాండ్‌లోని కార్యాల‌యానికి పిలిపించుకుని మరీ తలంటి పంపేశారు. మే 23న ఫ‌లితాలు వ‌చ్చేవ‌ర‌కు ఎవ‌రూ మాట్లాడ‌వ‌ద్దని సూచించినట్టు సమాచారం. 

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

   2 hours ago


ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

   2 hours ago


మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

   2 hours ago


గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

   3 hours ago


భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

   3 hours ago


ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

   3 hours ago


భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   a day ago


రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

   a day ago


కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

   24-05-2020


లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

   24-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle